Skip to main content

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు కేరాఫ్.. యూపీఎస్సీ

రాబోయే సంవత్సరానికి సంబంధించి.. ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లోనే కేలండర్ ప్రకటన..! క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు.. దరఖాస్తుల స్వీకరణ.. ఆరునూరైనా ముందుగా ప్రకటించిన తేదీనే పరీక్ష నిర్వహణ.. ఎలాంటి అవకతవకలు, అనుమానాలకు తావు లేకుండా ఫలితాల వెల్లడి.. దేశ సివిల్/డిఫెన్స్ విభాగాల్లో ఉన్నత ఉద్యోగాల్లో ప్రతిభావంతులకే పట్టం..దేశ అత్యున్నత సర్వీస్.. సివిల్ సర్వీసెస్ పరీక్షలు మొదలు... ఇంజనీరింగ్ సర్వీసెస్.. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ పరీక్ష.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్.. జియాలజిస్టు పరీక్ష.. ఇండియన్ ఎకనమిక్ సర్వీస్/ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్.. స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్..కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ పరీక్ష.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, నావల్ అకాడమీ ఎగ్జామినేషన్.. సెంట్రల్ పోలీస్ ఫోర్సెస్ (అసిస్టెంట్ కమాండెంట్స్).. సెక్షన్ ఆఫీసర్స్/స్టెనోగ్రాఫర్స్(గ్రేడ్- బి/గ్రేడ్-1) వరకూ.. పలు నియామక పరీక్షలు జరుపుతూ నిరుద్యోగుల పాలిట కల్పతరువుగా నిలుస్తోంది యూపీఎస్సీ. యూపీఎస్సీ నిర్వహించే పరీక్షలు.. అర్హతలు.. ఎంపిక ప్రక్రియపై సమగ్ర కథనం...

  1. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్
    సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా మొత్తం 24 సర్వీసుల్లో ఉద్యోగులను ఎంపిక చేస్తారు. వాటిలో ప్రధానమైనవి ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ (ఇండియన్ ఫారెన్ సర్వీస్) మొదలైనవి.
    అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
    వయోపరిమితి: గతేడాది వరకు జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 30 ఏళ్లుగా ఉండేది. అయితే ఈ ఏడాది నుంచి మరో రెండేళ్లు పొడిగించారు. దీని ప్రకారం జనరల్ కేటగిరీ అభ్యర్థులు 32 ఏళ్ల వరకు సివిల్స్ పరీక్షలు రాసుకోవచ్చు. అదేవిధంగా ఓబీసీలకు ఇంతకుముందు మూడేళ్లు సడలింపు ఉండగా ఇప్పుడు దాన్ని మరో రెండేళ్లు పెంచారు. అంటే ఓబీసీలకు గరిష్ట వయోపరిమితి 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు ఇంతకు ముందు ఐదేళ్లు సడలింపు ఉండగా దీన్ని మరో రెండేళ్లకు పెంచారు. వీరు 37 ఏళ్ల వరకు సివిల్స్ రాసుకోవచ్చు. అయితే ఈ వర్తింపు 2014, 2015కు మాత్రమేనా! లేదా ఎప్పటికీనా అనే దానిపై స్పష్టత లేదు. సివిల్స్ ప్రకటనతోపాటే ఈ వివరాలు తెలిసే అవకాశం ఉంది.

    ప్రయత్నాల సంఖ్య:
    గతేడాది వరకు సివిల్స్ పరీక్షలను జనరల్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టంగా నాలుగుసార్లు మాత్రమే రాసుకునే వీలుండేది. ఈ ఏడాది నుంచి దాన్ని ఆరుసార్లుకు పెంచారు. ఓబీసీలకు ఇప్పటివరకు ఏడుసార్లు సివిల్స్ రాసుకునే అవకాశం ఉండేది. ఈ ఏడాది నుంచి తొమ్మిదిసార్లు రాసుకునే వీలు కల్పించారు. ఎస్సీ, ఎస్టీలు, శారీరక వికలాంగులు గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు.

