Skip to main content

BRAOU: అంబేడ్కర్ వర్సిటీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఇదే..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్ యూనివర్సిటీ ప్రాంతీయ అధ్యయన కేంద్రం ప్రథమ సంవత్సరం విద్యార్థులు, ద్వి తీయ సంవత్సరం 4వ సెమిస్టర్‌ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదలైందని సహాయ సంచాలకులు డాక్టర్‌ ఎం.అజంతకుమార్‌ డిసెంబర్‌ 21న ఓ ప్రకటనలో తెలిపారు.
BRAOU
అంబేడ్కర్ వర్సిటీ పరీక్షల నోటిఫికేషన్ విడుదల.. చివరి తేదీ ఇదే..

పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అపరాధ రుసుం లేకుండా ఏపీ ఆన్ లైన్ లో డిసెవబర్‌ 23 లోపు ఫీజు చెల్లించాలన్నారు. రూ.200 అపరాధ రు సుంతో 28వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చునన్నారు. ఫీజులను సకాలంలో చెల్లించి పరీక్షలకు హాజరు కావాలి్సందిగా సూచించారు. పరీక్షలకు నాలుగు రోజుల ముందు హాల్‌ టికెట్‌లను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో డౌన్ లోడ్‌ చేసుకోవాలన్నారు. మరింత సమాచారం కోసం మాచవరంలో ఎస్‌ఆర్‌ఆర్‌ అండ్‌ సీవీఆర్‌ ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలోని యూనివర్సిటీ అధ్యయన కేంద్రంలో స్వయంగా కానీ, వెబ్‌సైట్‌లో కానీ, 7382929642 నంబర్‌లో కానీ సంప్రదించాలి్సందిగా సూచించారు.

చదవండి: 

అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2021–22 ప్రవేశాలు

11 యూనివర్సిటీల్లో 2,837 ప్రొఫెసర్‌ పోస్టులు ఖాళీ.. మోక్షమెప్పుడో..?

Published date : 22 Dec 2021 03:58PM

Photo Stories