Skip to main content

ఎస్‌ఐ కొలువు కొట్టేదెలా..?

ధైర్యం, చురుకుదనం కలిగిన యువతకు దేశ భద్రతా దళాల్లో చేరేందుకు అవకాశమొస్తే..! ఎగిరి గంతేయరూ..!! తాజాగా స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ) ఢిల్లీ పోలీస్, సెంట్రల్ ఆర్మడ్ పోలీస్ ఫోర్సెస్(సీఏపీఎఫ్)లో సబ్ ఇన్స్‌పెక్టర్(ఎస్‌ఐ), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు(సీఐఎస్‌ఎఫ్)లో అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ (ఏఎస్‌ఐ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. రక్షణ దళాల్లో చేరాలనుకునే అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ సమాచారం.. ఎంపిక ప్రక్రియ.. ప్రిపరేషన్ టిప్స్...
ఉద్యోగాలెక్కడ..?
  1. సబ్ ఇన్స్‌పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్.
  2. సబ్ ఇన్స్‌పెక్టర్ ఇన్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్.
  3. సబ్ ఇన్స్‌పెక్టర్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్.
  4. సబ్ ఇన్స్‌పెక్టర్ ఇన్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్.
  5. సబ్ ఇన్స్‌పెక్టర్ ఇన్ ఇండో టిబెటిన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్.
  6. సబ్ ఇన్స్‌పెక్టర్ ఇన్ సశస్త్ర సీమా బల్.
  7. అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ ఇన్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్.
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: జనవరి 1, 2020 నాటికి 25 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్ల్లు వయోసడలింపు ఉంటుంది.
శారీరక ప్రమాణాలు: ఎత్తు-పురుషులు 170 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీ మీటర్లు ఉండాలి. పురుషులకు ఛాతీ ఊపిరి పీల్చిన తర్వాత కనీసం 80 సెంటీమీటర్లు; పీల్చక ముందు 75 సెంటీమీటర్లు ఉండాలి. మహిళలు, ఎస్టీలు, కొన్ని ప్రాంతాలకు చెందిన అభ్యర్థులకు ఎత్తుకు సంబంధించి సడలింపు ఉంది.

వేతనం :
సబ్ ఇన్స్‌పెక్టర్(జీడీ)-సీఏపీఎఫ్: పే స్కేలు రూ.35,400-1,12,400
సబ్ ఇన్స్‌పెక్టర్(ఎగ్జిక్యూటివ్), ఢిల్లీ పోలీస్: పే స్కేలు రూ.35,400-1,12,400
అసిస్టెంట్ సబ్ ఇన్స్‌పెక్టర్ (ఎగ్జిక్యూటివ్), సీఐఎస్‌ఎఫ్: రూ.29,200-92,300

ఎంపిక ప్రక్రియ :
రాతపరీక్ష, పీఈటీ, పర్సనాలిటీ టెస్టు, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

రాతపరీక్ష :
  • రాత పరీక్ష రెండు పేపర్లుగా(పేపర్1, పేపర్2) ఆన్‌లైన్ విధానంలో జరుగుతుంది. పేపర్ 1.. 200 మార్కులకు ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు; జనరల్ నాలెడ్జ్, జనరల్ అవేర్‌నెస్ 50 ప్రశ్నలు-50 మార్కులకు; క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 50 ప్రశ్నలు-50 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. పరీక్ష సమయం రెండు గంటలు. పేపర్-1లో అర్హత సాధించిన వారికి పీఈటీ ఉంటుంది. ఇందులోనూ క్వాలిఫై అయితే పేపర్ 2 రాసే అవకాశం లభిస్తుంది.
  • పేపర్ 2.. 200 మార్కులకు జరుగుతుంది. ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ టాపిక్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. రెండు పేపర్లలోనూ నెగిటివ్ మార్కుల విధానం అమల్లో ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 వంతు మార్కు కోతవిధిస్తారు. పరీక్షలో అర్హత పొందేందుకు రెండు పేపర్లలో వేర్వేరుగా జనరల్ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ, ఈబీసీలు 25 శాతం, ఎస్సీ, ఎస్టీలు 20 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. రెండు పేపర్లలో పొందిన మార్కులు, రిజర్వేషన్లను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి తుది జాబితా ప్రకటిస్తారు.

ప్రిపరేషన్ ప్లాన్ :
జనరల్ ఇంటెలిజన్స్ అండ్ రీజనింగ్ :

సిమాంటిక్స్, నంబర్ అండ్ ఫిగర్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వర్డ్ బిల్డింగ్, న్యూమరికల్ ఆపరేషన్స్, వెన్ డయాగ్రమ్స్, డీ కోడింగ్ అండ్ క్లాసిఫికేషన్, క్రిటికల్ థింకింగ్, ఎమోషనల్ అండ్ సోషల్ ఇంటెలిజెన్స్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. నంబర్ సిరీస్, లెటర్ సిరీస్, కోడింగ్-డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, క్యాలెండర్, అనాలజీ, ఆడ్‌మన్ అవుట్, సీటింగ్ ఎరేంజ్‌మెంట్‌లపై ప్రశ్నలు అడిగే అవకాశముంది. కాబట్టి ముందుగా వీటి అధ్యయనం పూర్తి చేసి తర్వాత.. పజిల్స్, హైలెవల్ రీజనింగ్, స్టేట్‌మెంట్ అజంప్షన్, క్రిటికల్ రీజనింగ్ ప్రశ్నలకు వెళ్లాలి. ఈ విభాగంలో కనీసం 35 ప్రశ్నలకు తగ్గకుండా సమాధానాలు గుర్తించేందుకు ప్రయత్నించాలి.

