Skip to main content

Results: ఏఎఫ్‌యూ సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలు విడుదల

ఏఎఫ్‌యూ : కడప నగరంలోని డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ఆర్ట్స్‌ విశ్వవిద్యాలయంలో కాలేజ్‌ ఆఫ్‌ ఫైన్‌ఆర్ట్స్‌, స్కూల్‌ ఆఫ్‌ ప్లానింగ్‌కు సంబంధించిన 3వ, 7వ సెమిస్టర్‌ రెగ్యులర్‌ పరీక్షా ఫలితాలను వీసీ ఆచార్య బి. ఆంజనేయప్రసాద్‌ విడుదల చేశారు.
AFU Semester Exam Results Released   Results declaration for Dr. YSR Architecture and Fine Arts University, Kadapa city

ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ 3వ సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలలో 95 శాతం మంది, 7వ సెమిస్టర్‌లో 97 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు తెలిపారు. పరీక్షా ఫలితాలను కళాశాల వెబ్‌సైట్‌లో ఉంచినట్లు తెలిపా రు. తక్కువ సమయంలోనే పరీక్షా ఫలితాలను విడుదల చేసేందుకు కృషి చేసిన పరీక్షల విభాగాన్ని అభినందించారు.

చదవండి: Japan Rocket Experiment: జపాన్‌ ప్రయోగం.. ఆవుపేడతో రాకెట్‌ తయారీ!

డిప్యూటీ రిజిస్ట్రార్‌ రాజేష్‌కుమార్‌, సూ పరింటెండెంట్‌ పవన్‌కుమార్‌రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఇ.సి. సుప్రియ, సహాయ అధికారులు ఉదయ్‌ప్రకాష్‌రెడ్డి పాల్గొన్నారు.

Published date : 05 Jan 2024 10:41AM

Photo Stories