Skip to main content

వర్చువల్ ఇంటర్న్‌షిప్స్‌లో సమయ పాలన-పని విభజన ఏలా?

వాస్తవానికి ఇంటర్న్‌షిప్‌కు ఎక్కడ అవకాశం వచ్చిందో అక్కడికి వెళ్లి పనిచేస్తారు.
దానివల్ల కుటుంబం, స్నేహితులకు దూరంగా ఉండటంతోపాటు ప్రయాణం, ఇతర వ్యయ ప్రయాసలు ఎదురవుతాయి. కానీ వర్చువల్ విధానంలో ఉన్న చోటు నుంచే పనిచేయడం ద్వారా ఆ ఇబ్బందులను అధిగమించవచ్చు. కాలేజీ చదువులు కొనసాగిస్తునే.. కుటుంబానికి, స్నేహితులకు దగ్గరగా ఉంటూనే.. ఇంటర్న్‌షిప్ పూర్తి చేసే వెసులుబాటు ఉంటుంది. ఈ విధానంలో సమయ పాలన, సమయ విభజనను అనుసరించాలి. అంతేకాకుండా వర్చువల్ విధానంలో విద్యార్థులు.. కంపెనీలోని సీనియర్లు, సిబ్బందితో నిత్యం మాట్లాడుతూ, సందేహాలు నివృత్తి చేసుకుంటూ ఉంటేనే మెరుగైన పనితీరు కనబరచగలరు.
 
Published date : 09 Oct 2020 05:18PM

Photo Stories