Skip to main content

కేంద్ర ప్రభుత్వ కొలువులు @ ఎస్‌ఎస్‌సీ

స్టెనోగ్రాఫర్స్‌ (గ్రేడ్‌ సీ అండ్‌ డీ) ఎగ్జామ్‌
వివిధ కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు/కార్యాలయాల్లో స్టెనోగ్రాఫర్ల భర్తీకి నిర్వహించే పరీక్ష స్టెనోగ్రాఫర్స్‌ (గ్రేడ్‌ సీ అండ్‌ డీ) ఎగ్జామినేషన్‌.
అర్హత: 10+2 ఉత్తీర్ణత లేదా తత్సమానం.
వయోపరిమితి: ఆగస్టు 1, 2013 నాటికి 18-27 ఏళ్లు. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ - 50 ప్రశ్నలు (మార్కులు-50), జనరల్‌ అవేర్‌నెస్‌-50 ప్రశ్నలు (మార్కులు-50), ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ -100 ప్రశ్నలు (మార్కులు-100) ఉంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగటివ్‌ మార్కులుంటాయి.
స్కిల్‌ టెస్ట్‌ ఇన్‌ స్టెనోగ్రఫీ: రాత పరీక్షలో ప్రతి విభాగంలో నిర్దేశిత మార్కులు సాధించినవారిని స్కిల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.

పార్ట్‌-1 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 24, 2013
పార్ట్‌-2 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్‌ 26, 2013
పరీక్ష తేదీ: డిసెంబర్‌ 29, 2013
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ఆఫ్‌లైన్‌ విధానాల్లో.

సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్లు
ఢిల్లీ పోలీస్‌, సెంట్రల్‌ ఆర్మ్‌డ్‌ పోలీస్‌ ఫోర్సెస్‌లో సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌లో అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరోలో ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దేశవ్యాప్తంగా
ఎస్‌ఎస్‌సీ పరీక్షను నిర్వహిస్తోంది.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణతతోపాటు నిర్దేశిత శారీరక, వైద్య ప్రమాణాలను కలిగి ఉండాలి.
వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 20-25 ఏళ్లు
ఎంపిక విధానం: రెండు దశల్లో నిర్వహించే రాత పరీక్షతోపాటు శారీరక సామర్థ్య పరీక్ష, వైద్య పరీక్ష, ఇంటర్వ్యూ/ పర్సనాలిటీ టెస్టుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.

పరీక్ష విధానం: మొత్తం రెండు పేపర్లుంటాయి. మొదటి పేపర్‌లో భాగంగా జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ (50 మార్కులు), జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ (50 మార్కులు), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (50 మార్కులు), ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌ (50 మార్కులు) ఉంటాయి. వీటికి రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. పేపర్‌-2లో భాగంగా ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌పై 200 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 200 మార్కులుంటాయి. పేపర్‌-2కు కూడా రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. రెండు పేపర్లలోనూ ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగటివ్‌ మార్కులుంటాయి.

శారీరక సామర్థ్య/వైద్య పరీక్షలు, ఇంటర్వ్యూ: పేపర్‌-1లో ఉత్తీర్ణత సాధించినవారిని శారీరక సామర్థ్య పరీక్షలకు ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా పరుగుపందెం, లాంగ్‌జంప్‌, హైజంప్‌, షాట్‌పుట్‌ వంటి పోటీలను నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించినవారిని పేపర్‌-2కు ఎంపిక చేస్తారు. వీటన్నింటిలో ఉత్తీర్ణత సాధించినవారిని ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.

కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామినేషన్‌
కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, సంస్థలు, విభాగాల్లో వివిధ పోస్టుల భర్తీకి ప్రతి ఏటా కంబైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. ఈ పోస్టుల్లో ఇన్‌కం ట్యాక్స్‌ ఇన్‌స్పెక్టర్లు, సెంట్రల్‌ ఎక్సైజ్‌ ఇన్‌స్పెక్టర్లు, ఇన్‌స్పెక్టర్‌ (ఎగ్జామినర్‌, ప్రివెంటివ్‌ ఆఫీసర్‌), అసిస్టెంట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఆఫీసర్‌, సీబీఐలో సబ్‌ ఇన్‌స్పెక్టర్లు, సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ నార్కోటిక్స్‌లో ఇన్‌స్పెక్టర్లు వంటి ఆకర్షణీయ పోస్టులున్నాయి.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత. కొన్ని పోస్టులకు నిర్దేశిత సబ్జెక్టులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. శారీరక, వైద్య ప్రమాణాలు తప్పనిసరి.
వయోపరిమితి: పోస్టులను బట్టి కొన్ని పోస్టులకు నిర్దేశిత తేదీనాటికి 18-27ఏళ్లు, మరికొన్ని పోస్టులకు 20-27 ఏళ్లు.
ఎంపిక విధానం: రెండు విధాలుగా ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్షను నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైనవారికి కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌/ఇంటర్వ్యూ/స్కిల్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. కొన్ని పోస్టులకు ఇంటర్వ్యూ లేదు.

పరీక్ష విధానం: మొదట టైర్‌ -1 ఎగ్జామ్‌ను నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌, ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌లపై ప్రశ్నలు ఉంటాయి. ప్రతి విభాగానికి 50 మార్కులు. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి.
రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. టైర్‌-2 ఎగ్జామ్‌లో భాగంగా పేపర్‌-1లో క్వాంటిటేటివ్‌ ఎబిలిటీస్‌ (100 ప్రశ్నలు) 200 మార్కులకు, పేపర్‌-2 ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌ 200 మార్కులకు ఉంటాయి. స్టాటిస్టికల్‌ ఇన్వెస్టిగేటర్‌ గ్రేడ్‌-2, కంపైలర్‌ పోస్టులకు మూడో పేపర్‌ కింద స్టాటిస్టిక్స్‌ ఉంటుంది. దీనికి 200 మార్కులుంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగటివ్‌ మార్కులుంటాయి. ఈ మూడు పేపర్లకు రెండు గంటల వ్యవధి చొప్పున ఉంటుంది.

ఇంటర్వ్యూ: టైర్‌-1, టైర్‌-2 పరీక్షల్లో ఉత్తీర్ణులైనవారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. దీనికి 100 మార్కులుంటాయి. కొన్ని పోస్టులకు కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌, డేటా ఎంట్రీ స్కిల్‌ టెస్ట్‌లను నిర్వహిస్తారు.

కంబైన్డ్‌ హయ్యర్‌ సెకండరీ లెవల్‌ (10+2) ఎగ్జామ్‌
వివిధ విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టుల భర్తీకి నిర్వహించే పరీక్ష కంబైన్డ్‌ హయ్యరీ సెకండరీ లెవల్‌ ఎగ్జామినేషన్‌.
అర్హత: 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం.
వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 18-27 ఏళ్లు.
ఎంపిక: రాత పరీక్ష, డేటా ఎంట్రీ స్కిల్‌ టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్‌ పరీక్ష విధానం: రెండు గంటల వ్యవధిలో నిర్వహించే పరీక్షలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ (బేసిక్‌ నాలెడ్జ్‌), క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ (బేసిక్‌ అర్థమెటిక్‌ స్కిల్‌), జనరల్‌ అవేర్‌నెస్‌లపై ప్రశ్నలుంటాయి. ప్రతి విభాగంలో 50 ప్రశ్నలుంటాయి. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి.

డేటా ఎంట్రీ టెస్ట్‌/టైపింగ్‌ టెస్ట్‌: రాతపరీక్షలో ఉత్తీర్ణులైనవారిలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌ పోస్టులకు డేటా ఎంట్రీ టెస్ట్‌, లోయర్‌ డివిజన్‌ క్లర్క్‌ పోస్టులకు టైపింగ్‌ టెస్ట్‌ ఉంటుంది.

జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్లు, హిందీ ప్రధ్యాపక్‌
అర్హత:
జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్లు: మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఇంగ్లిష్‌, హిందీ సబ్జెక్టులతో డిగ్రీ ఉత్తీర్ణత.
హిందీ ప్రధ్యాపక్‌: హిందీతో మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు సీనియర్‌ సెకండరీ లెవల్‌లో రెండేళ్లు బోధనానుభవం.
వయోపరిమితి: నిర్దేశిత తేదీనాటికి 30 ఏళ్లు మించరాదు.
ఎంపిక: రాత పరీక్ష, పర్సనాలిటీ టెస్ట్‌.
రాత పరీక్ష విధానం: రాత పరీక్షలో భాగంగా పేపర్‌-1లో జనరల్‌ హిందీ, జనరల్‌ ఇంగ్లిష్‌పై ప్రశ్నలు ఉంటాయి. వీటికి రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి. పేపర్‌-2లో భాగంగా ట్రాన్స్‌లేషన్‌, ఎస్సేలపై కన్వెన్షనల్‌ విధానంలో ప్రశ్నలుంటాయి. వీటికి 200 మార్కులుంటాయి.

కేంద్ర ప్రభుత్వ రక్షణ సంస్థల్లో కానిస్టేబుళ్లు
ఇండో-టిబెటన్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌, బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ ఫోర్స్‌, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌, సశస్త్ర సీమాబల్‌, అస్సాం రైఫిల్స్‌లో కానిస్టేబుళ్లు, రైఫిల్‌మేన్‌ పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ పరీక్షను నిర్వహిస్తోంది.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం.
వయోపరిమితి: నిర్దేశిత తేదీ నాటికి 18-23 ఏళ్లు.
ఎంపిక విధానం: శారీరక ప్రమాణాల పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష, రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా.
పరీక్ష విధానం: ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌లో, శారీరక సామర్థ్య పరీక్షలో ఉత్తీర్ణులైనవారికి రాత పరీక్షను నిర్వహిస్తారు. రాత పరీక్షలో భాగంగా జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌ (25 ప్రశ్నలు), జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ జనరల్‌ అవేర్‌నెస్‌ (25 ప్రశ్నలు), ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్‌ (25 ప్రశ్నలు), ఇంగ్లిష్‌/హిందీ (25 ప్రశ్నలు)లపై 100 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 100 మార్కులు. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ చాయిస్‌ విధానంలో ఉంటాయి.

ఇతర పోస్టులు
అసిస్టెంట్‌ డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్స్‌, డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, రీసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌ (ఫారెస్ట్రీ), టెక్నీషియన్‌, అసిస్టెంట్‌ (లీగల్‌), రీసెర్చ్‌ అసిస్టెంట్‌, వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ క్యూరేటర్స్‌, బొటానికల్‌ అసిస్టెంట్లు, జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, సెక్యూరిటీ సూపర్‌వైజర్‌, ఫిషరీస్‌ రీసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌, ప్లానింగ్‌ అసిస్టెంట్‌, మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ ఇన్‌స్పెక్టర్‌, అసిస్టెంట్‌ ఎగ్జిబిషన్‌ ఆఫీసర్‌, జూనియర్‌ వైర్‌లెస్‌ ఆపరేటర్‌ వంటి పోస్టుల భర్తీకి ఖాళీలను బట్టి ఎస్‌ఎస్‌సీ ప్రకటనలు విడుదల చేస్తుంది. వీటికి రాత పరీక్ష లేదు. అకడెమిక్‌ రికార్డ్‌ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. దీనికి 100 మార్కులుంటాయి. ఇవే కాకుండా ప్రసార భారతిలో ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌, ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌, ట్రాన్స్‌మిషన్‌ ఎగ్జిక్యూటివ్‌ (ప్రొడక్షన్‌ అసిస్టెంట్‌) పోస్టులకు కూడా ఎస్‌ఎస్‌సీ పరీక్ష నిర్వహిస్తుంది. వీటితోపాటు ఇంజనీరింగ్‌ విభాగం కింద వివిధ విభాగాల్లో జూనియర్‌ ఇంజనీర్ల (సివిల్‌, ఎలక్ట్రికల్‌, మెకానికల్‌) పోస్టులను కూడా భర్తీ చేస్తుంది.

