కేంద్ర బలగాల్లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ కొలువులు
Sakshi Education
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. కేంద్ర బలగాల్లో ఎస్‌ఐ, ఏఎస్‌ఐ ఉద్యోగాల నియామకాలకు మార్చి 28న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 2,902 ఉద్యోగాలున్నాయి. ఉన్నత జీతభత్యాలతో పాటు సాయుధ బలగాల ద్వారా దేశానికి సేవచేసే అవకాశం ఈ కొలువుల ద్వారా లభిస్తుంది. అర్హతలు, పరీక్ష విధానం తదితరాలపై ఫోకస్..
ఉద్యోగాల వివరాలు
వేతనాలు:
అర్హతలు:
శారీరక ప్రమాణాలు:
ఎంపిక విధానం:
పరీక్ష విధానం:
పేపర్-1:
పేపర్-2: ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి.
శారీరక సామర్థ్య పరీక్షలు:
పురుషులు:
మహిళలు:
దరఖాస్తు విధానం:
ముఖ్య తేదీలు:
సిలబస్
2014 ప్రశ్న పత్రం కోసం క్లిక్ చేయండి
- కేంద్ర బలగాల్లో ఎస్‌ఐ ఉద్యోగాలు:
విభాగం పురుషులు మహిళలు మొత్తం సీఆర్‌పీఎఫ్ 205 16 221 బీఎస్‌ఎఫ్ 577 30 607 ఐటీబీపీ 266 23 289 సీఐఎస్‌ఎఫ్ 482 54 536 ఎస్‌ఎస్‌బీ 35 18 53
- సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్)లో 1101 ఏఎస్‌ఐ పోస్టులున్నాయి. వీటిలో పురుషులకు 991, మహిళలకు 110 కేటాయించారు.
- ఢిల్లీ పోలీస్ విభాగంలో 95 ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్) పోస్టులున్నాయి. వీటికి పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.
వేతనాలు:
- కేంద్ర బలగాలు (ఎస్‌ఐ): రూ.9,300-34,800, గ్రేడ్ పే రూ. 4,200
- ఢిల్లీ పోలీస్ విభాగంలోని ఎస్‌ఐ (ఎగ్జిక్యూటివ్): రూ. 9,300-34,800, గ్రేడ్ పే రూ.4, 200
- సీఐఎస్‌ఎఫ్‌లో ఏఎస్‌ఐ: రూ.5,200-20,200, గ్రేడ్ పే రూ. 2,800.
అర్హతలు:
- 2015, జనవరి 1 నాటికి గుర్తింపు పొందిన ఏదైనా యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్.
- 2015, జనవరి 1 నాటికి జనరల్ అభ్యర్థులకు వయసు 20 నుంచి 25 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు సడలింపు ఉంటుంది.
- ఢిల్లీ పోలీస్ విభాగంలోని ఎస్‌ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే డ్రైవింగ్ లెసైన్స్ ఉండాలి.
శారీరక ప్రమాణాలు:
- ఎత్తు: పురుషులకు 170 సెం.మీ; ఛాతీ 80 సెం.మీ, ఊపిరి పీలిస్తే 85 సెం.మీ.
- మహిళలకు ఎత్తు 157 సెం.మీ ఉండాలి.
ఎంపిక విధానం:
- ఎంపిక ప్రక్రియ మూడు దశల్లో ఉంటుంది. తొలి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో పేపర్-1, పేపర్-2 ఉంటాయి. పేపర్-1లో నిర్దేశ అర్హత మార్కులు సాధించిన వారికి దేహ దారుఢ్య, శారీరక ప్రమాణాలు, వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి సంబంధించిన పేపర్-2ను దిద్దుతారు.
- పేపర్-1, పేపర్-2ల్లో ఉమ్మడిగా ప్రతిభ చూపిన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తారు. పేపర్-1కు 200 మా ర్కులు, పేపర్-2కు 200 మార్కులు, ఇంటర్వ్యూకు 100 మార్కులు.. మొత్తం 500 మార్కులకు పరీక్ష ఉంటుంది. అఖిల భారత స్థాయిలో మెరిట్ జాబితా రూపొందించి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం:
పేపర్-1:
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు |
ఎ. జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్ | 50 | 50 |
బి. జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్‌నెస్ | 50 | 50 |
సి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 50 | 50 |
డి. ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ | 50 | 50 |
మొత్తం | 200 | 200 |
పేపర్-2: ఇందులో ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నలుంటాయి. 200 ప్రశ్నలకు 200 మార్కులుంటాయి.
- రాత పరీక్షను ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఒకవేళ ప్రభుత్వ అనుమతులు వస్తే పరీక్ష ఆన్‌లైన్ విధానంలో జరిపేందుకు అవకాశముంది.
- ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఒక్కో పేపర్‌కు రెండు గంటల సమయం ఉంటుంది. ఉదయం పేపర్-1, మధ్యాహ్నం పేపర్-2 నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.
- పేపర్-1లోని ఎ, బి, సి విభాగాల ప్రశ్నలు ఇంగ్లిష్, హిందీ మాధ్యమాల్లో ఉంటాయి.
