వేసవి విజ్ఞానం...కెరీర్‌కు సోపానం
Sakshi Education
పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడ్స్ లక్ష్యంగా పుస్తకాలతో కుస్తీపట్టిన విద్యార్థులు వేసవి సెలవుల్లో ‘రిలాక్స్’ అవుదామనే ఆలోచనలో ఉంటారు.
కానీ, ఆధునిక కాలంలో కెరీర్ పరంగా భవిష్యత్తులో ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి! అకడమిక్ నైపుణ్యాలకు అదనంగా మరెన్నో స్కిల్స్ ఉంటేనే జాబ్ మార్కెట్లో విలువ ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకోవడంపై నిపుణుల సూచనలు..
కంప్యూటర్ బేసిక్ స్కిల్స్ :
ప్రస్తుత పోటీ ప్రపంచంలో పదో తరగతి నుంచి పీజీ విద్యార్థుల వరకు ప్రతి ఒక్కరికీ ప్రాథమిక స్థాయి కంప్యూటర్ నిర్వహణ నైపుణ్యాలు తప్పనిసరి. ఇంటర్ అర్హతతో నిర్వహించే జేఈఈ మొదలు.. బ్యాచిలర్ డిగ్రీ అనంతరం ఉండే క్యాట్, గేట్ వరకు ఇప్పడు ప్రవేశ పరీక్షలన్నీ ఆన్‌లైన్‌లో విధానంలోనే జరుగుతున్నాయి. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్‌పై ప్రాథమిక అవగాహన తప్పనిసరిగా మారింది. ఇటీవల కాలంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్లు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్‌లు సైతం కొన్ని ఉద్యోగాలకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్టులు నిర్వహిస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులు వేసవి సెలవులను కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకోవాలి. ఇందులో భాగంగా ఎంఎస్ ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ టూల్స్‌లో శిక్షణ తీసుకోవాలి. ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్‌లో శిక్షణ పొందితే సర్టిఫికెట్ సైతం లభిస్తుంది. ఈ సర్టిఫికెట్ భవిష్యత్తులో అదనపు అర్హతగా ఉంటుంది.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం :
ఈఆర్‌పీ సొల్యూషన్స్ :
ప్రస్తుతం సంస్థల్లో సాధారణ పరిపాలన నుంచి ఉత్పాదక సాంకేతికత వరకు ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్‌పీ) ద్వారా కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈఆర్‌పీ సొల్యూషన్స్ కోణంలో శాప్, అకౌంటింగ్ ప్యాకేజెస్, ట్యాక్సేషన్ వంటి సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ తీసుకోవడం లాభిస్తుంది.
విదేశీ భాషా నైపుణ్యాలు :
ప్రస్తుతం జాబ్ మార్కెట్లో అభ్యర్థులను ముందంజలో నిలుపుతున్న మరో అంశం.. విదేశీ భాషా నైపుణ్యం. పలు సంస్థలు తమ నియామక ప్రక్రియలో ఇంగ్లిష్‌తోపాటు మరో విదేశీ భాషలో నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా జర్మన్, ఫ్రెంచ్, జపనీస్ భాషలకు ప్రాధాన్యం పెరిగింది. వివిధ దేశాల ఎంబసీల ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌లు, పలు ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్‌లో ఆయా భాషల్లో తర్ఫీదునిస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని విద్యార్థులు విదేశీ భాషా శిక్షణకు వేసవి సెలవులను ఉపయోగించుకోవాలి.
సాఫ్ట్‌స్కిల్స్..
సాఫ్ట్‌స్కిల్స్.. కార్పొరేట్ రంగంలో ఈ మాటకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు! నేటి ఆటోమేషన్ యుగంలోనూ సాఫ్ట్‌స్కిల్స్ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో డిగ్రీ, ఆపై స్థాయి కోర్సుల విద్యార్థులు వేసవి సెలవుల్లో కమ్యూనికేషన్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, పీపుల్, బిహేవియర్ స్కిల్స్‌లో శిక్షణ పొందాలి. సాఫ్ట్‌స్కిల్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యానికి అనుగుణంగా కెరీర్ కౌన్సెలింగ్ సంస్థలు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏర్పాటయ్యాయి. సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణకు వీటిలో కొంత సమయం వెచ్చించడం లాభిస్తుంది.
వాస్తవ పరిస్థితులపై పరిజ్ఞానం :
కోర్సు ఏదైనా.. కెరీర్ పరంగా వాస్తవ పరిస్థితులపై పరిజ్ఞానం కీలకంగా మారింది. ఈ క్రమంలో విద్యార్థులు వాస్తవ పరిస్థితులపై నైపుణ్యాలు అందించే ఇంటర్న్‌షిప్స్, అప్రెంటీస్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ వర్క్స్‌లో పాల్గొనాలి. ముఖ్యంగా టెక్నికల్, మేనేజ్‌మెంట్ డిగ్రీల చివరి సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ‘అకడమిక్ సంవత్సరం ప్రారంభమయ్యాక చూద్దాంలే..’ అనే భావన ఏ మాత్రం మంచిది కాదు. కాబట్టి ఇప్పటి నుంచే ఆ దిశగా దృష్టిసారిస్తే చివరి సంవత్సరంలో ఎదురయ్యే అకడమిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందొచ్చు.
