సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయుల బదిలీలకు దరఖాస్తు గడువు ఫిబ్రవరి 14తో ముగుస్తోంది.
బదిలీలకు 6,982 దరఖాస్తులు
కోర్టు ఆదేశంతో 317 జీవో ద్వారా బదిలీ అయిన టీచర్లకూ బదిలీ అవకాశం కల్పించారు. దీంతో ఇప్పటి వరకు 6,982 దరఖాస్తులు అందినట్లు తెలంగాణ పాఠశాల విద్య డైరెక్టర్ దేవసేన తెలిపారు. ఫిబ్రవరి 12 నుంచి మొదలైన దరఖాస్తుల ప్రక్రియ క్రమంగా ఊపందుకుంది. చివరి రోజు ఎక్కువ దరఖాస్తులు వచ్చే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 317 ద్వారా బదిలీ అవ్వని టీచర్ల నుంచి ఇప్పటికే 59 వేల దరఖాస్తులు అందాయి.