Skip to main content

విశాఖలో అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రారంభం.. చివ‌రీ తేదీ ఇదే..

ఏపీలో అగ్నివీర్‌ తొలి రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ విశాఖలో ప్రారంభమైంది.
Agniveer Army Recruitment Rally
విశాఖలో అగ్నివీర్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ప్రారంభం.. చివ‌రీ తేదీ ఇదే..

శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినాడ, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలతో పాటు యానాం అభ్యర్థులకు విశాఖ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో రిక్రూట్‌మెంట్‌ నిర్వహిస్తున్నారు. ఆగస్టు 13 అర్థరాత్రి నుంచే ర్యాలీ మొదలైంది. అభ్యర్థులను ఆన్‌లైన్‌లో జారీ చేసిన అడ్మిట్‌ కార్డుల ఆధారంగా మైదానంలోకి పంపించారు. బ్యాచ్‌లుగా విభజించి.. ఎత్తు, బరువు, ఇతర అంశాల్ని పరిశీలించారు. లాంగ్‌ జంప్, హైజంప్, పరుగు పందెం, ఫిజికల్‌ టెస్ట్‌లు నిర్వహించారు. ఎంపికైన వారికి మెడికల్‌ టెస్టులు నిర్వహించారు. తదుపరి విడత అభ్యర్థులను ఆగస్టు 14 అర్థరాత్రి 12 గంటల నుంచి మైదానంలోకి అనుమతించారు. ఆగస్టు 31 వరకు ఈ రిక్రూట్‌మెంట్‌ కొనసాగుతుంది.

చదవండి: 

Published date : 15 Aug 2022 03:24PM

Photo Stories