Skip to main content

పదో తరగతితోనే...కేంద్రకొలువులు..!

ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్.. పదో తరగతితో కేంద్ర ప్రభుత్వ కొలువు దక్కించుకునేందుకు సదవకాశం. కేంద్ర ప్రభుత్వ శాఖల్లో దిగువశ్రేణిలో సిబ్బందిని నియమించుకునేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ).. మల్టీ టాస్కింగ్(నాన్ టెక్నికల్) స్టాఫ్ (ఎంటీఎస్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి అర్హతతోనే కేంద్ర కొలువు ఖాయం చేసుకోవడానికి ఎంటీఎస్ నోటిఫికేషన్ ఉపయోగపడుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు పదివేల ఖాళీలు భర్తీ చేయొచ్చని అంచనా. నెలకు రూ.20వేలకు పైగా వేతనం అందుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వ కొలువు కాబట్టి పోటీ లక్షల్లోనే ఉంటుంది. రెండు దశల్లో జరిగే ఎంపిక ప్రక్రియలో గట్టిపోటీని దాటుకొని.. ఉద్యోగం దక్కించుకోవాలంటే.. పక్కా ప్రణాళికతో కృషి చేయాల్సి ఉంటుంది.
విద్యార్హత: పదోతరగతి ఉత్తీర్ణత/తత్సమానం
వేతనం: రూ.5,200-రూ.20,200 + గ్రేడ్ పే రూ.1800
వయసు: శాఖల వారీగా కొన్ని పోస్టులకు 18-25 ఏళ్ల మధ్య, మరికొన్ని పోస్టులకు 18-27 ఏళ్ల మధ్య (2019 ఆగస్టు 1 నాటికి) ఉండాలి. రిజర్వేషన్ వర్గాల వారికి వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, పీహెచ్ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు ఉంటుంది.
దరఖాస్తు రుసుం: రూ.100/-(మహిళలు, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, ఎక్స్ సర్వీస్‌మెన్‌లకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది).
దరఖాస్తు విధానం: అన్‌లైన్‌లో
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది: 2019, మే 29

పరీక్ష కేంద్రాలు :
తెలంగాణ: హైదరాబాద్, కరీంనగర్, వరంగల్
ఆంధ్రప్రదేశ్: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.
పేపర్ 1 పరీక్ష తేదీలు: 2019 ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 6 వరకు
పేపర్ 2 పరీక్ష తేది: 2019 నవంబర్ 17
వెబ్‌సైట్: https://ssc.nic.in/

ఎంపిక ప్రక్రియ:
కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ తరహా పరీక్ష, డిస్క్రిప్టివ్ పరీక్ష ఆధారంగా ఖాళీల భర్తీ జరుగుతుంది.

పరీక్ష విధానం :
టైర్-1: కంప్యూటర్ ఆధారిత ఆబ్జెక్టివ్ పరీక్ష
పేపర్-1ను 100 మార్కులకు నిర్వహిస్తారు. గంటన్నర సమయం ఉంటుంది.
టైర్-2: డిస్క్రిప్టివ్ విధానంలో జరిగే అర్హత పరీక్ష ఇది.
టైర్-1లో సాధించిన మార్కుల ఆధారంగానే టైర్-2కు అర్హత లభిస్తుంది.

పేపర్ -1 పరీక్ష ఇలా..
సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 25
న్యూమరికల్ అప్టిట్యూడ్ 25 25
జనరల్ ఇంగ్లిష్ 25 25
జనరల్ అవేర్‌నెస్ 25 25
మొత్తం 100 100
పేపర్-1 100 ప్రశ్నలు 100 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాలలో ఉంటాయి. తప్పు సమాధానానికి 0.25 కోత విధిస్తారు. పరీక్ష వేర్వేరు షిప్టుల్లో ఉండటం వల్ల తుది మార్కులను నిర్ణయించడంలో నార్మలైజేషన్ ద్వారా స్కోరు కేటాయింపులో సమతూకం పాటిస్తారు.

తెలుగులోనూ పేపర్-2 :
పేపర్-1లో చూపిన ప్రతిభ ఆధారంగా పేపర్-2కు అర్హత లభిస్తుంది. పూర్తిగా డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే ఈ పరీక్షలో అభ్యర్థుల ప్రాథమిక భాషా నైపుణ్యాలను పరీక్షిస్తారు. ఇందులో షార్ట్ ఎస్సే రైటింగ్, లెటర్-రైటింగ్ ఉంటాయి. పరీక్ష వ్యవధి 30 నిమిషాలు. పేపర్ 2కు 50 మార్కులు కేటాయించారు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో వచ్చే మార్కులను తుది ఎంపికలో పరిగణించరు. కాని ఒకవేళ ఇద్దరు అభ్యర్థులు ఒకే మార్కులు పొందితే.. పేపర్2 మార్కులను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేస్తారు. పేపర్2ను ఇంగ్లిష్, హిందీలతోపాటు ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహిస్తున్నారు. కాబట్టి తెలుగు, ఉర్దులోనూ పేపర్2 ఉంటుంది.

వేతనం రూ.20వేలు :
ఎంటీఎస్‌కి ఎంపికైన అభ్యర్థులకు బేసిక్ వేతనం రూ.18000గా ఉంటుంది. డీఏ, హెచ్‌ఆర్‌ఏ, టీఏ మొదలైన వాటితో కలుపుకొని ప్రధాన నగరాల్లో పనిచేసే ఉద్యోగులు రూ.20,000కుపైగా అందుకోవచ్చు. మూడేళ్ల తర్వాత మొదటి ప్రమోషన్, మరో మూడేళ్ల తర్వాత రెండో ప్రమోషన్ లభిస్తుంది. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఎంటీఎస్‌ల విధులు చాలా కీలకమైనవి. క్లరికల్ వర్క్‌కు సంబంధించిన పనులు ఎంటీఎస్‌లు చేయాల్సి ఉంటుంది.