    ఎంపిక విధానం:
    సివిల్స్ ఎంపిక మూడు దశలుగా ఉంటుంది. అవి.. 1. ప్రిలిమినరీ, 2. మెయిన్స్ 3. ఇంటర్వ్యూ.
    ప్రిలిమ్స్: సివిల్స్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులుంటాయి. పేపర్-1లో 100 ప్రశ్నలు, పేపర్-2లో 85 ప్రశ్నలు ఉంటాయి. మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ఒక్కో పేపర్ పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు. ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే.
    మెయిన్స్: ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులాధారంగా ఒక్కో పోస్టుకు 12.5 మందిని మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు.

    మెయిన్స్ పరీక్ష విధానం:
    పేపర్-ఏ:
    ఇందులో 300 మార్కులకు పేపర్-ఏ ఉంటుంది. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగును ఎంచుకుని రాయొచ్చు. సంబంధిత మాతృభాషల్లో అభ్యర్థి సామర్థ్యాన్ని తెలుసుకునే ఉద్దేశంతో ఈ పరీక్షను నిర్వహిస్తారు.
    పేపర్-బి: ఇంగ్లిష్ (300 మార్కులు). ఇంగ్లిష్‌లో అభ్యర్థికి సాధారణ పరిజ్ఞానం ఉందో, లేదో పరిశీలించడం ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశం. పేపర్-ఏ, పేపర్-బి మార్కులను చివరి ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. ఇవి కేవలం అర్హత పరీక్షలు మాత్రమే. అయితే అభ్యర్థులు ఈ రెండింటిలోనూ కనీస మార్కులు సాధిస్తేనే మిగిలిన పేపర్లను మూల్యాంకనం చేస్తారు.

    ఎంపికలో ప్రభావం చూపించే మెయిన్స్ ప్రధాన పేపర్లు
    పేపర్-1 (ఎస్సే) - మార్కులు:
    250
    పేపర్-2 (జనరల్ స్టడీస్-1 (ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ)) - మార్కులు: 250
    పేపర్-3 (జనరల్ స్టడీస్-2 (పాలన, రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు) - మార్కులు: 250
    పేపర్-4 (జనరల్ స్టడీస్-3 (టెక్నాలజీ, ఆర్థికాభివృద్ధి, జీవవైవిధ్యం, పర్యావరణం, రక్షణ, విపత్తు నిర్వహణ)) - మార్కులు: 250
    పేపర్-5 (జనరల్ స్టడీస్-4 (ఎథిక్స్, ఇంటిగ్రిటీ, ఆప్టిట్యూడ్))- మార్కులు: 250.
    పేపర్-6 (ఆప్షనల్ సబ్జెక్ట్ - పేపర్-1) - మార్కులు: 250
    పేపర్-7 (ఆప్షనల్ సబ్జెక్ట్ - పేపర్-2) - మార్కులు: 250
    పరీక్ష సమయం: ఒక్కో పేపర్‌కు మూడు గంటలు.
    మౌఖిక పరీక్ష: మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్లను దృష్టిలో పెట్టుకుని పోస్టుకు 2.5 మందిని మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తారు. దీనికి 275 మార్కులుంటాయి.
    ప్రకటన: మే 17, 2014, దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 16, 2014,
    ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: ఆగస్టు 24, 2014,
    మెయిన్స్ పరీక్షలు: డిసెంబర్ 14, 2014 నుంచి

