Latest News: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు.. కారణం ఇదే..
Sakshi Education
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు రద్దు చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం వెల్లడించింది.
ప్రత్యేక కోటా కింద కేటాయిస్తున్న ఈ సీట్లపై.. ఈ మేరకు కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) ఏప్రిల్ 13వ తేదీన (బుధవారం) ప్రకటన చేసింది. కేవీఎస్ ఇప్పటి వరకు ఒక్కో ఎంపీకి కోటా కింద 10 సీట్లు కేటాయిస్తూ వస్తోంది. అయితే ఈ కోటా పెంచాలని ఎంపీలు డిమాండ్ చేస్తుండగా.. ఇప్పుడు ఏకంగా కోటాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం విశేషం.తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకూ అడ్మిషన్లు ఉండవని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్పెషల్ ప్రొవిజన్ కింద ఎంపీలు, కేంద్ర ఉద్యోగుల పిల్లలు, కేంద్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతల పిల్లలు సహా 19 కేటగిరీల్లో కోటా కేటాయింపులు ఉంటూ వచ్చాయి.
Published date : 13 Apr 2022 05:29PM