Skip to main content

అగ్నివీర్‌కు11 మంది ఎంపిక

నారాయణపేట రూరల్‌: రక్షణ రంగంలో కొలువులకు సంబంధించి తాజా ఎంపిక ప్రక్రియలో 11 మంది నారాయణపేటవాసులు స్థానం సంపాదించారు.
11 people are selected for Agniveer Jobs
అగ్నివీర్‌కు11 మంది ఎంపిక

పట్టణంలోని మినీ స్టేడియం గ్రౌండ్‌లో ఆర్మీ సైనికుడు ఆంజనేయులు నిర్వహించిన వారియర్స్‌ డిఫెన్స్‌ అకాడమీలో శిక్షణ పొందిన 11మంది అభ్యర్థులు అగ్నివీర్‌కు ఎంపికయ్యారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన నోటిఫికేషన్‌ ద్వారా మార్చిలో రాత పరీక్ష, సెప్టెంబర్‌లో ఫిజికల్‌ టెస్టుకు హాజరై తాజాగా విడుదలైన ఫలితాల్లో తమ స్థానం పదిలం చేసుకున్నారు. సెప్టెంబ‌ర్ 26న‌ వారిని కలెక్టర్‌ శ్రీహర్ష శాలువాతో సన్మానించారు.

Published date : 27 Sep 2023 04:59PM

Photo Stories