Skip to main content

Merugu Nagarjuna: సివిల్స్‌కు ఉచిత శిక్షణ అభినందనీయం

సాక్షి, అమరావతి: లాభాపేక్ష లేకుండా సివిల్‌ సర్వీస్‌ పరీక్షలకు అనుభవజ్ఞులైన అధ్యాపకులు, అత్యుత్తమ ప్రమాణాలతో ఉచితంగా శిక్షణ ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున కితాబిచ్చారు.
Merugu Nagarjuna
సివిల్స్‌కు ఉచిత శిక్షణ అభినందనీయం

విజయవాడకు చెందిన విజన్‌ ఫౌండేషన్‌ ‘విద్యాదర్శిని ఐఏఎస్‌’ పోస్టర్‌ను మంత్రి నాగార్జున మే 25న ఆవిష్కరించారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన  కార్యక్రమంలో నాగార్జున మాట్లాడుతూ.. విజయవాడలో విజన్‌ ఫౌండేషన్‌ వారు లాభాపేక్ష లేకుండా యూపీఎస్సీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం సంతోషమన్నారు.

చదవండి: సివిల్స్ - స్టడీ మెటీరియల్ | సక్సెస్ స్టోరీస్ | ఎఫ్‌ఏక్యూస్ | గైడెన్స్ | వీడియో లెక్చర్స్ | జనరల్ ఎస్సే | జీకే

ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పిల్లలకు ఈ ఫౌండేషన్‌ ఎంతో మేలు చేస్తుందని, దీన్ని అందరూ వినియోగించుకోవాలని మంత్రి నాగార్జున సూచించారు. విజన్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు జి.విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ 2015 నుంచి తాము యూపీఎస్సీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు మే 31వ తేదీలోపు తమ వెబ్‌సైట్‌  ఠిజీఛీy్చఛ్చీటటజిజీnజీ.జీn లో అప్లికేషన్‌ పూర్తి చేసి సమర్పించాలని సూచించారు. వివరాలకు 9346196829 నంబర్‌లో సంప్రదించవచ్చని అన్నారు.  

Published date : 26 May 2023 03:59PM

Photo Stories