జనరల్ నాలెడ్జ్ , జనరల్ అవేర్‌నెస్ :
హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటీ, ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ టాపిక్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ విభాగాన్ని స్టాటిక్, కరెంట్ విభాగాలుగా విభజించుకొని చదవాలి. స్టాటిక్ విభాగంలో చరిత్ర, భౌగోళిక, సాంఘిక, ఆర్థిక శాస్త్రాలను, కరెంట్ విభాగంలో వర్తమాన అంశాలను ప్రిపేర్‌కావాలి.

క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ :
నంబర్స్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, పర్సంటేజ్, రేషియో అండ్ ప్రిపోజిషన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంటరెస్ట్, టైమ్ అండ్ డిస్టెన్స్, బేసిక్ ఆల్ జీబ్రా, ఐడెంటిటీస్, లీనియర్ ఈక్వేషన్స్, ట్రయాంగల్, సర్కిల్, టాంజెంట్స్, యాంగిల్స్, క్వాడ్రిలేటరల్స్, పాలిగాన్స్, స్పియర్, హెమీస్పియర్, ట్రిగనోమెట్రిక్ రేషియో, డిగ్రీ అండ్ రేడియన్ మెజర్స్, స్టాండర్డ్ ఐడెంటి టీస్, హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ పాలిగాన్, బార్ డయాగ్రమ్, పైచార్ట్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఫార్ములాలపై పట్టు సాధించడం ద్వారా ఈ విభాగంలో మంచి మార్కులు సాధించవచ్చు.

ఇంగ్లిష్ :
ఇంగ్లిష్ ప్రొఫిషియెన్సీ, కాంప్రహెన్షన్ అండ్ రైటింగ్ ఎబిలిటీ, ఎర్రర్ రికగ్నిషన్, వొకాబ్యులరీ, స్పెల్లింగ్, గ్రామర్, సెంటెన్స్ స్ట్రక్చర్, సినానిమ్స్, యాంటనిమ్స్, సెంటెన్స్ కంప్లీషన్, ప్రేజెస్ అండ్ ఇడియమ్స్, కాంప్రహెన్షన్ టాపిక్స్‌పై ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల స్థాయి సాధారణంగా ఉంటుంది. టెన్సెస్, వాయిస్, ఆర్టికల్స్, ప్రిపొజిషన్స్, యాంటనిమ్స్, సినానిమ్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, సెంటెన్స్ ఎరేంజ్‌మెంట్, సెంటెన్స్ కరెక్షన్, గ్రామర్‌లపై పట్టుసాధిస్తే... ఈ విభాగంలో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు.

ప్రిపరేషన్ టిప్స్..
  • అభ్యర్థులు ముందుగా ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానంపై అవగాహన పెంచుకోవాలి.
  • గత ప్రశ్నపత్రాలను అధ్యయనం చేసి.. ప్రశ్నల శైలిపై పట్టుసాధించాలి.
  • వీలైనన్ని మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ఆయా పరీక్షల్లో ప్రదర్శనను విశ్లేషించుకోవాలి.
  • విభాగాల వారీ కటాఫ్ మార్కుల నిబంధన ఉంది. కాబట్టి ప్రతి విభాగంలోనూ కనీస మార్కులు పొందినప్పుడే రెండో దశకు అర్హత లభిస్తుంది.
  • పేపర్-2 పూర్తిగా ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్‌పైనే ఉంటుంది. కాబట్టి దీనిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
  • పరీక్షకు వ్యవధి తక్కువగా ఉంది. కాబట్టి ముందు పేపర్-1లో అర్హత సాధించడంపై దృష్టిపెట్టాలి. అనంతరం పీఈటీ,పేపర్-2లకు సంబంధించి సన్నద్ధత ప్రారంభించాలి.
  • మాదిరి ప్రశ్నలను సాధన చేయడం ద్వారా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లో ఎక్కువ మార్కులు స్కోర్‌చేసేందుకు వీలుంది.
  • గత ఆరునెలల వ్యవధిలో చోటు చేసుకున్న జాతీయ, అంతర్జాతీయ పరిణామాలపై పట్టు సాధించాలి. క్రీడలు, అవార్డులు, వార్తల్లోని వ్యక్తులు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.

ముఖ్యసమాచారం :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ:
అక్టోబరు 16, 2019
దరఖాస్తు ఫీజు: రూ.100
పరీక్ష తేదీలు: పేపర్ 1: డిసెంబరు 11-13, 2019, పేపర్ 2: పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, వరంగల్, గుంటూరు, కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ.
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://ssc.nic.in
Published date : 09 Oct 2019 12:59PM

Photo Stories