Skip to main content

Yantra India Jobs 2023 : ప‌దో త‌ర‌గ‌తి అర్హ‌త‌తో 5,395 ఉద్యోగాలు.. ఎటువంటి ప‌రీక్ష‌.. ఇంట‌ర్య్వూ లేకుండానే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని నాగ్‌పుర్‌లోని యంత్ర ఇండియా లిమిటెడ్ దేశవ్యాప్తంగా ఉన్న పలు రాష్ట్రాల్లోని ఫ్యాక్టరీల్లో పనిచేయడానికి 5,395 అప్రెంటిస్‌ల‌కు నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ట్రేడ్‌ అప్రెంటిస్‌ శిక్షణకు ఐటీఐ, నాన్‌ ఐటీఐ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
yantra india limited jobs telugu news
yantra india limited Jobs 2023 Details

తెలంగాణ‌లో 438 ఖాళీలు..
దేశంలోని ఆర్డ్‌నెన్స్ కేబుల్ ఫ్యాక్టరీ- చండీగఢ్, గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఇటార్సీ, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- ఖమారియా, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- కట్ని, వెహికల్ ఫ్యాక్టరీ- జబల్‌పూర్, హై ఎక్స్‌ప్లోజివ్ ఫ్యాక్టరీ- కిర్కీ, మెషిన్ టూల్ ప్రొటోటైప్‌ ఫ్యాక్టరీ- అంబర్‌నాథ్, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ- అంబఝరి, ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీ ప్రాజెక్ట్- మెదక్ తదితర ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో 438 ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఖాళీల్లో ఐటీఐకు సంబంధించి 3,508, నాన్ ఐటీఐకు సంబంధించి 1887 ఖాళీలు ఉన్నాయి.

☛ UPSC Recruitment 2023: యూపీఎస్సీ–ఈపీఎఫ్‌వోలో 557 పోస్టులు

అర్హ‌త‌లు ఇవే..
పదో తరగతితో పాటు, మెషినిస్ట్, ఫిట్టర్, టర్నర్, వెల్డర్, పెయింటర్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, మేసన్, ఎలక్ట్రోప్లేటర్, మెకానిక్, ఫౌండ్రీమ్యాన్, బాయిలర్ అటెండెంట్, అటెండెంట్ ఆపరేటర్ కెమికల్ ప్లాంట్ తదితర ట్రేడుల్లో ఐటీఐలో కనీసం 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత పొంది ఉండాలి. 

☛ నాన్-ఐటీఐ కేటగిరీకికి పోస్టులకు పదో తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐలో ఉత్తీర్ణులై ఉండాలి. 

వ‌యోప‌రిమితి : 
28.03.2023 నాటికి 15- 24 సంవత్సరాల మధ్య. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు

ద‌ర‌ఖాస్తు చివ‌రి తేదీ :
ఆసక్తి కలిగిన వారు మార్చి 28లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఫీజు :

దరఖాస్తు సమయంలో రూ.200, ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు/మహిళలు/ట్రాన్స్‌జెండర్ అభ్యర్థులకు రూ.100లు అప్లికేషన్‌ ఫీజు చెల్లించాలి. 

ఎంపిక విధానం : 
విద్యార్హతలో అభ్యర్థులు సాధించిన మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. ఎటువంటి రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఉండదు.

TSSPDCL Recruitment 2023: టీఎస్‌ఎస్పీడీసీఎల్‌లో 1553 జూనియర్‌ లైన్‌మ్యాన్‌ పోస్టులు 

జీతం : 
ఎంపికైన వారికి నెలకు నాన్-ఐటీఐలకు రూ.6000, ఐటీఐలకు రూ.7000ల చొప్పున స్టైపెండ్ చెల్లిస్తారు. ఇతర సమాచారం అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు ఇవే.. :
దరఖాస్తులు ప్రారంభం: ఫిబ్రవరి 27, 2023.
దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: మార్చి 28, 2023.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్ :https://www.yantraindia.co.in/career.php

5,395 ఉద్యోగాల పూర్తి వివ‌రాలు ఇవే..

Published date : 02 Mar 2023 07:28PM
PDF

Photo Stories