IAS Success Journey : స్మార్ట్‌గా ఆలోచించింది.. ఐఏఎస్ ఆఫీసర్ అయ్యాందిలా.. కానీ మళ్లీ..
సాధించాలనే కసి మనలో ఉంటే.. విజయం కశ్చితంగా వస్తుందని అంటున్నారు ''అంబిక రైనా' . ఇంతకు ఈమె ఎవరు..? ఈమె సాధించిన విజయం ఏమిటి..? మొదలైన వివరాలు కింది సక్సెస్ స్టోరీలో చదవండి..
కుటుంబ నేపథ్యం :
అంబిక రైనా..జమ్మూ కాశ్మీర్‌కు చెందిన వారు. ఈమె తండ్రి ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్. అంబిక తండ్రి ఇండియన్ ఆర్మీలో మేజర్ జనరల్ కావడంతో చిన్నప్పటి నుంచే.. క్రమశిక్షణ, దృఢ సంకల్పాన్ని నింపారు. తండ్రి ఉద్యోగ రిత్యా ఈమె వివిధ రాష్ట్రాల్లో నివసించాల్సి వచ్చింది.
☛ 22 ఏళ్లకే ఐఏఎస్‌కు ఎంపికై..రెండేళ్లకే ఉద్యోగానికి రాజీనామా..ఆ తర్వాత ఉచితంగా
ఎడ్యుకేషన్ :
తండ్రి ఇండియన్ ఆర్మీ ఉద్యోగి కావడంతో చదువు వివిధ రాష్ట్రాల్లో సాగింది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని సీఈపీటీ యూనివర్శిటీ నుంచి ఆర్కిటెక్చర్‌లో డిగ్రీని పూర్తి చేసి.. ఆ తరువాత స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్‌లోని ఒక కంపెనీ నుంచి ఇంటర్న్‌షిప్ ఆఫర్‌తో పాటు ఇతర కంపెనీల నుంచి ఉద్యోగ ఆఫర్‌లను కూడా పొందింది.
మంచి శాలరీలు వచ్చే ఉద్యోగాలను సైతం..
జమ్మూ కాశ్మీర్‌కు చెందిన అంబిక రైనా మంచి శాలరీలు వచ్చే ఉద్యోగాలను సైత వదులుకుని, అనుకున్న విధంగా ఐఏఎస్ సాధించి అందరికి ఆదర్శంగా నిలిచింది. అందివచ్చిన ఉద్యోగాలను సైతం వదులుకుని ఐఏఎస్ కావాలనే లక్ష్యంతో అటువైపుగానే అడుగులు వేసింది.
సివిల్స్ మొదటి రెండు ప్రయత్నాలలో..
మొదటి రెండు ప్రయత్నాలలో అనుకున్న లక్ష్యాన్ని చేజిక్కించుకోలేకపోయినప్పటికీ.. పట్టువదలకండా ప్రయత్నం చేసి మూడవ సారి ఐఏఎస్ జాబ్ కొట్టేసింది. నిజానికి అబ్రాడ్‌లో ఉద్యోగమంటే చాలామంది ఎగిరి గంతేసి మరీ వెళ్ళిపోతారు. ఎందుకంటే కొందరు జీతమే లక్ష్యంగా పని చేస్తారు. మరి కొందరు అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి అడుగులు వేస్తారు.
అంబిక రైనా దైర్యంకు..
ఈ విధంగా ముందుకు వెళ్లే క్రమంలో ఎన్ని గొప్ప అవకాశాలు వచ్చినప్పటికీ, వాటన్నింటిని వదులుకుని ముందుకు వెళ్ళిపోతారు. కానీ అంబిక రైనా స్వీట్జర్లాండ్ దేశంలో మంచి మంచి కంపెనీలు భారీ వేతనం ఇస్తమని ఆఫర్లు వచ్చినా.. అవి ఏవి లెక్కచేయకుండా ఇండియాకి వచ్చి తాను అనుకున్న సివిల్స్ సాధించి ఐఏఎస్ ఆఫీసర్ అయ్యారు. అంబిక రైనా దైర్యంకు.. తాను తీసుకున్న నిర్ణయంకు మనం అభినంధించాల్సిందే. ఎంతో మంది మహిళలకు అంబిక రైనా ఐఏఎస్ సక్సెస్ జర్నీ... ఒక స్ఫూర్తిగా నిలుస్తోంది.
Tags
- Ambika Raina IAS
- Ambika Raina IAS Success Story in Telugu
- Ambika Raina IAS Real Story in Telugu
- Ambika Raina IAS Inspire Story in Telugu
- Ambika Raina IAS Education
- Ambika Raina IAS Family
- Ambika Raina IAS Real Life Story
- Ambika Raina IAS News in Telugu
- women Ias success stories
- women ias success story in telugu
- UPSC
- upsc civils rankers interview videos telugu
- upsc civils rankes success stories in telugu
- motivational story in telugu
- motivational storyCivil Services Success Stories motivational story in telugu Success Story
- CivilServicesPreparation
- ConfidentStudent
- UPSCJourney
- PreparationGoals
- CivilServicesPreparation
- sakshi education success story
- Success Story