77th Independence Day: ప్రతిభకు పదును
ఈ మేరకు స్థానిక సబ్ కలెక్టర్ కార్యలయ సమావేశ మందిరంలో విద్యార్థులకు ఆదివారం వక్తృత్వ, చిత్రలేఖనం, దేశభక్తి గీతాల పోటీలు నిర్వహించారు. వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన చిన్నారులు పాల్గొన, ప్రతిభ కనబరిచారు. నగరంలోని సుమారు 50పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. విజేతలకు ఆగస్టు 15న జరగనున్న వేడుకల్లో బహుమతులు అందించనున్నట్లు డీపీఆర్‌ఓ రబికుమార్ బెహరా తెలిపారు.
Also read: Enquiry Committee: విద్యార్థుల ఆత్మహత్యలపై విచారణ కమిటీ..కలెక్టర్ ఎం.వేణుగోపాల్‌రెడ్డి
ఎఫ్‌సీఐ ఆధ్వర్యంలో
జయపురం: జయపురం ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్‌సీఐ) విభాగం ఆధ్వర్యంలో పట్టణంలోని విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అమో సంస్కృతి ఆమో గర్వ్(మన సంస్కతి–మన గర్వం) అనే అంశంపై జరిగిన పోటీల్లో విద్యార్థులు పాల్గొని, తమ ఆలోచనలను వ్యక్త పరిచారు. ఎఫ్‌సీఐ జయపురం అధికారి బి.ధనేశ్వరరావు, బీకే ప్రధాన్, గైర హరిదాస్ పోటీలను పర్యవేక్షించారు.
-
వక్తృత్వ పోటీలో ప్రతిభ కనబరుస్తున్న విద్యార్థులు