శారీరక సామర్థ్య పరీక్షలు:
పురుషులు:
- 100 మీటర్లు పరుగు: 16 సెకన్లు
- 1.6 కి.మీ. పరుగు: 6.5 నిమిషాలు
- లాంగ్ జంప్: 3.65 మీటర్లు, మూడు చాన్సులు
- హైజంప్: 1.2 మీటర్లు, మూడు చాన్సులు
- షాట్‌పుట్ (16 ఎల్‌బీఎస్): 4.5 మీటర్లు, 3 చాన్సులు
మహిళలు:
- 100 మీటర్లు పరుగు: 18 సెకన్లు
- 800 మీటర్లు పరుగు: 4 నిమిషాలు
- లాంగ్ జంప్: 2.7 మీటర్లు, 3 చాన్సులు
- హైజంప్: 0.9 మీటర్లు, 3 చాన్సులు
దరఖాస్తు విధానం:
- ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ విధానాల్లో దరఖాస్తు పంపొచ్చు. ఆన్‌లైన్‌లో పంపాలంటే పార్ట్-1 రిజిస్ట్రేషన్, పార్ట్-2 రిజిస్ట్రేషన్ చేయాలి.
- జనరల్, ఓబీసీ అభ్యర్థులు సెంట్రల్ రిక్రూట్‌మెంట్ ఫీ స్టాంప్స్ (సీఆర్‌ఎఫ్‌ఎస్) ద్వారా ఆఫ్‌లైన్‌లో రూ.100 ఫీజు చెల్లించవచ్చు. ఇవి అన్ని పోస్టాఫీసుల్లో లభ్యమవుతాయి.
- నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/ఎస్‌బీఐ బ్యాంక్ చలానా ద్వారా ఆన్‌లైన్‌లో చెల్లించవచ్చు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
ముఖ్య తేదీలు:
- పార్ట్-1 రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 26, 2015.
- పార్ట్-2 రిజిస్ట్రేషన్: ఏప్రిల్ 28, 2015.
- పరీక్ష తేదీ: జూన్ 21, 2015.
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం.
- వెబ్‌సైట్లు: www.ssconline.nic.in; www.ssconline2.gov.in
సిలబస్
- జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్: ఇందులో వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ విభాగాలుంటాయి. అనాలజీస్, స్పేస్ విజువలైజేషన్, ప్రాబ్లం సాల్వింగ్, అనాలిసిస్, జడ్జ్‌మెంట్, డెసిషన్ మేకింగ్, విజువల్ మెమరీ, అర్థమెటికల్ రీజనింగ్, కోడింగ్, డీకోడింగ్, నంబర్ సిరీస్, ఫిగర్ సిరీస్ తదితర అంశాలుంటాయి.
- జనరల్ అవేర్‌నెస్: భారతదేశం, పొరుగుదేశాలకు సంబంధించి ప్రశ్నలు ఉంటాయి. హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకానమీ, జనరల్ పాలిటీ, భారత రాజ్యాంగం, సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలుంటాయి.
- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: యావరేజెస్, రేషియోస్, ప్రాఫిట్ అండ్ లాస్, స్క్వేర్ రూట్స్, టైమ్ అండ్ వర్క్, ట్రిగనోమెట్రిక్ రేషియో, డిగ్రీ అండ్ రేడియన్ మెజర్స్, స్టాండర్డ్ ఐడెంటిటీస్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, సర్కిల్స్, పర్సంటేజీ తదితర అంశాలుంటాయి.
- ఇంగ్లిష్ కాంప్రహెన్షన్: ఎత్తులు, దూరాలను అర్థం చేసుకునే సామర్థ్యం, హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్, బార్ డయాగ్రమ్ అండ్ పై చార్ట్, కరెక్ట్ ఇంగ్లిష్ వంటి వాటిపై ప్రశ్నలు ఉంటాయి.
- పేపర్ 2- ఇంగ్లిష్ లాంగ్వేజ్, కాంప్రహెన్షన్: ఎర్రర్ రికగ్నినషన్, ఫిలింగ్ ది బ్లాంక్స్, వొకాబ్యులరీ, స్పెల్లింగ్స్, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, సెంటెన్స్ కంప్లీషన్, ప్రేజెస్ అండ్ ఇడిమాటిక్ యూజ్ ఆఫ్ వర్డ్స్, కాంప్రెహెన్షన్ వంటివి ఉంటాయి.
సరైన ప్రాక్టీస్‌తోనే సక్సెస్ దరఖాస్తు నింపేటప్పుడు పోస్టుల ప్రాధాన్యత క్రమం విషయంలో అభ్యర్థులు జాగ్రత్తగా వ్యవహరించాలి. వేతనాలు, పని వాతావరణం, పని ప్రదేశం, పదోన్నతులు.. ఇలాంటి విషయాలను పరిగణనలోకి తీసుకొని ప్రాధాన్యతలు ఇవ్వాలి. తర్వాత వీటిని మార్చుకునేందుకు వీల్లేదు. ప్రస్తుత ఎస్‌ఐ, ఏఎస్‌ఐ పరీక్ష విధానం.. ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ (సీజీఎల్) పరీక్షతో పోలి ఉంది. అయితే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ క్లిష్టత సీజీఎల్ కంటే తక్కువగా ఉండే అవకాశముంది. రీజనింగ్ కాఠిన్యత సమానంగా ఉండొచ్చు.
|
2014 ప్రశ్న పత్రం కోసం క్లిక్ చేయండి
Published date : 09 Apr 2015 05:37PM