ప్రిపరేషన్‌ ప్లాన్‌
ఇంగ్లిష్‌ కాంప్రహెన్షన్‌
ఈ పేపర్‌ గ్రాడ్యుయేషన్‌ స్థాయిలో ఉంటుంది. బేసిక్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌, కాంప్రహెన్షన్‌, రైటింగ్‌ ఎబిలిటీలపై ప్రశ్నలుంటాయి. అభ్యర్థి ఇంగ్లిష్‌ని ఎలా అర్థం చేసుకుంటున్నాడో తెలుసుకునే విధంగా ప్రశ్నలడుగుతారు. మార్కెట్లో దొరికే ప్రామాణిక ఆంగ్ల వ్యాకరణ పుస్తకంలో సిలబస్‌లోని అంశాల వరకు చదివితే చాలు. ఈ విభాగంలో 70 శాతం ప్రశ్నలు ప్రాథమిక వ్యాకరణం నుంచి, 30 శాతం ప్రశ్నలు కాంప్రహెన్షన్‌, యాంటోనిమ్స్‌, సినోనిమ్స్‌, అనాలజీ అంశాలపై అడుగుతారు. ఇంకా వొక్యాబులరీ, సిమిలర్‌ వర్డ్స్‌, పాసేజ్‌లు, ఆర్డర్‌ ఆఫ్‌ సెంటెన్సెస్‌, స్పాటింగ్‌ ద ఎరర్స్‌,్ర ఆర్డరింగ్‌ ఆఫ్‌ వర్డ్స్‌ ఇన్‌ ఎ సెంటెన్స్‌, మీనింగ్‌ ఫర్‌ ఇడియమ్స్‌ అండ్‌ ఫ్రేజెస్‌ల నుంచి ప్రశ్నలుంటాయి. రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, సెంటెన్స్‌ కరక్షన్‌, వొకాబ్యులరీ బేస్డ్‌ ప్రశ్నలపై ఎక్కువ దృష్టి సారించాలి. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు పొందడానికి రెన్‌ అండ్‌ మార్టిన్‌ హైస్కూల్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌ పుస్తకం, నార్మన్‌ లూయీస్‌ రాసిన వర్డ్‌ పవర్‌ మేడ్‌ ఈజీ బాగా ఉపయోగపడతాయి.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌:
ఈ విభాగంలో ప్రధానంగా అర్థమెటిక్‌ కాన్సెప్ట్స్‌ అంటే.. శాతాలు, లాభనష్టాలు, సాధారణ వడ్డీ, చక్ర వడ్డీ, సగటు, డిస్కౌంట్‌, స్క్వేర్‌రూట్‌, భాగస్వామ్య వ్యాపారం, కాలం-దూరం-పని, బార్‌ డయాగ్రమ్‌, ఫైచార్ట్‌ మొదలైన వాటిపై ప్రశ్నలుంటాయి. క్యాట్‌, బ్యాంక్‌ రిక్రూట్‌మెంట్‌ వంటి పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఈ విభాగంలో సులువుగా మార్కులు సాధించొచ్చు. మిగిలిన విద్యార్థులు కూడా కోఆర్డినేట్‌ జామెట్రీ, ట్రిగ్నామెట్రీ (ప్రధానంగా ఎత్తులు-దూరాలు), నంబర్‌ సిస్టమ్‌ మొదలైన అంశాలను అధ్యయనం చేస్తే ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. గత ప్రశ్నపత్రాలను సేకరించి ఏ అంశం నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయో గమనించాలి. దానికనుగుణంగా ఆయా అంశాలను ఏదైనా ప్రామాణిక పుస్తకం దగ్గర ఉంచుకుని సాధన చేయాలి. నేరుగా సమాధానాలను ఆలోచించకుండా నిర్ణీత సమస్యకు సంబంధించి సూత్రాల ఆధారంగా దశల వారీగా సమాధానం పొందే విధంగా నైపుణ్యం సాధించాలి. అదే విధంగా వేగంగా సమాధానం గుర్తించే నైపుణ్యాన్ని సొంతం చేసుకోవాలి. ఇందుకోసం కొండ గుర్తులు, షార్ట్‌కట్‌ మెథడ్స్‌ రూపొందించుకోవాలి.

