Japan Rocket Experiment: జపాన్ ప్రయోగం.. ఆవుపేడతో రాకెట్ తయారీ!
అంతరిక్ష పరిశోధనల్లో విప్లవాత్మకమైన పరిణామం చోటుచేసుకుంది. జపాన్ ఇంజినీర్లు ఆవుపేడతో అద్బుతం సృష్టించారు. ఆవు పేడతో పనిచేసే స్పేస్ రాకెట్ ఇంజిన్‌ను విజయవంతంగా ప్రయోగించారు. ఉద్గారాలను తగ్గిస్తూ కాలుష్యాన్ని తగ్గించడానికి ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఇంధన కొరత సమస్యలను కూడా పరిష్కరిస్తుంది.
Tesla unveils Optimus Gen 2: కొత్త తరం హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ జెన్ 2ను ఆవిష్కరించిన టెస్లా
జపానీస్ స్పేస్ స్టార్టప్ ఇంటర్‌స్టెల్లార్ టెక్నాలజీస్ సంస్థ హక్కైడో స్పేస్‌పోర్ట్ ద్వారా ఆవుపేడతో నడిచే రాకెట్‌ను ప్రయోగించారు. ఆవు పేడ నుంచి తయారయ్యే బయోమీథేన్ వాయువును ఈ రాకెట్ ఇంధనంగా ఉపయోగించుకుంటుంది. సహజవనరుల నుంచి తయారు చేసిన ఈ రాకెట్ ప్రయోగం అంతరిక్ష పరిశోధన రంగంలో కీలక మలుపు కానుంది. సాంప్రదాయ రాకెట్ ఇంజిన్లతో పోల్చితే.. బయోమీథేన్‌తో అతి తక్కువ ఖర్చులో రాకెట్ ప్రయోగాలు పూర్తి కానున్నాయి.
ISRO astronaut's Moon Mission: చందమామపై భారతీయ వ్యోమగాముల అడుగే తరువాయి!