Skip to main content

యూపీఎస్సీ- సీఎంఎస్‌ఈ-2019

కేంద్ర వైద్యారోగ్య సర్వీసుల్లో ‘డాక్టర్లు’గా చేరేందుకు వీలుకల్పించే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)-‘కంబైన్‌‌డ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎంఎస్‌ఈ)’ నోటిఫికేషన్ విడుదలైంది. ఇండియన్ రైల్వే, ఇండియన్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీలు, సెంట్రల్ హెల్త్ సర్వీస్ విభాగాల్లో ‘మెడికల్ ఆఫీసర్’ పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఏటా పరీక్ష నిర్వహిస్తోంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, పర్సనాలిటీ టెస్టుల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంబీబీఎస్ పూర్తిచేసి.. పీజీ ప్రవేశ పరీక్షకు సన్నద్ధమయ్యే వారు ప్రత్యేక ప్రిపరేషన్ లేకుండానే సీఎంఎస్‌ఈ ద్వారా స్థిరమైన ఉద్యోగాన్ని దక్కించుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య: 965.
ఖాళీల వివరాలు:
అసిస్టెంట్ డివిజినల్ మెడికల్ ఆఫీసర్ ఇన్ రైల్వేస్ : 300
అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఇండియన్ ఆర్డ్‌నెన్స్ ఫ్యాక్టరీస్ హెల్త్ సర్వీసెస్ : 46.
సెంట్రల్ హెల్త్ సర్వీసెస్‌లో జూనియర్ స్కేల్ పోస్టులు : 250.
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ ఇన్ న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ : 7.
జనరల్ డ్యూటీ మెడికల్ గ్రేడ్-2 ఆఫీసర్ ఇన్ ఈస్ట్, నార్త్, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్స్: 362.

అర్హతలు..
ఎంబీబీఎస్ రాత పరీక్షలు, ప్రాక్టికల్స్ పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఫైనలియర్ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. కంపల్సరీ రొటేటింగ్ ఇంటర్న్‌షిప్‌లో ఉన్న విద్యార్థులు కూడా దరఖాస్తుకు అర్హులే. అయితే ఇంటర్న్‌షిప్ పూర్తిచేసిన తర్వాతే నియామకం లభిస్తుంది. అభ్యర్థి మానసికంగా, శారీరకంగా ఫిట్‌గా ఉండాలి.

వయసు: 2019, ఆగస్టు 1 నాటికి 32 ఏళ్ల లోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీహెచ్‌సీ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.

రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ :
  • కంబైన్‌‌డ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. పార్ట్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్ష. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కుల చొప్పున మొత్తం 500 మార్కులు కేటాయించారు. పార్ట్-2 పర్సనాలిటీ టెస్ట్‌కు 100 మార్కులున్నాయి. పార్ట్-1 కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హులైన వారికే పార్ట్-2 పరీక్ష నిర్వహిస్తారు.
  • పార్ట్-1లో రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులు. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం కేటాయించారు. ఈ పరీక్షలో నెగిటివ్ మార్కింగ్ విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి మూడో వంతు మార్కుల కోత విధిస్తారు.
  • పేపర్-1లో జనరల్ మెడిసిన్ నుంచి 96 ప్రశ్నలు, పీడియాట్రిక్స్ నుంచి 24 ప్రశ్నలు అడుగుతారు. మొత్తంగా 120 ప్రశ్నలు ఉంటాయి.
  • పేపర్-2లో సర్జరీ, గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెట్రిక్స్, ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ విభాగాలు ఉంటాయి. ఒక్కో సెక్షన్ నుంచి 40 ప్రశ్నలతో మొత్తంగా 120 ప్రశ్నలు ఉంటాయి. వీటికి కేటాయించిన మార్కులు 250.