  2. కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్
    కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా ఇండియన్ మిలిటరీ, నావల్, ఎయిర్‌ఫోర్స్, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీల్లో ప్రవే శం లభిస్తుంది. ఏడాదికి రెండుసార్లు సీడీఎస్‌ఈని నిర్వహిస్తారు.
    విద్యార్హత:
    • మిలిటరీ అకాడమీ, ఆఫీసర్ ట్రైనింగ్ అకా డమీ పోస్టులకు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
    • నావల్ అకాడమీకి ఇంజనీరింగ్ ఉత్తీర్ణులు, ఎన్‌సీసీ ద్వారా ఎంట్రీకి బీఎస్సీ మ్యాథ్స్ లేదా ఫిజిక్స్ ఉత్తీర్ణులై ఉండాలి.
    • ఎయిర్‌ఫోర్స్‌కు ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ఇంటర్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్ చదివుండాలి లేదా బీటెక్ ఉత్తీర్ణత. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీకి మాత్రమే మహిళలు అర్హులు.
    • ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా. రాత పరీక్ష ఇలా..
    • మౌఖిక పరీక్ష: రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్‌ను నిర్వహిస్తారు.
    ప్రకటన: జూలై 19, 2014,
    దరఖాస్తులకు చివరి తేదీ: ఆగస్టు 18, 2014,
    పరీక్ష తేదీ: అక్టోబర్ 26, 2014.

    మిలిటరీ, నావల్, ఎయిర్‌ఫోర్స్ అకాడమీలు:
    సబ్జెక్ట్ వ్యవధి మార్కులు
    ఇంగ్లిష్ 2 గంటలు 100
    జనరల్ నాలెడ్జ్ 2 గంటలు 100
    ఎలిమెంటరీ మ్యాథ్స్ 2 గంటలు 100

    ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ:
    సబ్జెక్ట్
    వ్యవధి
    మార్కులు
    ఇంగ్లిష్
    2 గంటలు
    100
    జనరల్ నాలెడ్జ్
    2 గంటలు
    100

  3. కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్
    ఎంబీబీఎస్ పూర్తై... ఏదైనా స్పెషలైజేషన్‌లో పీజీ చేయడం లేదంటే ఏదైనా హాస్పిటల్‌లో డాక్టర్‌గా ప్రాక్టీస్ చేయడం. వీటితో పాటు మరో సువర్ణావ కాశం..కంబైన్డ్ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో వైద్యాధికారుల భర్తీకి నిర్వహించే ఈ ఎగ్జామ్ రాసి విజయం సాధిస్తే కేంద్ర ప్రభు త్వ ఉద్యోగం సొంతమవుతుంది. వివరాలు..

    అర్హత:ఎంబీబీఎస్ రాత పరీక్షతోపాటు ప్రాక్టికల్ ఎగ్జామ్స్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఫైనలియర్ ఎంబీబీఎస్ విద్యార్థులూ అర్హులే.
    వయో పరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 32 ఏళ్లు మించరాదు. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
    వైద్య, శారీరక ప్రమాణాలు: నిర్దేశిత వైద్య, శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
    ఉద్యోగాలిక్కడ:
    • అసిస్టెంట్ డివిజనల్ మెడికల్ ఆఫీసర్ (రైల్వేల్లో)
    • అసిస్టెంట్ మెడికల్ ఆఫీసర్ (ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ హెల్త్ సర్వీస్)
    • జూనియర్ స్కేల్ పోస్ట్స్ (సెంట్రల్ హెల్త్ సర్వీసెస్)
    • జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ గ్రేడ్-2 ఢిల్లీ (తూర్పు, ఉత్తర, దక్షిణ) మున్సిపల్ కార్పొరేషన్
    • జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ (న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్)
    ఎంపిక విధానం: ఎంపిక రెండు విధాలుగా ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో విజయం సాధించినవారికి ఇంటర్వ్యూ ఉంటుంది.
    రాత పరీక్ష విధానం: ఇందులో మొత్తం రెండు పేపర్లుంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కుల చొప్పున రెండు పేపర్లకు కలిపి 500 మార్కు లు ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్ చాయిస్ విధానంలో ఉంటాయి. ఒక్కో పేపర్ పరీక్ష కాల వ్యవధి రెండు గంటలు. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి.
    మౌఖిక పరీక్ష: దీనికి 100 మార్కులుంటాయి.
    ప్రకటన: మార్చి 22, 2014
    దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 21, 2014
    పరీక్ష తేదీ: జూన్ 22, 2014

  4. నేషనల్ డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ ఎగ్జామ్
    ఆర్మీ, నావీ, ఎయిర్‌ఫోర్స్ అకాడమీల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) అండ్ నావల్ అకాడమీ (ఎన్‌ఏ). ఈ పరీక్షలో విజయం సాధించినవారు బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉచితంగా పూర్తిచేయడమే కాకుండా లెఫ్టినెంట్, సబ్ లెఫ్టినెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాతో త్రివిధ దళాల్లో కొనసాగొచ్చు. ఈ పరీక్షను ఏడాదికి రెండు సార్లు నిర్వహిస్తారు.

