Government Teacher Jobs : గుడ్ న్యూస్.. 38,800 టీచర్ ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
ఈ సందర్భంగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం 38,800 మంది ఉపాధ్యాయులను నియమించనున్నట్టు తెలిపారు.
740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో..
ఏకలవ్య స్కూళ్లకు టీచర్లు, సపోర్ట్ స్టాఫ్‌ను రిక్రూట్ చేయనున్నారు. రానున్న మూడేళ్లలో ఈ స్కూళ్లకు 38,800 వేల మంది టీచర్లను, ఇతర సహాయక సిబ్బందిని రిక్రూట్ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. అలాగే దేశవ్యాప్తంగా ఉన్న 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో సుమారు 3.5 లక్షల మంది గిరిజన విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. 2014 నుంచి ఏర్పాటైన 157 మెడికల్ కాలేజీలతో పాటు కొత్తగా 157 నర్సింగ్ కాలేజీలను కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే గిరిజనుల పీవీటీజీ మిషన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు లోక్‌సభలో వెల్లడించారు. గిరిజనుల సామాజిక-ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి పీఎంపీ బీటీజీ డెవలప్‌మెంట్ మిషన్‌ను అని చెప్పారు. వచ్చే 3 సంవత్సరాలలో ఈ పథకాన్ని అమలుకు రూ. 15,000 కోట్లు అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు ఆమె వెల్లడించారు.
యూనియన్ బడ్జెట్‌లోని ముఖ్యమైన అంశాలు ఇవే..
☛ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడెతున్న ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్..
☛ ఐదోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్న నిర్మలాసీతారామన్..
☛ మత్యకారులకు రూ.6 వేల కోట్ల నిధులు కేటాయింపు..
☛ వ్యవసారంగంలో సవాళ్లు ఎదుర్కొనేందుకు ప్రాధాన్యం..
☛ శ్రీఅన్న పథకం ద్వారా చిరుధాన్యాల పంటలకు ప్రోత్సాహం
☛ రైతులు, మహిళలు, వెనుకబడివారికి ప్రాధాన్యత
☛ క్లీన్ ప్లాంట్ ప్రోగ్రాంకు రూ.2 వేల కోట్లు..
☛ 157 కొత్త నర్సింగ్ కళాశాలల ఏర్పాటు..
☛ వ`ద్ధి రేటు 7 % ఉంటుందని అంచనా..
☛ మహిళల కోసం మరిన్ని పథకాలు..
☛ వ్యవసాయ అభివ`ద్ధికి ప్రత్యేక నిధి ఏర్పాటు..
☛ ఆత్మనిర్భన్ భారత్‌తో చేనేత వర్గాలకు చేయూత
☛ పీఎం ఆవాస్ యోజనకు రూ.79 కోట్లు కేటాయింపు..
☛ కొనసాగనున్న ఉచిత ఆహార ధాన్యాల పంపిణీ..
☛ ఎస్పీ, ఎస్టీ, ఓబీసీల అభివ`ద్దే లక్ష్యంగా బడ్జెట్..
☛ రైల్వేకు రూ.2.40 లక్షల కోట్లు కోటాయింపు..
☛ ఏకలవ్య పాఠశాలకు 30,800 మంది ఉపాధ్యాయులు నియామకం
☛ యువత కోసం నేషనల్ డిజిటల్ లైబ్రరీల ఏర్పాటు..
☛ గిరిజన మిషన్ కోసం రూ.10 వేల కోట్లు కేటాయింపు..
☛ రాష్ట్రాలకు వడ్డీలేని రుణాలు పథకం కోసం రూ.13.7 లక్షల కోట్లు కేటాయింపు..
☛ కరువు ప్రాంత రైతులకు రూ.5,300 కోట్లు కేటాయింపు..
☛ వ్యక్తిగత గుర్తింపు కోసం పాన్, ఆధార్, డీజీ లాక్
☛ మొత్తం రూ.75 వేల కోట్లు మౌలిక సదుపాయాల కల్పన..
☛ అర్బన్ ఇన్ ఫ్రా ఫండ్ కింద ఏడాది రూ.10 వేల కోట్లు..
☛ 5జీ సర్వీస్ కోసం 100 ల్యాబ్‌లు ఏర్పాటు..
☛ 50 ఏయిర్‌పోర్టులు, పోర్టుల పునరుద్దరణ..
☛ ఫిషరీస్ కోసం ప్రత్యేక నిధి..
☛ ఈ కోర్టు ప్రాజెక్టుకు రూ.7 వేల కోట్లు..
☛ మూడు కొత్త ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ సెంటర్లు
☛ రూ.20 లక్షల కోట్లు వ్యవసాయ రుణాలు
☛ మేక్ ఏ వర్క్ మిషన్ ప్రారంభం
☛ గోబర్ధన్ పథకం కింద 200 బయోగ్యాస్ ప్లాంట్‌లు ఏర్పాటు
☛ కొత్త రైల్వే ట్రాక్‌ల నిర్మాణానికి ప్రాధాన్యత..
☛ నేషనల్ గవర్నెస్ డేటా పాలసీ ద్వారా సులభమైన కేవైసీ..
☛ 2070 నాటికి కార్బన రహిత భారత్ లక్ష్యం
☛ త్వరలో ఎన్నికలు జరగనున్న కర్ణాటకకు పెద్ద పీట
☛ కర్ణాటకలోని కరువు ప్రాంతాల అభివృద్ధికి రూ.5300 కోట్ల కేంద్ర సాయం
☛ సివిల్ సర్వెంట్లకు నైపుణ్యాభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు..
Budget 2023 LIVE Updates: కేంద్ర బడ్జెట్ 2023-24.. లైవ్ అప్‌డేట్స్