ప్రత్యేక దృష్టితో.. ప్రిపరేషన్ :
జనరల్ ఇంటెలిజెన్స్ :
ఈ విభాగంలో వెర్బల్, నాన్ వెర్బల్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. పోలికలు- భేదాలు (similarities and differences), ప్రాబ్లమ్ సాల్వింగ్, విశ్లేషణ, జడ్జిమెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ,అర్థమెటిక్ నంబర్ సిరీస్, నాన్ వెర్బల్ సిరీస్ నుంచి ప్రశ్నలు అడుగుతున్నారు. తార్కిక పరిజ్ఞానాన్ని పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. క్లిష్టత స్థాయిపరంగా కొంత సులువుగానే ఉండే అవకాశముంది. గత ప్రశ్న పత్రాల ప్రాక్టీస్, మోడల్ పేపర్లు ఎక్కువగా సాధన చేయడం లాభిస్తుంది. సిరీస్ (నంబర్/ఆల్ఫా న్యుమరిక్), అనాలజీస్, ఆడ్ మెన్ ఔట్, సిలాయిజమ్, మాట్రిక్స్, దిశలు, వర్డ్ ఫార్మేషన్, బ్లడ్ రిలేషన్స్, కోడింగ్-డీకోడింగ్ మొదలైన టాపిక్స్‌పై ప్రాథమిక స్థాయిలో ప్రశ్నలు అడుగుతున్నారు.

న్యూమరికల్ ఆప్టిట్యూడ్ :
ఈ విభాగంలో మంచి స్కోరు చేయాలంటే.. సంఖ్యలపై పట్టు సాధించాలి. ఇందులో నంబర్ సిస్టం, కంప్యూటేషన్ ఆన్ హోల్ నంబర్స్, డెసిమల్స్ అండ్ ఫ్రాక్షన్స్, రిలేషన్‌షిప్ బిట్వీన్ నంబర్స్, ఫండమెంటల్ అర్థమెటిక్ ఆపరేషన్స్, శాతాలు, నిష్పత్తి, సరాసరి, లాభనష్టాలు, సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్స్, మెన్సురేషన్, కాలం-దూరం,కాలం-పని, టేబుల్స్ అండ్ గ్రాఫ్స్ వంటి వాటిపై ప్రశ్నలు వస్తాయి. ముఖ్యంగా సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, లాభ నష్టాలు, శాతాలు, ఆల్జీబ్రా, జామెట్రీ, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్ విభాగాల నుంచి క్రమం తప్పకుండా ప్రశ్నలు ఎదురవుతున్నాయి. సింప్లిఫికేషన్ వేగంగా చేయగలిగితే గెలుపు సులువు అవుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంగ్లిష్ లాంగ్వేజ్ :

ఎంటీఎస్ పరీక్షలో విజయం సాధించేందుకు దోహదం చేసే ప్రధానమైన సబ్జెక్ట్ ఇది. కాబట్టి అభ్యర్థులు ఇంగ్లిష్‌పై ప్రత్యేకంగా దృష్టిసారించాలి. ఇప్పటి నుంచే ఆంగ్ల దినపత్రికలు చదవుతూ.. గ్రామర్, వొకాబులరీ, సినానిమ్స్, ఆంటోనిమ్స్‌పై పట్టుసాధించాలి. ఈ విభాగంలో అభ్యర్థి ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని ప్రాథమిక స్థాయిలో పరీక్షిస్తారు. కాబట్టి బేసిక్స్‌పై బాగా అవగాహన పెంచుకోవాలి. ఇంగ్లిష్‌లో సినానిమ్స్, ఆంటోనిమ్స్, ఇడియమ్స్/ఫ్రేజెస్, ఒన్ వర్డ్ సబ్సిస్ట్యూషన్, జంబుల్డ్ సెంటెన్స్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, స్పాటింగ్ ద ఎర్రర్, స్పెల్లింగ్ మిస్టేక్స్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ వంటి అంశాల నుంచి ప్రశ్నలు అడిగే వీలుంది. ప్రశ్నలు ప్రాథమిక స్థాయిలోనే ఉంటాయని సబ్జెక్టులు నిపుణులు చెబుతున్నారు.

జనరల్ అవేర్‌నెస్ :
జాతీయ,అంతర్జాతీయ సమకాలీన అంశాలు, జనరల్ సైన్స్, ఎకానమిక్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ అంశాల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అభ్యర్థికి తన చుట్టూ జరుగుతున్న పరిణామాలపై ఉన్న అవగాహన పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. దైనందిన జీవితంలో వస్తున్న మార్పులు.. భారత్ పాల్గొనే అంతర్జాతీయ సదస్సులు.. వార్తల్లో వ్యక్తులు.. కరెన్సీ, క్రీడలు, అవార్డులు, భారత రాజకీయ వ్యవస్థ, భారత రాజ్యాంగం, శాస్త్ర సాంకేతిక అంశాలు, రక్షణ వ్యవహారాలు, ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై ప్రశ్నలుంటాయి. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. తాజా క్రీడలు-విజేతలు, అవి జరిగిన ప్రదేశాలు, బహుమతులు-ఉత్సవాలు, కొత్త ఆవిష్కరణలు, నియామకాలు, సదస్సులు-సమావేశాలు, ప్రభుత్వ పథకాలు వంటి వాటిపై అవగాహన కలిగి ఉండాలి!!
Published date : 02 May 2019 06:38PM

Photo Stories