పేపర్-1 సిలబస్ :
జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్: కార్డియాలజీ, రెస్పిరేటరీ డిసీజెస్, గ్యాస్ట్రో ఇంటెస్టినల్, జెనిటో యురినరీ, న్యూరాలజీ, హెమటాలజీ, ఎండోక్రినాలజీ, మెటబాలిక్ డిసీజెస్, ఇన్ఫెక్షన్స్-కమ్యూనికబుల్ డిసీజెస్, న్యూట్రిషన్/గ్రోత్, డెర్మటాలజీ, మస్కులోస్కెలిటిల్ సిస్టమ్, సైకియాట్రీ, జనరల్ అంశాలపై ప్రశ్నలుంటాయి. వీటితోపాటు పీడియాట్రిక్స్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి. కొత్తగా ఎమర్జెన్సీ మెడిసిన్, కామన్ పాయిజనింగ్, స్నేక్ బైట్, ట్రోఫికల్ మెడిసిన్, క్రిటికల్ కేర్ మెడిసిన్, మెడికల్ ప్రొసీజర్స్, పాథో సైకలాజికల్ బేసిస్ ఆఫ్ డిసీజెస్, వ్యాక్సిన్స్ ప్రివెంటబుల్ డిసీజెస్, నాన్ వ్యాక్సిన్స్ ప్రివెంటబుల్ డిసీజెస్, విటమిన్ డెఫిషియన్సీ డిసీజెస్, సైకియాట్రీలో లోతుగా సబ్జెక్ట్ అడుగుతారు.
  • పీడియాట్రిక్స్‌లో కామన్ చైల్డ్‌హుడ్ ఎమర్జెన్సీస్, న్యూబార్న్ బేబీ కేర్; నార్మల్ డవలప్‌మెంటల్ మైల్‌స్టోన్స్, యాక్సిడెంట్స్ అండ్ పాయిజనింగ్స్ ఇన్ చిల్డ్రన్, బర్త్ డిఫెక్ట్స్ అండ్ కౌన్సెలింగ్ ఇన్‌క్లూడింగ్ ఆటిజం, ఇమ్యూనైజేషన్ ఇన్ చిల్డ్రన్, చైల్డ్ హెల్త్‌కు సంబంధించిన జాతీయ స్థాయి ప్రోగ్రాములు మొదలైన అంశాలపై ప్రశ్నలు అడుగుతారు.

పేపర్-2 సిలబస్ :
  • జనరల్ సర్జరీ సిలబస్‌లో భాగంగా..గాయాలు, కాలేయం, రక్త నాళాలు, పేగులు, కణితులు, ఉదర సంబంధ సమస్యలు తదితరాలకు సంబంధించిన శస్త్రచికిత్సల అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటితోపాటు యూరలాజికల్ సర్జరీ, న్యూరో సర్జరీ, ఈఎన్‌టీ సర్జరీ, థొరాసిక్ సర్జరీ, ఆర్థోపెడిక్ సర్జరీ, ఆఫ్తమాలజీ, అనస్థీషియాలజీ, ట్రామటాలజీ అంశాలు సిలబస్‌లో ఉన్నాయి. గాయాలను నయం చేయడం, షాక్ పాథో ఫిజియాలజీ అండ్ మేనేజ్‌మెంట్, సర్జికల్ పేషెంట్స్‌కు సంబంధించిన జాగ్రత్తలు మొదలైన విభాగాలు ఉన్నాయి.
  • గైనకాలజీ అండ్ ఆబ్‌స్టెట్రిక్స్‌లో ప్రసూతికి సంబంధించి గర్భ పరిస్థితులు, ప్రసవానంతర పరిస్థితులపై ప్రశ్నలు ఉంటాయి. గైనకాలజీలో అప్లయిడ్ అనాటమీ, అప్లయిడ్ ఫిజియాలజీ, జెనిటల్ ట్రాక్ట్‌లో ఇన్ఫెక్షన్లు, నియోప్లాస్మా, గర్భాశయం స్థానంలో మార్పులు వంటివాటిపై ప్రశ్నలుంటాయి. కన్వెన్షనల్ కాంట్రాసెప్టివ్‌‌స, యూడీ, ఓరల్ పిల్స్, ఆపరేటివ్ ప్రొసీజర్, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంశాలుంటాయి.
  • ప్రివెంటివ్ అండ్ సోషల్ మెడిసిన్ సెక్షన్‌లో.. సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్, కాన్సెప్ట్ ఆఫ్ హెల్త్, డిసీజ్, ప్రివెంటివ్ మెడిసిన్, హెల్త్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ప్లానింగ్, డెమోగ్రఫీ అండ్ హెల్త్ స్టాటిస్టిక్స్, ఎన్విరాన్‌మెంటల్ హెల్త్, న్యూట్రిషన్ అండ్ హెల్త్, ఆక్యుపేషనల్ హెల్త్, జెనిటిక్స్ అండ్ హెల్త్, ఇంటర్నేషనల్ హెల్త్, మెడికల్ సోషియాలజీ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్, మెటర్నల్ అండ్ చైల్డ్‌హెల్త్, నేషనల్ ప్రోగ్రామ్స్, కామన్ హెల్త్ ప్రోగ్రామ్స్ నిర్వహణ, ఎప్పటికప్పుడు వాటిని పర్యవేక్షించడం, చైల్డ్ వెల్‌నెస్‌పై అవగాహన తదితర అంశాలపై అభ్యర్థుల పరిజ్ఞానాన్ని పరిక్షిస్తారు.

సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్‌కు ప్రాధాన్యం :
పేపర్-2లోని పార్ట్-సిగా ఉండే ప్రివెంటివ్ సోషల్ అండ్ కమ్యూనిటీ మెడిసిన్‌కు సిలబస్‌లో గతేడాది నుంచి ప్రాధాన్యం లభిస్తోంది. సామాజిక ఆరోగ్య స్థితిగతులపై అవగాహనను పెంచేవిధంగా ఈ టాపిక్‌ను సిలబస్‌లో చేర్చారు. మేనేజ్‌మెంట్ ఆఫ్ కామన్ హెల్త్ ప్రాబ్లమ్స్, ఎబిలిటీ టు మానిటర్ నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్(జాతీయ ఆరోగ్య పథకాల పర్యవేక్షణ సామర్థ్యం), నాలెడ్జ్ ఆఫ్ మెటర్నల్ అండ్ చైల్డ్ వెల్‌నెస్, ఎబిలిటీ టు రికగ్నైజ్, ఇన్వెస్టిగేట్, రిపోర్ట్, ప్లాన్ అండ్ మేనేజ్ కమ్యూనిటీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఇన్‌క్లూడింగ్ మాల్‌న్యూట్రిషన్ అండ్ ఎమర్జెన్సీస్ అంశాలను చేర్చడం ద్వారా డాక్టర్ల వైద్యానికి సంబంధించిన సామాజిక స్పృహను అంచనా వేస్తారు.

ఇంటర్వ్యూ.. అవగాహన, నైతికత :
  • కంప్యూటర్ ఆధారిత పరీక్షలో ప్రతిభ కనబర్చిన మెరిట్ అభ్యర్థులను పర్సనాలిటీ టెస్ట్‌కు ఆహ్వానిస్తారు. దీనికి 100 మార్కులు కేటాయించారు. అకడమిక్ నేపథ్యానికి సంబంధించి అభ్యర్థులకున్న అవగాహన, నైతికత, నేర్చుకోవాలనే ఉత్సుకత, నిర్ణయాలు తీసుకునే సమర్థత, భావప్రసార నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం, నాయకత్వ లక్షణాలు తదితర వాటిని ఇంటర్వ్యూలో పరీక్షిస్తారు.
  • ఆన్‌లైన్ పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌లో కనబర్చిన ప్రతిభ, ఖాళీల ఆధారంగా, అభ్యర్థుల ప్రాధాన్య క్రమాన్ని అనుసరించి వివిధ విభాగాల్లో నియమిస్తారు.

2018 సీఎంఎస్‌ఈ కటాఫ్ వివరాలు..
కంప్యూటర్ ఆధారిత పరీక్షలో కటాఫ్ మార్కు (మొత్తం 500 మార్కులకు)... జనరల్ కేటగిరి అభ్యర్థులకు 253, ఓబీసీ 222, ఎస్సీ 246, ఎస్టీ 219గా ఉంది. పర్సనాలిటీ టెస్ట్ అనంతరం ఫైనల్ ఎంపిక కటాఫ్ మార్కులు.. మొత్తం 600 మార్కులకు.. కటాఫ్ మార్కులు జనరల్ అభ్యర్థులకు 325, ఓబీసీలకు 296, ఎస్సీలకు 364, ఎస్టీలకు 278.
Published date : 06 May 2019 05:54PM

Photo Stories