School Students: 31 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్.. కీలక ఆదేశాలు జారీ..
దీంతో విద్యార్థులు కరోనా బారినపడుతున్నారు. తాజాగా కర్నాటకలోని ఓ పాఠశాలలో కరోనా కలకలం సృష్టించింది. ఏకంగా 31 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. న్యూ స్టాండర్డ్ పాఠశాలలో చదువుతున్న 21 మంది విద్యార్థులు, ఎంఈఎస్ స్కూల్‌లో ఐదో తరగతి చదువుతున్న పది మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. 24 గంటల్లోనే వీరందరూ కరోనా బారినపడటం ఆందోళక కలిగిస్తోంది. ఇక, సదరు విద్యా సంస్థల్లో విద్యార్థులకు వ్యాక్సినేషన్ చేసే సమయంలో వారికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. వారు కరోనా బారినపడినట్టు తెలిసిందే.
కీలక ఆదేశాలు జారీ..
దీంతో.. అప్రమత్తమైన పాఠశాలల యాజమాన్యం వెంటనే రెండు పాఠశాలలను శానిటైజ్ చేపించారు. మరోవైపు.. కర్ణాటక వైద్యారోగ్య శాఖ అధికారులు కీలక ఆదేశాలు జారీ చేశారు. కరోనా పాజిటివ్ కేసులు నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు, విద్యార్థులకు, సిబ్బందికి తప్పనిసరిగా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని తెలిపింది. కరోనా లక్షణాలు ఉంటే.. వారికి వెంటనే కొవిడ్ పరీక్షలు చేయించాలని స్పష్టం చేసింది. సిబ్బందికి రెండు డోసుల టీకాతో పాటు బూస్టర్ డోస్ తీసుకున్నారో లేదో స్పష్టంగా తెలుసుకోవాలని ఆదేశించింది.
ఇటు తెలంగాణలో మాత్రం..
తెలంగాణలో వేసవి సెలవుల పొడగింపుపై తల్లిదండ్రుల్లో కాస్త అయోమయం, కరోనా కేసులు పెరుగుతున్నాయనే ఆందోళన నెలకొంది. అయితే పొడగింపు ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని, యథాతథంగా స్కూల్స్ తెరుచుకుంటాయని తెలంగాణ విద్యాశాఖ ఇప్పటికే ఒక స్పష్టత ఇచ్చింది. కరోనా జాగ్రత్తలతో పాఠశాలలు నడిపించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు.