Nursing Colleges: 157 నర్సింగ్ కాలేజీలు
Sakshi Education
న్యూఢిల్లీ: ఇప్పటికే ఉన్న వైద్య కళాశాలలకు అనుబంధంగా రూ.1,570 కోట్ల వ్యయంతో నూతనంగా 157 నర్సింగ్ కళాశాలల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది.
సంబంధిత కేబినెట్ భేటీ నిర్ణయాలను ఆ తర్వాత మీడియాకు కేంద్ర ఆరోగ్య మంత్రి మన్‌సుఖ్ మాండవీయ ఢిల్లీలో చెప్పారు. ‘కొత్త కాలేజీల రాకతో ఏటా దాదాపు 15,700 కొత్త నర్సింగ్ గ్రాడ్యుయేట్ సీట్లు అందుబాటులో ఉంటాయి. ప్రతీ కాలేజీలు 100 బీఎస్సీ(నర్సింగ్) సీట్లు ఉంటాయి.
చదవండి: ఈఏపీసెట్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్‌లు
మొత్తం 157కుగాను యూపీలో 27, రాజస్థాన్‌లో 23, మధ్యప్రదేశ్‌లో 14, తమిళనాడు, పశ్చిమబెంగాల్‌లో చెరో 11 , కర్ణాటకలో నాలుగు కాలేజీలు నెలకొల్పుతాం’ అని మాండవీయ చెప్పారు. బ్రిటన్‌లో 26 వేల మంది, అమెరికాలో 16వేల మంది, ఆస్ట్రేలియాలో 12వేల మంది, గల్ఫ్ దేశాల్లో 20వేల మంది భారతీయ నర్సులు సేవలందిస్తున్నారు.
Published date : 27 Apr 2023 04:11PM