Guest Speech: రాబోయే కాలంలో శాస్త్ర, సాంకేతిక పోటీలో నిలబడాలంటే...
విద్య, శాస్త్ర (సైన్స్), సాంకేతికత (టెక్నాలజీ), నూతన పరిశోధనలు – అనే నాలుగు స్తంభాలు ఏ దేశాన్నైనా బలంగా నిలబెట్టేవి. ఈ నాలుగు స్తంభాలూ దేనికదే గణనీయమైన బలాన్ని సము పార్జించుకున్నప్పటికీ దేనికదే ఒంటరిగా చాలా కాలం పయనించాయి.
గతానుగతికమైన ఈ దృక్పథం మారాలి. అలా మారిన దృక్పథం ఎక్కువ ప్రయోజ నాలను పొందేలా చేస్తుంది. ఈ విధానం వలన ఉత్సుకతతో నడిచే ప్రాథమిక శాస్త్ర విజ్ఞాన పరిశో ధనలు, అనువర్తిత పరిశోధనలు అనే విభజనకు దారి తీసింది. నేటి ప్రాథమిక శాస్త్ర విజ్ఞానం త్వరలో సాంకే తికతా రూపంలోకి అనువర్తించ బడుతుందని గుర్తుంచుకోవాలి. గురుత్వాకర్షణ తరంగాలను కూడాఅంచనా వేసిన ఐన్‌స్టీన్ ‘సాపేక్షతా’ సిద్ధాంతం గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీ) అనే సాంకేతికతకు కచ్చితంగా అవసరమని ఆనాడు ఎవరూ ఊహించిఉండరు.
ఐన్‌స్టీన్ ప్రతిపాదించిన సాధారణ సాపేక్ష సిద్ధాంతం లేకుండా ఉపగ్రహాలు ఎలా కదులుతాయో కచ్చితంగా అంచనావేసి చెప్పలేం కదా. ఈ సందర్భంలో భారత ప్రభుత్వ ప్రధాన సాంకేతిక సలహాదారుగా, నా సహచరులతో కలిసి సాంకేతికతకు సంబంధించి ప్రస్తుత, భవిష్యత్ అవసరా లను రూపొందించే క్రమంలో మా ఆలోచనలను మీతో పంచుకోవాలనుకుంటున్నాము.
విఘాతం కలి గించే అభివృద్ధి కన్నా క్రమాభివృద్ధే మాకు ముఖ్యం. భారతదేశం అనేక రంగాలలో వైజ్ఞానిక విప్లవాల దిశగా దూసుకుపోతోంది. క్వాంటం టెక్నాలజీ, ఎమర్జింగ్ డిజిటల్ టెక్నాలజీ, ఆరోగ్య రక్షణ, క్లీన్ ఎనర్జీ వంటివి అందులో కొన్ని ముఖ్యమైనవి.
క్వాంటం విప్లవం గురించి రెండు మాటలు చెబుతాను. మొదటి క్వాంటం విప్లవం 1913–1925 మధ్య సంభవించింది. దీనివల్ల హైడ్రోజన్ అణువు వర్ణపట రేఖలు క్వాంటం పద్ధతి ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలిగాం. ప్రస్తుతం చూస్తున్న రెండవ క్వాంటం విప్లవంలో వ్యక్తిగతమైన, సంక్లిష్టమైన క్వాంటం సిస్టమ్‌లను నియంత్రించడంపై దృష్టి పెట్టడం కనిపిస్తుంది. అంటే సంప్రదాయ కంప్యూటర్‌లను ఉప యోగించి పరిష్కరించలేని సమస్యలను పరిష్కరించడమన్నమాట!
ఉదాహరణకు ప్రకృతిలో సహజ సిద్ధంగా జరిగే కిరణజన్య సంయోగక్రియలో సౌరశక్తిని రసాయనశక్తిగా మార్చగలిగే పత్రహరిత రేణువులూ, అలాగే వాటి అనుబంధ ద్రవ్యాల శక్తినీ ‘క్వాంటం మోడల్’ అనే చిత్రపటం ద్వారా కిరణజన్య సంయోగ క్రియ సమర్థతను తెలుసుకోవచ్చు. కొన్ని ప్రయోగ శాలల్లో ఇప్పటికే క్వాంటం కంప్యూటర్స్ ద్వారా ఏర్పాటు చేసిన ‘క్యూ బిట్స్’ ఉండటాన్ని మనం గమ నిస్తున్నాము. భారతదేశం క్వాంటం టెక్నాలజీకిసంబంధించి ఇటీవల ఒక మిషన్‌ను ప్రారంభించింది.
ఇవ్వాళ డిజిటల్ టెక్నాలజీ కృత్రిమ మేధ... యాంత్రిక శిక్షణ, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియా లిటీ, మిక్స్‌డ్ రియాలిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఇంట ర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి విషయాలపై దృష్టిని సారించింది. సాంకేతిక రంగంలో ప్రపంచపోటీలో నిలబడటానికి, పరిశోధన–అభివృద్ధి, లక్ష్యంగా సాంకే తిక అభివృద్ధి – విస్తరణయే సరైన మార్గం.
అందు వల్ల, మేము ఇప్పటికే అమెర్జింగ్, ఫ్యూచరిస్టిక్ టెక్నా లజీస్‌లపై వివిధ జాతీయ మిషన్లను రూపకల్పన చేశాం. సైబర్ ఫిజికల్ సిస్టమ్‌పై జాతీయ మిషన్, సెమీకండక్టర్లపై జాతీయ మిషన్, కృత్రిమ మేధపై జాతీయమిషన్ వంటివి ఇటువంటివే.
భారత్ కృత్రిమమేధ, యంత్ర అభ్యాసాన్ని, రోబోటిక్స్, టెలిహెల్త్‌ను ఉపయోగించుకొని స్వదేశీ యమైన కొత్త వైద్య పరికరాల తయారీలో ముంద డుగులో ఉంది. సాంకేతికంగా స్వాలంబనతో ఉండా లంటే మెరుగైన సాంకేతిక ఆధారిత ఉత్పత్తులనూ, సాంకేతిక ఆధారిత వ్యవస్థాపకతనూ సమాంతరంగా ప్రోత్సహించాలి.
శాస్త్ర, సాంకేతిక రంగాలకు సంబంధించిన విషయాలలో ఒకటి కంటే ఎక్కువ మార్గాల్లో భాగం కావడానికి మీ తరానికి ఇది అద్భుతమైన అవ కాశం. మీలో చాలా మంది భవిషత్తులో శాస్త్ర, సాంకే తిక రంగాలకు సంబంధించిన సవాళ్ళనూ, సామాజి కంగా ఎదురయ్యే అవరోధాలనూ పరిష్కరించడానికి కృషి చేస్తారని భావిస్తున్నాను.
- ఆచార్య అజయ్ కుమార్ సూద్