Admissions: ఐటీఐలో ప్రవేశాలు.. చివరి తేదీ ఇదే
Sakshi Education
జగిత్యాల: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ ల్లో మూడో దశ ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆ హ్వానిస్తున్నట్లు జగిత్యాల ప్రభుత్వ ఐటీఐ ప్రి న్సిపాల్ రాజేశ్వర్‌రెడ్డి ఆగస్టు 18న తెలిపారు.
ఆగస్టు – 2023 సెషన్ కోసం ఎన్‌సీవీటీ ప్యాట్రన్ కింద ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ ట్రేడ్‌లలో శిక్షణ పొందడానికి రెండోదశలో మిగిలిన సీట్ల కోసం మూడోదశలో ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. ఆసక్తిగల విద్యార్థులు iti.telangana. gov.in వెబ్‌సైట్‌లో ధ్రువపత్రాల ఆధారాలతో ఆగస్టు 19 నుంచి 30వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
చదవండి:
Published date : 19 Aug 2023 01:32PM