    విద్యార్హత:
    • ఆర్మీ వింగ్ (ఎన్‌డీఏ): ఏదైనా గ్రూప్‌తో 10+2 ఉత్తీర్ణత.
    • ఎయిర్‌ఫోర్స్, నావల్ విభాగాలు (ఎన్‌డీఏ); 10+2 క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ (ఇండియన్ నావల్ అకాడమీ): ఫిజిక్స్, మ్యాథమెటిక్స్‌లతో 10+2 ఉత్తీర్ణత.
    వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి ప్రకటనలో సూచించిన వయసును కలిగి ఉండాలి. నిర్దేశిత శారీరక ప్రమాణాలు తప్పనిసరి. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.
    ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
    రాత పరీక్ష విధానం:
    ఇందులో మొత్తం రెండు పేపర్లుంటాయి. అవి.. 1. మ్యాథ్స్ (300 మార్కులు), 2. జనరల్ ఎబిలిటీ టెస్ట్ (600 మార్కులు). రెండో పేపర్ జనరల్ ఎబిలిటీ టెస్ట్‌లో భాగంగా పార్ట్-ఏ, పార్ట్-బీ అనే రెండు విభాగాలు ఉంటాయి. పార్ట్-ఏలో ఇంగ్లిష్ 200 మార్కులకు, పార్ట్-బీలో జనరల్ నాలెడ్జ్ 400 మార్కులకు ప్రశ్నలడుగుతారు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన ప్రశ్నలకు నెగెటివ్ మార్కులుంటాయి. ఒక్కో పేపర్ వ్యవధి రెండున్నర గంటలు.
    ఇంటెలిజెన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్: పర్సనాలిటీ టెస్ట్‌కు 900 మార్కులుంటాయి. వివిధ అంశాల్లో అభ్యర్థి ప్రాథమిక పరిజ్ఞానాన్ని తెలుసుకోవడానికి వెర్బల్, నాన్ వెర్బల్ పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్ డిస్కషన్, గ్రూప్ ప్లానింగ్, ఔట్ డోర్ గ్రూప్ టాస్క్స్, ఏదైనా సబ్జెక్ట్/అంశంలో ప్రసంగించమనడం... లాంటివన్నీ ఈ పరీక్షలో భాగమే.
    శారీరక పరీక్ష: నిర్దేశిత ఎత్తు, దానికి తగ్గ బరువు ఉండాలి. ఏ విధమైన అవయవ లోపాలు ఉండకూడదు.
    ప్రకటన: జూన్ 21, 2014
    దరఖాస్తులకు చివరి తేదీ: జూలై 21, 2014
    పరీక్ష తేదీ: సెప్టెంబర్ 28, 2014

  5. ఐఈఎస్/ ఐఎస్‌ఎస్
    ఆర్థిక మంత్రిత్వ శాఖ, ప్లానింగ్ కమిషన్, తదితర విభాగాల్లో గ్రేడ్-4 కేడర్‌లో జూనియర్ టైం స్కేల్ హోదా అధికారులను ఎంపిక చేయడానికి నిర్వహించే పరీక్ష ఇండియన్ ఎకనమిక్ సర్వీస్/స్టాటిస్టికల్ సర్వీస్ ఎగ్జామ్. ఐఈఎస్/ఐఎస్‌ఎస్ ఎంపిక రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులు ఇంటర్వ్యూకు హాజరు కావాలి.
    ఇండియన్ ఎకనమిక్ సర్వీస్:
    అర్హత:
    పీజీ ఇన్ ఎకనామిక్స్/అప్లైడ్ ఎకనామిక్స్/బిజినెస్ ఎకనామిక్స్/ఎకనోమెట్రిక్స్.
    ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్:
    అర్హత:
    పీజీ ఇన్ స్టాటిస్టిక్స్/మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్/అప్లైడ్ స్టాటిస్టిక్స్.
    వయసు: నిర్దేశిత తేదీ నాటికి 21-30 ఏళ్లు.
    పరీక్ష తేదీ: మే 24, 2014

    ఇండియన్ ఎకనమిక్ సర్వీస్‌కు ఇలా..
    పరీక్షా విధానం:
    మొత్తం మార్కులు: 1000
    పేపర్ మార్కులు వ్యవధి
    1 జనరల్ ఇంగ్లిష్ 100 3 గంటలు
    2 జనరల్ స్టడీస్ 100 3 గంటలు
    3 జనరల్‌ఎకనామిక్స్-1 200 3 గంటలు
    4 జనరల్ ఎకనామిక్స్-2 200 3 గంటలు
    5 జనరల్ ఎకనామిక్స్-3 200 3 గంటలు
    6 ఇండియన్ ఎకనామిక్స్ 200 3 గంటలు

    ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఇలా..
    పేపర్
    మార్కులు
    వ్యవధి
    1: జనరల్ ఇంగ్లిష్
    100
    3 గంటలు
    2: జనరల్ స్టడీస్
    100
    3 గంటలు
    3: స్టాటిస్టిక్స్-1
    200
    3 గంటలు
    4: స్టాటిస్టిక్స్-2
    200
    3 గంటలు
    5: స్టాటిస్టిక్స్-3
    200
    3 గంటలు
    6: స్టాటిస్టిక్స్-4
    200
    3 గంటలు
    మొత్తం మార్కులు:
    1000
     

  6. స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామ్
    కేవలం ఇంటర్మీడియెట్ అర్హతతో ప్రపంచంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన భారతీయ రైల్వేల్లో మెకానికల్ ఇంజనీర్‌గా పనిచేసే సువర్ణావకాశం కల్పిస్తుంది ఎస్‌సీఆర్‌ఏ ఎగ్జామ్. ఒకే పరీక్షతో అటు బిట్-రాంచీ నుంచి నాలుగేళ్ల ఇంజనీరింగ్ డిగ్రీని, ఇటు భారతీయ రైల్వేల్లో మెకానికల్ ఇంజనీర్‌గా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సొంతం చేసుకోవచ్చు. వివరాలు..

    అర్హత: ఇంటర్మీడియెట్(మ్యాథ్స్ కంపల్సరీ సబ్జెక్టుగా, ఫిజిక్స్/కెమిస్ట్రీలో ఏదో ఒక సబ్జెక్టు)లో ప్రథమ శ్రేణి/ద్వితీయ శ్రేణిలో ఉత్తీర్ణత లేదా మ్యాథ్స్ తప్పనిసరి సబ్జెక్టుగా ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో ఏదో ఒక సబ్జెక్టుతో డిగ్రీ ఉత్తీర్ణత.
    వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 17 నుంచి 21 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, బీసీలకు మూడేళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
    శారీరక ప్రమాణాలు: నిర్దేశించిన శారీరక ప్రమాణాలు ఉండాలి.
    రాత పరీక్ష:
    స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ పరీక్ష మూడు పేపర్లలో మొత్తం 600 మార్కులకు ఉంటుంది. ఆ వివరాలు..
    మలిదశ.. మౌఖిక పరీక్ష:
    ఎగ్జామ్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు పర్సనాలిటీ టెస్ట్ నిర్వహిస్తారు. మార్కులు 200.
    ప్రకటన: అక్టోబర్‌లో.

  7. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామ్
    ఇంజనీరింగ్ పట్టభద్రులకు.. చక్కటి అవకాశం ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. జాతీయ స్థాయిలో నిర్వహించే.. ఈ పరీక్షలో విజయం సాధిస్తే ప్రభుత్వ రంగంలో గ్రూప్-ఏ, బీ ఆఫీసర్లుగా కెరీర్ ప్రారంభించే అద్భుత అవకాశం సొంతమవుతుంది. వివరాలు..
    మొత్తం నాలుగు బ్రాంచ్‌లలో ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు. అవి.. సివిల్ (కేటగిరీ-1), మెకానికల్ (కేటగిరీ-2), ఎలక్ట్రికల్ (కేటగిరీ-3) ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ (కేటగిరీ-4).