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ లాజికల్‌ రీజనింగ్‌:
ఇందులో భాగంగా ప్రాబ్లం సాల్వింగ్‌, పోలికలు (సిమిలారిటీస్‌), ఎనాలిసిస్‌, జడ్జిమెంట్‌, డెసిషన్‌ మేకింగ్‌, విజువల్‌ మెమొరీ, అబ్జర్వేషన్‌, రిలేషన్‌షిప్‌ కాన్సెప్ట్స్‌, అర్థమెటికల్‌ రీజనింగ్‌, ఫిగరల్‌ క్లాసిఫికేషన్‌, నంబర్‌ సిరీస్‌, నాన్‌వెర్బల్‌ సిరీస్‌, కోడింగ్‌ - డీకోడింగ్‌, వెన్‌ డయాగ్రమ్స్‌ మొదలైనవాటిపై ప్రశ్నలుంటాయి. లాజికల్‌ రీజనింగ్‌లోని ప్యాసేజ్‌ సెక్షన్‌లో పేరాగ్రాఫ్‌లు చిన్నగా ఉన్నప్పటికీ వాటికి సంబంధించి అడిగే ప్రశ్నలకు పేరాగ్రాఫ్‌లో ‘మూలం’ ఏంటో కనుక్కోవాలంటే తార్కిక ఆలోచన శక్తితోనే సాధ్యం. డెసిషన్‌ మేకింగ్‌లో ఇచ్చిన స్టేట్‌మెంట్స్‌, కేస్‌ స్టడీస్‌కు సంబంధించి సరైన నిర్ణయాన్ని తెలపాలి. కాబట్టి ఈ విభాగంపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఇందులో డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌, క్రిటికల్‌ రీజనింగ్‌ వంటి విభాగాల్లో చార్ట్స్‌ అండ్‌ డయాగ్రమ్స్‌, టేబుల్స్‌ అండ్స్‌ కేస్‌లెట్స్‌, న్యూమరిక్‌ లాజిక్‌, లాజికల్‌ కండిషన్స్‌ అండ్‌ గ్రూపింగ్‌, విజువల్‌ రీజనింగ్‌ వంటి అంశాలను ఎక్కువగా ప్రిపేర్‌ కావాలి.

జనరల్‌ అవేర్‌నెస్‌:
ఈ విభాగంలో వివిధ దేశాలు - అధినేతలు, శాస్త్ర సాంకేతిక రంగ అంశాలు, క్రీడలు, అవార్డులు - వ్యక్తులు, వ్యక్తులు - నియామకాలు, ముఖ్యమైన సమావేశాలు-అవి జరిగిన ప్రదేశాలు, భారతదేశ చరిత్ర, భారత రాజ్యాంగం, రాజ్యాంగ సంస్థలు మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలంటే ప్రతి రోజూ దినపత్రికలు చదువుతుండాలి.
మనోరమ ఇయర్‌బుక్‌, ఫ్రంట్‌లైన్‌ వంటివాటిని చదవాలి.

రిఫరెన్స్‌ బుక్స్‌:
  • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌- అరుణ్‌ శర్మ
  • ఎన్‌సీఈఆర్‌టీ-8,9,10 తరగతుల మ్యాథ్‌‌స పుస్తకాలు
  • క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌- అభిజిత్‌ గుహ
  • డేటా ఇంటర్‌ప్రిటేషన్‌, లాజికల్‌ రీజనింగ్‌- టాటా మెక్‌గ్రాహిల్స్‌, పియర్సన్‌ పబ్లికేషన్స్‌
  • లాజికల్‌ రీజనింగ్‌- ఆర్‌ఎస్‌ అగర్వాల్‌
  • రెన్‌ అండ్‌ మార్టిన్‌ ఇంగ్లిష్‌ గ్రామర్‌
  • వర్డ్‌పవర్‌ మేడ్‌ ఈజీ- నార్మన్‌ లూయిస్‌
Published date : 18 Oct 2013 11:00AM

Photo Stories