Skip to main content

Jobs in Virology: వైరాలజీ సంస్థలో ఉద్యోగాలు.. దరఖాస్తు చివ‌రి తేది ఎప్పుడంటే..

పుణెలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ (SIV) 80 గ్రూప్ బీ, సీ, టెక్నికల్‌ నాన్‌ మినిస్టీరియల్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.
Jobs in Virology   National Institute of Virology (SIV)  NIV Pune Campus

కంప్యూటర్ బేస్‌డ్‌ టెస్ట్‌ (CBT), డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 49 టెక్నికల్‌ అసిస్టెంట్, 31 టెక్నీషియన్‌-1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అన్‌రిజర్వుడ్‌కు 36, ఎస్సీలకు 11, ఎస్టీలకు 05, ఓబీసీలకు 21, ఈడబ్ల్యూఎస్‌లకు 07 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూ ఉండదు. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 10 కాగా, కంప్యూటర్ బేస్‌డ్‌ టెస్ట్‌ 16, 17 తేదీల్లో ఉంది. దరఖాస్తు రుసుము రూ.300. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళలకు ఫీజు లేదు. ముంబయి (ఎంఎంఆర్‌డీఏ రీజియన్‌), పుణెలో పరీక్ష కేంద్రాలు. పూర్తి వివరాల కోసం https://niv.recruitlive.in/ వెబ్ సైట్‌ను సంప్ర‌దించండి. 

▶ టెక్నికల్‌ అసిస్టెంట్ పోస్టులకు మైక్రోబయాలజీ/ మెడికల్‌ మైక్రోబయాలజీ/ వైరాలజీ అండ్‌ ఇమ్యునాలజీ/ జువాలజీ/ బయోకెమిస్ట్రీ/ బయోటెక్నీలజీ/ బయోఫిజిక్స్‌/ జెనిటిక్స్‌లో డిగ్రీ ఫస్ట్‌క్లాస్‌లో పాస్ అయ్యిండాలి. 

▶ టెక్నీషియన్‌-1 పోస్టులకు సైన్స్‌ సబ్జెక్ట్‌తో ఇంటర్మీడియట్‌ 55 శాతం మార్కులు సాధించిండాలి. ఏడాది వ్యవధి ఉండే డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ల్యాబొరేటరీ టెక్నాలజీ ఉత్తీర్ణత. 

JNTUH: ఆన్‌లైన్ సర్టిఫికెట్‌ కోర్సులకు జేఎన్‌టీయూ నోటిఫికేష‌న్‌.. కోర్సు కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోండిలా..

ఎంపిక ఎలా ఉంటుందంటే..?
కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్ ప్రశ్నాపత్రం ఇంగ్లిష్‌ లేదా హిందీ భాషలో ఉంటుంది. 100 మల్టిపుల్‌ ఛాయిస్‌ ఆబ్జెక్టివ్‌ టైప్‌ ప్రశ్నలకు 100 మార్కులు. ప్రశ్నాపత్రంలో రెండు సెక్షన్‌లు ఉంటాయి. సెక్షన్ ఏ 30 మార్కులకు, సెక్షన్ బీ 70 మార్కులకు ఉంటుంది. ప్రశ్నకు 1 మార్కు చొప్పున కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికీ 1/4 మార్కు తగ్గిస్తారు. 90 నిమిషాల వ్యవధి ఉంటుంది. 
సీబీటీకి 95 శాతం వెయిటేజీ, 5 శాతం వెయిటేజీ పరిశోధన/ల్యాబ్‌/క్షేత్రస్థాయి అనుభవానికి ఉంటుంది. రెండెళ్ల అనుభవానికి 1 మార్కు, 2 నుంచి 4 సంవత్సరాల అనుభవానికి 2 మార్కులు, 4 నుంచి 6 ఏళ్ల అనుభవానికి 3 మార్కులు, 6 నుంచి 8 సంవత్సరాల అనుభవానికి 4 మార్కులు, 8 ఏళ్లకు పైగా అనుభం ఉన్న‌వారికి 5 మార్కులు యాడ్ చేస్తారు.

Engineering PhD Admissions: JNTUA పార్ట్ టైమ్/ ఫుల్ టైమ్ PhD అడ్మిషన్ నోటిఫికేషన్ 2024

Published date : 06 Dec 2023 07:55AM

Photo Stories