    భర్తీ చేసే విభాగాలు:
    ఇండియన్ రైల్వే సర్వీస్, ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీస్, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇండియన్ నావల్ ఆర్నమెంట్ సర్వీస్, ఇండియన్ డిఫెన్స్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ తదితర విభాగాలు. ఈ విభాగాల్లో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులను భర్తీ చేస్తారు.
    అర్హత: సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ (ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, సివిల్, మెకానికల్) లేదా తత్సమానం. వయసు: నిర్దేశిత తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్లు.

    రెండు దశలుగా ఎంపిక:
    రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్ అనే రెండు దశల ద్వారా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది.
    ప్రకటన: మార్చి 15, 2014
    దరఖాస్తులకు చివరి తేదీ: ఏప్రిల్ 14
    పరీక్ష తేదీ: జూన్ 20, 2014

    సెక్షన్-1 ఆబ్జెక్టివ్ పేపర్లు
    సబ్జెక్ట్
    సమయం
    మార్కులు
    జనరల్ ఎబిలిటీ
    2 గంటలు
    200
    పార్ట్-ఎ జనరల్ ఇంగ్లిష్
    పార్ట్-బి జనరల్ స్టడీస్
    ఇంజనీరింగ్ పేపర్-1
    2 గంటలు
    200
    ఇంజనీరింగ్ పేపర్-2
    2 గంటలు
    200
    సెక్షన్-2 కన్వెన్షనల్ పేపర్లు
    సబ్జెక్ట్
    సమయం
    మార్కులు
    ఇంజనీరింగ్ పేపర్-1
    3 గంటలు
    200
    ఇంజనీరింగ్ పేపర్-2
    3 గంటలు
    200
    ఇంటర్వ్యూ
     
    200
    మొత్తం మార్కులు
     
    1200

  8. కంబైన్డ్ జియో సైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ ఎగ్జామ్
    కంబైన్‌‌డ జియో సైంటిస్ట్ అండ్ జియాలజిస్ట్ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో గ్రూప్-ఏ హోదా ఉన్న పో స్టులను భర్తీ చేస్తారు. అవి..

    కేటగిరీ-1:
    (జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ మైన్స్)
    జియాలజిస్ట్ (గ్రూప్-ఏ)- 100 పోస్టులు
    జియోఫిజిస్ట్ (గ్రూప్-ఏ)- 80 పోస్టులు
    కెమిస్ట్ (గ్రూప్-ఏ)- 80 పోస్టులు

