Skip to main content

Central Varsities Jobs: కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో భారీగా ఉద్యోగాలు... పూర్తి వివరాలు

దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో పోస్టుల భర్తీకి కేంద్ర మంత్రి ఆదేశం. ఖాళీగా ఉన్న పోస్టులన్నిటినీ భర్తీ చేయాలని వర్సీటీల వైస్‌ చాన్స్‌లర్‌ల‌ను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆదేశించారు.
Central Varsities Jobs
కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో భారీగా ఉద్యోగాలు... పూర్తి వివరాలు

అందుకు నిర్ణీత గడువును నిర్దేశించారు. సెప్టెంబ‌రు 10వ తేదీకల్లా ఉద్యోగాల ప్రకటనలను వెలువరించి అక్టోబరు చివరికల్లా నియామకాల ప్రక్రియను పూర్తిచేయాలని స్పష్టం చేశారు. సెంట్రల్‌ యూనివర్సిటీల్లో ప్రస్తుతం ఆరు వేలకు పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సెప్టెంబ‌రు 3న‌ కేంద్రీయ విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్స్‌లర్‌ల‌తో నిర్వహించిన వీడియోకాన్ఫరెన్స్‌లో మంత్రి ప్రసంగించారు. పూర్వవిద్యార్థుల ధార్మిక నిధి కోసం ఒక ఫ్రేమ్‌వర్క్‌ ఏర్పాటు చేయాలన్నారు. దేశంలోని 23 ఐఐటీల్లో పరిశ్రమలతో కలిసి నవంబరులో ఆర్‌ అండ్‌ డీ ఫెయిర్‌ ఏర్పాటు చేయాలని సూచించారు.

కేటగిరీల వారీగా ఖాళీల వివరాలు...
ఎస్సీ -
 1,012 
ఎస్టీ - 592
ఓబీసీ - 1,767
ఈడబ్ల్యూఎస్ - 805
దివ్యాంగులు - 355

Published date : 04 Sep 2021 05:55PM

Photo Stories