Skip to main content

ఎస్‌ఎస్‌సీ-సీజీఎల్‌ఈ 2019 పక్కా కొలువుకు వ్యూహాలు..

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)... కంబైన్‌‌డ గ్రాడ్యుయేట్ లెవల్ (సీజీఎల్) ఎగ్జామినేషన్‌కు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో కీలకమైన గ్రూప్-బీ,సీ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనుంది. డిగ్రీతోనే కేంద్రంలో ఉన్నత కొలువులు దక్కించుకునే వీలు కల్పిస్తోంది ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష. ఈ నేపథ్యంలో... కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ పరీక్షలో విజయానికి నిపుణుల గెడైన్స్...
ఎంపిక:
ఎస్‌ఎస్‌సీ సీజీఎల్ పరీక్ష మూడు/నాలుగు దశల్లో జరుగుతుంది. మొదటి దశలో... టైర్-1 పరీక్ష ఆన్‌లైన్ విధానంలో ఉంటుంది. ఇందులో నిర్దేశిత మార్కులు సాధించిన వారికి టైర్-2 పరీక్ష ఆన్‌లైన్ పద్ధతిలో నిర్వహిస్తారు. టైర్-3 ఇంగ్లిష్/హిందీ నైపుణ్యం పరీక్షించేలా ఉంటుంది. తర్వాత దశలో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్/స్కిల్ టెస్ట్/డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. ఫైనల్‌గా టైర్-1, 2, 3ల్లో సాధించిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు.

పరీక్షా విధానం :
టైర్-1ను గంట వ్యవధిలో మల్టిపుల్ ఛాయిస్ విధానంలో నిర్వహిస్తారు. ఇందులో నాలుగు సబ్జెక్టులు.. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్‌నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు 2 మార్కుల చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. టైర్-2తోపాటు టైర్-3 కూడా ఒకేసారి నిర్వహిస్తారు. గంట సమయంలో నిర్వహించే టైర్-3 పరీక్ష పూర్తిగా ‘పెన్ అండ్ పేపర్’ విధానంలో జరుగుతుంది. హిందీ/ఇంగ్లిష్ మాధ్యమంలో ప్రశ్న పత్రం ఉంటుంది. ఇందులో లెటర్ రైటింగ్, ప్రిసైజ్ రైటింగ్, ఎస్సే రైటింగ్, అప్లికేషన్ రైటింగ్ మొదలైనవి ఉంటాయి.

ప్రిపరేషన్ :
టైర్-1,2 పరీక్షల సిలబస్‌లో పలు ఉమ్మడి అంశాలు ఉన్నాయి. ప్రధానంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లిష్‌లపై పట్టుసాధిస్తే.. ఉద్యోగానికి దరి చేరినట్లే. మొత్తం 600 మార్కులకుగాను ఏకంగా 500 మార్కులు ఈ రెండు సబ్జెక్టుల నుంచి అడుగుతుండటం గమనార్హం. కాబట్టి వీటిపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ :
ఇందులో ప్యూర్ మ్యాథ్స్ నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఆల్జీబ్రా, ట్రిగనామెట్రీ, జామెట్రీ, మెన్సురేషన్ చాప్టర్లపై ప్రధానంగా దృష్టిపెట్టాలి. వీటిల్లో ప్రతి చాప్టర్ నుంచి 4-6 మార్కులు చొప్పున అడిగే అవకాశం ఉంది. అర్థమెటిక్‌లో రేషియో-ప్రపోర్షన్, ఇంట్రస్ట్, ప్రాఫిట్-లాస్, డిస్కౌంట్, పార్టనర్‌షిప్ బిజినెస్, మిక్చర్ అండ్ అలిగేషన్, టైం అండ్ వర్క్, టైం అండ్ డిస్టెన్స్, పర్సంటేజెస్, డేటా ఇంటర్‌ప్రెటేషన్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. వీటిలో నంబర్ సిస్టం, పర్సంటేజెస్, రేషియో-ప్రపోర్షన్స్ ముఖ్యమైన అంశాలు. అభ్యర్థులు తొలుత బేసిక్స్‌పై దృష్టిసారించాలి. ఈజీ టు హార్డ్ క్రమంలో సమస్యల సాధనను అలవరచుకోవాలి. గత పరీక్షల్లో అడిగిన తరహాలోనే(మోడల్) ప్రశ్నలు పునరావృతమవుతున్నాయి. కాబట్టి ప్రీవియస్ పేపర్లను తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాలి. డేటాఇంటర్‌ప్రిటేషన్ ప్రశ్నలు తేలిగ్గానే ఉంటాయి. అర్థమెటిక్‌లో బేసిక్స్ నేర్చుకుంటే.. డేటా ఇంటర్‌ప్రిటేషన్ సన్నద్ధత సులువు అవుతుంది.

