Skip to main content

Jobs: భారతీయ వైమానిక దళంలో ఉద్యోగాలు

సాక్షి, హైదరాబాద్‌: భారతీయ వైమానిక దళంలో అగ్నివీర్‌ వాయులు ఉద్యోగాల్లో చేరడానికి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
Jobs
భారతీయ వైమానిక దళంలో ఉద్యోగాలు

2002, డిసెంబర్‌ 26 నుంచి 2006, జూన్‌ 26 మధ్య జని్మంచిన అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులని పేర్కొంది. అభ్యర్థులు ఇంటర్మీడియట్‌/10+2/తత్సమానం ఉత్తీర్ణులై ఉండి, కేంద్రం/రాష్ట్రం ఆమోదించిన విద్యా బోర్డుల నుంచి ఏదైనా స్ట్రీమ్‌/సబ్జెక్ట్‌ పరీక్షల్లో కనీసం 50% మార్కులు, ఆంగ్లంలో 50% మార్కులు సాధించాలని తెలిపింది.

చదవండి: మాజీ అగ్నివీర్‌లకు ఈ ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్‌

ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్‌ ఇన్‌స్టిట్యూట్‌ డిప్లొమా కోర్సులు ఉత్తీర్ణులైన వారు, రెండేళ్ల ఒకేషనల్‌ కోర్సు రాష్ట్ర ఎడ్యుకేషన్‌ బోర్డులు/కౌన్సిల్‌లు గుర్తింపు పొందిన కోర్సులో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చునని స్పష్టం చేసింది. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి మార్చి 31 చివరి తేదీ అని పేర్కొంది. వివరాలకు https://agnipathvayu.cdac.inను సందర్శించాలని సూచించింది. 

చదవండి: Agnipath Scheme: ఆర్మీలో భారీగా ఉద్యోగాలు.. అగ్నివీర్ రిక్రూట్‌మెంట్‌కు ఇలా అప్లై చేసుకోండి

Published date : 25 Mar 2023 01:14PM

Photo Stories