    కేటగిరీ-2:
    (సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డ్, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్) జూనియర్ హైడ్రాలజిస్ట్ (సైంటిస్ట్-బీ, గ్రూప్-ఏ)- 5 పోస్టులు.
    అర్హతలు:
    • జియాలజిస్ట్: మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలాజికల్ సైన్స్/ జియాలజీ/అప్లైడ్ జియాలజీ/జియో ఎక్స్‌ప్లోరేషన్/ మినరల్ ఎక్స్‌ప్లోరేషన్/ఇంజనీరింగ్ జియాలజీ/మెరైన్ జియాలజీ/ఎర్త్ సైన్స్ అండ్ రిసోర్సెస్ మేనేజ్‌మెంట్ ఓషనోగ్రఫీ అండ్ కోస్టల్ ఏరియా స్టడీస్/పెట్రోలియం జియోసైన్స్/పెట్రోలియం ఎక్స్‌ప్లోరేషన్/జియో కెమిస్ట్రీ/జియోలాజికల్/జియోఫిజికల్ టెక్నాలజీ.
    • జియోఫిజిస్ట్: ఎంఎస్సీ (ఫిజిక్స్/అప్లైడ్ ఫిజిక్స్/జియోఫిజిక్స్/అప్లైడ్ జియోఫిజిక్స్/మెరైన్ జియోఫిజిక్స్) లేదా ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ (ఎక్స్‌ప్లోరేషన్ జియోఫిజిక్స్) లేదా ఎంఎస్సీ టెక్ (అప్లైడ్ జియోఫిజిక్స్).
    • కెమిస్ట్: ఎంఎస్సీ (కెమిస్ట్రీ/అప్లైడ్ కెమిస్ట్రీ/అనలిటికల్ కెమిస్ట్రీ) ఉత్తీర్ణత.
    • జూనియర్ హైడ్రాలజిస్ట్: మాస్టర్ డిగ్రీ ఇన్ జియాలజీ/ అప్లైడ్ జియాలజీ/మెరైన్ జియాలజీ ఉత్తీర్ణత.
    వయసు: కేటగిరీ-1 పోస్టులకు 21 నుంచి 32 ఏళ్లు (ఆగస్ట్ 1, 2014 నాటికి); కేటగిరీ-2 పోస్టులకు 21 నుంచి 35 ఏళ్లు (ఆగస్ట్ 1, 2014 నాటికి).
    ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ/పర్సనాలిటీ టెస్ట్ అనే రెండు దశలాధారంగా ఎంపిక ఉంటుంది. మొత్తం ఎంపిక ప్రక్రియకు 900 మార్కులు కేటాయించారు. రాత పరీక్ష 700 మార్కులకు ఉంటుంది. పర్సనాలిటీ టెస్ట్‌కు 200 మార్కులు కేటాయించారు.

    రాత పరీక్ష ఇలా:
    రాత పరీక్షను కన్వెన్షనల్ (ఎస్సే) విధానంలో నిర్వహిస్తారు. ప్రశ్నల క్లిష్టత ఆయా పోస్టులకు అర్హతగా పేర్కొన్న పీజీ (ఎంఎస్సీ)ల స్థాయిలో ఉంటుంది. రాత పరీక్షను ఇంగ్లిష్, సబ్జెక్ట్ పేపర్ల కలయికగా నిర్వహిస్తారు. ఇందులో ఇంగ్లిష్ పేపర్ అన్ని కేటగిరీ పోస్టులకు ఉమ్మడిగా ఉంటుంది.
    ఇంటర్వ్యూ: రాతపరీక్ష ఉత్తీర్ణులకు ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి 200 మార్కులు కేటాయించారు.
    దరఖాస్తుకు చివరి తేదీ: మార్చి 31, 2014.
    రాతపరీక్షలు ప్రారంభం: మే 24, 2014.

    పరీక్ష వివరాలు.. జియాలజిస్ట్
    సబ్జెక్ట్
    వ్యవధి (గం.)
    మార్కులు
    జనరల్ ఇంగ్లిష్
    3
    100
    జియాలజిస్ట్
    జియాలజీ పేపర్-1
    3
    200
    జియాలజీ పేపర్-2
    3
    200
    జియాలజీ పేపర్-3
    3
    200
    జియోఫిజిస్ట్
    జియోఫిజిక్స్ పేపర్-1
    3
    200
    జియోఫిజిక్స్ పేపర్-2
    3
    200
    జియోఫిజిక్స్ పేపర్-3
    3
    200
    కెమిస్ట్
    కెమిస్ట్రీ పేపర్-1
    3
    200
    కెమిస్ట్రీ పేపర్-2
    3
    200
    కెమిస్ట్రీ పేపర్-3
    3
    200
    జూనియర్ హైడ్రాలజిస్ట్
    జియాలజీ పేపర్-1
    3
    200
    జియాలజీ పేపర్-2
    3
    200
    హైడ్రాలజీ
    3
    200