ఇంగ్లిష్ :
టైర్ 1లో.. 50 మార్కులు, టైర్ 2లో 200 మార్కులకు ఇంగ్లిష్ ఉంటుంది. ఇంగ్లిష్‌పై అడిగే ప్రశ్నలను మూడు రకాలుగా విభజించొచ్చు. అవి.. గ్రామర్ ఆధారిత ప్రశ్నలు, వొకాబ్యులరీ సంబంధిత ప్రశ్నలు, రీడింగ్ కాంప్రెహెన్షన్. మొదట గ్రామర్ రూల్స్ తెలుసుకోవడంతోపాటు వాటి అప్లికేషన్ ఆధారిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. గ్రామర్‌కు సంబంధించి అడిగే ప్రశ్నలు పునరావృతమవుతున్నాయి. కాబట్టి ప్రీవియస్ బిట్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. పుస్తకాలతోపాటు నిత్యం ఇంగ్లిష్ పత్రికల్లో వచ్చే ఎడిటోరియల్స్ చదువుతూ కొత్త పదాలు నోట్ చేసుకోవాలి. రీడింగ్ కాంప్రెహెన్షన్‌లో వచ్చే ప్యాసేజీలను తప్పకుండా అటెంప్ట్ చేయడానికి ప్రయత్నించాలి. తద్వారా మంచి స్కోర్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ :
అత్యంత సులువైన సెక్షన్ ఇది. కొద్దిపాటి శ్రమతో టైర్-1లో 50 మార్కులు పొందవచ్చు. ఇందులో వెర్బల్, నాన్ వెర్బల్ తరహా ప్రశ్నలు ఉంటాయి. అనాలజీస్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్; స్పేస్ విజువలైజేషన్, కోడింగ్-డీకోడింగ్, న్యూమరికల్ ఆపరేషన్స్, వెన్‌డయాగ్రమ్స్ తదితర అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

జనరల్ అవేర్‌నెస్ :
ఇందులో స్టాటిక్ బిట్స్ ఎక్కువగా అడుగుతున్నారు. ఇది సిలబస్ దృష్ట్యా అతిపెద్ద సెక్షన్. హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, జనరల్ సైన్స్, స్టాండర్డ్ జీకే, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. తొలుత ఆసక్తి ఉన్న అంశాలతో ప్రిపరేషన్ ప్రారంభించాలి. మార్కెట్‌లో దొరికే అరిహంత్ పబ్లికేషన్స్ బుక్స్ చదివితే ఉపయుక్తం. 50 మార్కులైనా విజయంలో కీలక పాత్ర ఈ సెక్షన్‌దే. నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. కాబట్టి వీలైనంత వరకు కచ్చితంగా తెలిసిన వాటికే సమాధానాలు గుర్తించడం మేలు.

ముఖ్య తేదీలు :
దరఖాస్తుల స్వీకరణకు చివరి తేది:
2019, నవంబర్ 25
టైర్-1 కంప్యూటర్ పరీక్ష తేదీలు: 2020, మార్చి 2 నుంచి 11 వరకు
టైర్-2, 3 పరీక్ష తేదీలు: 2020 జూన్ 22 నుంచి జూన్ 25 వరకు
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in

ప్రశ్నల సరళి కఠినంగా..
క్వాంటిటేటివ్ ఎబిలిటీలో ప్యూర్ మ్యాథ్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టడం లాభిస్తుంది. గతేడాది నుంచి క్వాంట్ సెక్షన్‌లో క్యాలిక్యులేషన్‌కు ప్రాధాన్యం పెరిగింది. కాబట్టి అభ్యర్థులు కఠినంగా ఉన్న ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. బ్యాంకింగ్ పరీక్షలు నిర్వహించే సంస్థకు సీజీఎల్ ఎగ్జామ్స్ బాధ్యతలు అప్పగించారు కాబట్టి ప్రశ్నల సరళి కఠినంగా ఉండే ఆస్కారముంది. ఇంగ్లిష్‌లో గ్రామర్, వొకాబ్యులరీలకు సమ ప్రాధాన్యం ఉంటుంది. రీజనింగ్‌కు ప్రీవియస్ బిట్స్ ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. జీఎస్‌కు కరెంట్ అఫైర్స్‌తో లింక్ పెట్టి అడుగుతున్నారు. ఎకానమీ, బయాలజీ, కెమిస్ట్రీ సబ్జెక్టులను వర్తమాన అంశాల మేళవింపుగా చదవుకోవాలి. అరిహంత్ జీకే, లూసెంట్ జీకే పుస్తకాలు, ప్రీవియస్ బిట్స్, ఆరు నెలల కరెంట్ అఫైర్స్ చదవడం లాభిస్తుంది.
-రాజశేఖర్, ఐరైజ్.

ఎస్సెస్సీ సీజీఎస్-2019స్టడీమెటీయల్, ఆన్‌లైన్ టెస్టులు, సిలబస్, గెడైన్స్, ప్రీవియస్ పేపర్స్, మోడల్ పేపర్స్ మొదలైన వాటి కోసం క్లిక్ చేయండి
Published date : 07 Nov 2019 02:11PM

Photo Stories