ఈఏపీసెట్ ద్వారా బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్‌లు
ఈ మేరకు డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ రాధిక రెడ్డి మార్చి 15న నోటిఫికేషన్ జారీ చేశారు. ఇంటరీ్మడియట్ మెరిట్ ఆధారంగా కాకుండా ఏదైన ప్రత్యేక పరీక్షలో అర్హత ఆధారంగా నర్సింగ్ కోర్సుల్లో అడ్మిషన్‌లు చేపట్టేలా ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ (ఐఎన్‌సీ) నిబంధనలు తెచ్చింది. జాతీయ స్థాయిలో నీట్ నర్సింగ్ పరీక్షను నిర్వహించే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈఏపీసెట్ ద్వారా అడ్మిషన్‌లు చేపట్టేలా ప్రభుత్వం అనుమతులిచ్చింది.
చదవండి: ఈఏపీసెట్ - న్యూస్ | గైడెన్స్ | గెస్ట్ కాలమ్ |
ఇతర రాష్ట్రాల వారు మన దగ్గర నర్సింగ్ విద్య చదవడానికి వస్తుంటారు. ఈ క్రమంలో యాజమాన్య కోటా సీట్లకు సంబంధించి ఈఏపీసెట్‌తో పాటు, నీట్–యూజీ అర్హతను పరిగణలోకి తీసుకోనున్నారు. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం ప్రత్యేక అర్హత పరీక్షల్లో జనరల్ కేటగిరి అభ్యర్థులు 50 పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు 40 పర్సంటైల్, జనరల్ వికలాంగ అభ్యర్థులు 45 పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వికలాంగ అభ్యర్థులు 40 పర్సంటైల్ అనేది కనీస అర్హతగా నిర్ణయించారు.
చదవండి: AP EAPCET 2023: ఏపీ ఈఏపీసెట్-2023 నోటిఫికేషన్ వివరాలు.. దరఖాస్తులకు చివరి తేదీ ఇదే..