Skip to main content

Agnipath Jobs: అగ్నివీర్‌ నియామకాలకు నోటిషికేషన్‌ విడుదల.. ముఖ్య‌మైన తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్‌: అగ్నిపథ్‌ పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.
agniveer recruitment
agniveer recruitment 2022

ఇండియన్‌ ఆర్మీలో అగ్నివీర్‌ నియామకాలకు నోటిషికేషన్‌ విడుదల చేసింది. అంతేగాక ఎయిర్‌ఫోర్స్‌, నేవీలో కూడా అగ్నివీర్‌ నియామకాల కోసం తేదీలను ప్రకటించింది. జూన్ 24వ తేదీన ఎయిర్‌ఫోర్స్‌ అగ్నివీర్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

Agnipath Scheme Details: అసలు అగ్నిపథ్ అంటే ఏమిటి...? దీని లాభ‌న‌ష్టాలు ఏమిటి?

ఈ రోజు ద‌ర‌ఖాస్తులు ప్రారంభం :

Indian Army Applications


ఇండియన్ ఆర్మీలో చేరేందుకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 20వ తేదీ నుంచే దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు  అగ్నిపథ్‌ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి షెడ్యూల్‌ విడుదల చేసింది. ఓ వైపు అగ్నిపథ్‌ పథకానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనల జ్వాలలు రగులుతుంటే.. మరోవైపు కేంద్రం మాత్రం ఈ పథకం కింద నియామకాలకు తగ్గేదేలే అంటూ ముందుకు వెళ్తోంది.

Defence Jobs: సంచలన నిర్ణయం.. సైన్యంలో చేరాలంటే ఇవి తప్పక తెలుసుకోండి..

శిక్ష‌ణ ఇలా..:

agniveer training


ఎంపికైన వారికి 10 వారాల నుంచి 6 నెలల వరకు శిక్ష‌ణ ఉంటుంది. నాలుగేళ్ల త‌ర్వాత కేవ‌లం 25 శాతం మంది సైనికుల్ని మాత్ర‌మే ఆర్మీలోకి రెగ్యుల‌ర్ క్యాడ‌ర్‌గా తీసుకుంటారు. వాళ్లు మాత్ర‌మే 15 ఏళ్లపాటు స‌ర్వీస్‌లో ఉంటారు. మిగతా వాళ్ల‌కు 12 ల‌క్ష‌లు ఇచ్చి ఇంటికి పంపిస్తారు. వాళ్ల‌కు పెన్ష‌న్ బెనిఫిట్ ఉండ‌దు.

నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్‌..
అగ్నిపథ్  పథకంలో భాగంగా సైన్యంలో పనిచేసి రిటైర్‌ అయిన అగ్నివీరులకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు, అస్సాం రైఫిల్స్ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్ ఉంటుంది. అలాగే ఈ రెండు బలగాల్లో చేరడానికి కావాల్సిన గరిష్ఠ వయోపరిమితిలోనూ అగ్నివీరులకు మూడేళ్ల సడలింపు ఉంటుంది. తొలిబ్యాచ్‌ అగ్నివీరులకు వయోపరిమితిలో మొత్తంగా ఐదేళ్ల సడలింపు లభించనున్నట్లు స్పష్టం చేసింది.

Army Recruitment: ఏఏ దేశాల్లో సైనిక నియామకాలు ఎలా ఉన్నాయంటే..?

జీతం ఇలా..
ఉద్యోగం కొన‌సాగిస్తున్న స‌మ‌యంలో అగ్ని వీర్లకు 30వేల నుంచి 40వేల రూపాయల జీతం లభిస్తుంది.

Year

Customised Package (Monthly)

In Hand (70%)

Contribution to Agniveer Corpus Fund (30%)

Contribution to corpus fund by GoI

All figures in Rs (Monthly Contribution)

1st Year

30000

21000

9000

9000

2nd Year

33000

23100

9900

9900

3rd Year

36500

25580

10950

10950

4th Year

40000

28000

12000

12000

Total Contribution in Agniveer Corpus Fund after four years

Rs 5.02 Lakh

Rs 5.02 Lakh

ముఖ్య‌మైన తేదీ ఇలా..:
ఇండియ‌న్ ఆర్మీ నోటిఫికేష‌న్ తేదీ : జూన్ 20వ తేదీ 
ద‌ర‌ఖాస్తు ప్రారంభం తేదీ: జూన్ 20వ తేదీ నుంచే..

ఇండియ‌న్ నేవీ నోటిఫికేష‌న్ తేదీ : జూన్ 21వ తేదీన‌

ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్‌ నోటిఫికేష‌న్ తేదీ : జూన్ 24వ తేదీన‌

అర్హ‌త‌లు ఇవే..

agniveer recruitment 2022

 

Published date : 20 Jun 2022 03:46PM

Photo Stories