  9. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్
    భూమి మీద జీవకోటి మనుగడ సాగించాలంటే అడవుల పాత్ర ఎంతో. అంతటి కీలకమైన అడవుల రక్షణ బాధ్యతలను నిర్వర్తించాలంటే నిష్ణాతులైన అధికారుల అవసరం చాలా ఉంది. అలాంటి నిబద్ధత గల అధికారులను దేశానికందించే ఉద్దేశంతో ప్రతి ఏటా ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రిలిమ్స్.. సివిల్స్ సర్వీస్ ప్రిలిమ్స్‌తోపాటే ఉంటుంది. దీనిలో ఉత్తీర్ణులకు ప్రత్యేకంగా మెయిన్స్ నిర్వహిస్తారు.
    అర్హత: యానిమల్ హజ్బెండ్రీ అండ్ వెటర్నరీ సైన్స్/బోటనీ/కెమిస్ట్రీ/జియాలజీ/మ్యాథమెటిక్స్/ఫిజిక్స్/స్టాటిస్టిక్స్/ జువాలజీ ఒక సబ్జెక్ట్‌గా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా అగ్రికల్చర్/ఫారెస్ట్రీ/ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ విద్యార్థులూ అర్హులే.
    వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 21-30 ఏళ్లు.
    అన్ని పేపర్లు వ్యాసరూప విధానంలో ఉంటాయి.

    పర్సనాలిటీ టెస్ట్:
    రాత పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. దీనికి 300 మార్కులు.
    ప్రకటన: మే 17, 2014,
    దరఖాస్తులకు చివరి తేదీ: జూన్ 16, 2014,
    ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: ఆగస్టు 24, 2014
    మెయిన్స్ పరీక్ష తేదీలు: నవంబర్ 22, 2014 నుంచి..

    మెయిన్స్ రాత పరీక్ష విధానం:
    సబ్జెక్ట్
    మార్కులు
    సమయం
    జనరల్ ఇంగ్లిష్
    300
    3 గంటలు
    జనరల్ నాలెడ్జ్
    300
    3 గంటలు
    ఆప్షనల్ 1ఎ
    300
    3 గంటలు
    ఆప్షనల్ 1 బి
    300
    3 గంటలు
    ఆప్షనల్ 2 ఎ
    300
    3 గంటలు
    ఆప్షనల్ 2 బి
    300
    3 గంటలు

  10. సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఎగ్జామ్
    వివిధ సెంట్రల్ పోలీస్ విభాగాల్లో అసిస్టెంట్ కమాండెంట్ పోస్టుల భర్తీకి సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఇవన్నీ గ్రూప్-ఏ పోస్టులే. పోలీస్ వ్యవస్థలో ఐపీఎస్ తర్వాత స్థానం అసిస్టెంట్ కమాండెంట్ పోస్టులదే. వివరాలు..
    ఉద్యోగాలెక్కడ:
    • బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్),
    • సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్),
    • సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్),
    • ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ),
    విద్యార్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత.
    వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 20-25 ఏళ్లు.
    ఎంపిక విధానం: రాత, శారీరక పరీక్షలు, వైద్య పరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా.

    రాత పరీక్ష ఇలా:
    ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1 ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పేపర్-2 డిస్క్రిప్టివ్‌లో ఉంటుంది. పేపర్-1లో జనరల్ ఎబిలిటీ అండ్ ఇంటెలిజెన్స్ అంశాల్లో ప్రశ్నలు 250 మార్కులకు ఉంటాయి. పేపర్-2లో జనరల్ స్టడీస్, ఎస్సే, కాంప్రహెన్షన్ అంశాల్లో 200 మార్కులకు ప్రశ్నలడుగుతారు. ప్రతి పేపర్‌లో నిర్దేశిత అర్హతా మార్కులు సాధించాలి. పేపర్-1లో అర్హత మార్కులు సాధిస్తేనే పేపర్-2 మూల్యాంకనం చేస్తారు. రాత పరీక్షలో ఉత్తీర్ణులకు శారీరక సామర్థ్య, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు. దీనికి 150 మార్కులు ఉంటాయి.

    ప్రకటన: ఏప్రిల్ 5, 2014,
    దరఖాస్తులకు చివరి తేదీ: మే 5, 2014,
    పరీక్ష తేదీ: జూలై 13, 2014
    వెబ్‌సైట్: www.upsc.gov.in
Published date : 17 Mar 2014 03:29PM

Photo Stories