వీటికి ప్రాధాన్యం ఇస్తూ.. సివిల్స్ ప్రిలిమ్స్‌లో ముందుకు..
Sakshi Education
ప్రిలిమ్స్‌కు సన్నద్ధమవుతోన్న అభ్యర్థులు ప్రిపరేషన్‌లో టెస్టు సిరీస్‌లకు ప్రాధాన్యం ఇవ్వాలి. కనీసం 30–40 టెస్టు సిరీస్‌లకు హాజరయ్యేలా ప్రణాళికలు రూపొందించుకోవాలి. దీంతోపాటు స్వీయ పరీక్ష విధానాన్ని అనుసరించాలి. తద్వారా స్వీయ సామర్థ్యం, ప్రశ్నల తీరుపై అవగాహన లభిస్తుంది. టెస్టు సిరీస్ వివరణల్లోని కొత్త అంశాలను నోట్ చేసుకొని అధ్యయనం చేయాలి. తద్వారా ప్రిపరేషన్ పరంగా బలపడటంతోపాటు ప్రశ్నలు ఏ విధంగా అడిగినా.. గందరగోళానికి గురికాకుండా ఉంటారు.
సబ్జెక్టులు–ప్రశ్నలు
ప్రిలిమ్స్–2020 జనరల్ స్టడీస్ పేపర్–1లో సబ్జెక్టుల వారీగా అడిగిన ప్రశ్నలు
హిస్టరీ | 18 |
ఎకానమీ | 14 |
పాలిటీ | 16 |
ఎన్విరాన్‌మెంట్–ఎకాలజీ | 17 |
జాగ్రఫీ | 10 |
సైన్స్ అండ్ టెక్నాలజీ | 10 |
కరెంట్ అఫైర్స్ | 15 |
ఇంకా చదవండి: part 6: వీటి సాధన.. సివిల్స్ ప్రిలిమ్స్ విజయంలో కీలక పాత్ర పోషిస్తుందిలా..
Published date : 27 Feb 2021 03:00PM