Skip to main content

KVS Notification: ఫిబ్రవరి 7నుంచి కేంద్రీయ విద్యాలయాల పోస్టులకు పరీక్షలు... మీ ఎగ్జామ్‌ ఎప్పుడో చూసుకున్నారా...?

దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో భారీగా టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 13,404 ఉద్యోగాల భర్తీకి ఇప్పటికే నోటిఫికేషన్‌ జారీ చేసింది.

అయితే ఆయా పరీక్షల షెడ్యూల్‌ను తాజాగా విడుదలచేసింది. పీఆర్‌టీ, టీజీటీ, పీజీటీ, వైస్‌ ప్రిన్సిపల్, ప్రిన్సిపల్, మ్యూజిక్‌ టీచర్, లైబ్రేరియన్‌, ఇతర పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష నిర్వహించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌  నిర్ణయించింది.
పోస్టులు.. సీబీటీ పరీక్ష తేదీలివే...
అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టులకు ఫిబ్రవరి 7న జరగనుండగా.. ప్రిన్సిపల్‌ పోస్టులకు ఫిబ్రవరి 8న నిర్వహించనున్నారు.
వైస్‌ ప్రిన్సిపల్, పీఆర్‌టీ (మ్యూజిక్‌) ఉద్యోగాలకు ఫిబ్రవరి 9, 
టీజీటీ పోస్టులకు ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు
పీజీటీ పోస్టులకు ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు

చ‌ద‌వండి: నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి


ఫైనాన్స్‌ ఆఫీసర్, ఏఈ, హిందీ ట్రాన్స్‌లేట‌ర్స్‌ ఉద్యోగాలకు ఫిబ్రవరి 20న
పీఆర్‌టీ ఉద్యోగాలకు ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు
జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు మార్చి 1 నుంచి 5 వరకు
స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ 2 ఉద్యోగాలకు మార్చి 5
లైబ్రేరియన్, అసిస్టెంట్‌ సెక్షన్‌  ఆఫీసర్, సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు మార్చి 6న పరీక్ష నిర్వహించనుంది. పరీక్షలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ https://kvsangathan.nic.in/  వీక్షించాలని సూచించింది.
ప్రతిభ ఉంటేనే ఎంపిక....
రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితర అంశాల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్‌ 5న మొదలైన ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ జనవరి 2తో ముగిసింది.  

Published date : 20 Jan 2023 07:10PM

Photo Stories