Skip to main content

అంబేడ్కర్‌ వర్సిటీ డిగ్రీ, పీజీ కోర్సుల్లో 2021–22 ప్రవేశాలు

సాక్షి, హైదరాబాద్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వర్సిటీలో డిగ్రీ కోర్సులు, పీజీ కోర్సుల్లో, లైబ్రరీ సైన్స్‌, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి వర్సిటీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
ఈ మేరకు మంగళవారం అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు తదితర వివరాలను www.braouonline.in, www.braou.ac.in పొందవచ్చన్నారు. 2020–21 విద్యా సంవత్సరం మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ పొందిన విద్యార్థులు రెండో సంవత్సర ట్యూషన్‌ ఫీజును, అంతకు ముందు అడ్మిషన్‌ పొంది సకాలంలో ఫీజు చెల్లించలేక పోయిన వారూ ఆగస్టు 12లోపు ట్యూషన్‌ ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలని తెలిపారు. పూర్తి సమాచారం కొరకు సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని లేదా విశ్వవిద్యాలయ హెల్ప్‌డెస్క్‌ నంబర్లు 7382929570/580, లేదా 040–23680290/ 291/294/295లో సంప్రదించవచ్చన్నారు.
Published date : 23 Jun 2021 02:18PM

Photo Stories