ముందస్తు సన్నద్ధత..
ప్రస్తుతం విద్యార్థులంతా ఉన్నతవిద్య అవకాశాలకు సంబంధించి స్పష్టతతో ఉంటున్నారు. ఈ క్రమంలో గేట్, క్యాట్, జీఆర్‌ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ తదితర పరీక్షల్లో బెస్ట్ స్కోర్లను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా విద్యార్థులు ఇప్పటి నుంచే సన్నద్ధత ప్రారంభించాలి. ఈ విరామ సమయంలో ఇన్‌స్టిట్యూట్‌లు అందించే షార్ట్‌టర్మ్, క్రాష్ కోర్సుల్లో శిక్షణ తీసుకోవడంద్వారా భవిష్యత్‌లో వివిధ పరీక్షల్లో మెరుగైన ప్రదర్శన కనబరచొచ్చు.
కెరీర్ ప్లానింగ్..
విద్యార్థులు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన మరో అంశం.. కెరీర్ ప్లానింగ్. ముఖ్యంగా పదోతరగతి, ఇంటర్ విద్యార్థులు భవిష్యత్తులో ఏం చదవాలనుకుంటున్నారు? వాటి ద్వారా లభించే అవకాశాలు ఏమిటి? తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. దీనికోసం వ్యక్తిగత ఆసక్తి, అభిరుచులను బేరీజు వేసుకుంటూ కోర్సుల గురించి తెలుసుకోవాలి. ఇందులో భాగంగా కెరీర్ కౌన్సెలర్లను సంప్రదించడం లాభిస్తుంది.
సెలవులు.. సంపాదనకు మార్గాలు
వేసవి సెలవుల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికే కాదు. సంపాదనకూ అవకాశముంది. ఈ క్రమంలో పార్ట్‌టైమ్, ఫ్రీలాన్స్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. రెండు, మూడు నెలల వ్యవధిలో వీటిని చేయడం ద్వారా కొంత మొత్తం ఆర్జించొచ్చు. ఈ మొత్తాన్ని పై చదువులకు ఉపయోగించుకోవచ్చు.
డేటా ఎంట్రీ :
ప్రస్తుతం టైపింగ్ స్కిల్స్‌తోపాటు సొంతంగా కంప్యూటర్ ఉంటే నెలకు కనీసం రూ.10 వేలు సంపాదించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో పలు ఔట్‌సోర్సింగ్ సంస్థలు.. శాశ్వత సిబ్బంది కంటే పార్ట్‌టైమ్ లేదా ఆన్‌లైన్ విధానంలో సిబ్బందిని నియమించుకుంటున్నాయి. ఈ ధోరణి బీపీఓ, కేపీఓ, ఎల్‌పీఓల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలో యువత వేసవి సెలవులను ఉపయోగించుకోవచ్చు. ఈ ఉద్యోగ అవకాశాల గురించి జాబ్‌సెర్చ్ పోర్టల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫ్రీలాన్సర్, ట్రూలాన్సర్ వంటి సంస్థలు ప్రత్యేకంగా ఆన్‌లైన్ టైపింగ్, డేటా ఎంట్రీ అవకాశాల గురించి తెలియజేస్తున్నాయి.
కాపీ రైటింగ్ :
ప్రస్తుతం సంస్థలు తమ ప్రొడక్ట్ లేదా సర్వీసుకు సంబంధించిన వివరాలు, ప్రత్యేకతలను ఆకర్షణీయంగా వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో కాపీ రైటర్స్‌కు టైమ్, పీస్ రేట్ ప్రాతిపదికన వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ సంస్థలు ఫుల్‌టైమ్ కంటే పార్ట్ టైమ్ నియామకాలకే మొగ్గుచూపుతున్నాయి. ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు ఇది ఓ మంచి అవకాశం.
విష్ మాస్టర్స్ :
ప్రస్తుతం వస్తువుల కొనుగోలు ఎక్కువగా ఆన్‌లైన్లోనే జరుగుతోంది. దీంతో ఈ-కామర్స్ సంస్థలు నిర్దేశిత సమయానికి వినియోగదారులకు ప్రొడక్ట్‌ను అందించేందుకు విష్ మాస్టర్స్ పేరుతో డెలివరీ బాయ్స్‌ను నియమించుకుంటున్నాయి. సంస్థలు ఈ విషయంలో శాశ్వత సిబ్బంది కంటే పార్ట్‌టైమ్ నియామకాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంత వాహనం ఉన్నవారు డెలివరీ డ్రైవర్స్, విష్ మాస్టర్స్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు పొందొచ్చు. ఈ ఉద్యోగాల ద్వారా నెలకు కనీసం రూ.10 వేలు సంపాదించే అవకాశం ఉంది. యువతకు ఇక్కడ కలిసొచ్చే మరో ప్రధాన అంశం.. విధుల పరంగా వారు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతం పరిధిలోనే ఆఫర్లు ఇచ్చేలా సంస్థలు వ్యవహరిస్తుండటమే.
వెబ్ డిజైనింగ్ :
వెబ్ డిజైనింగ్, వెబ్‌సైట్ నిర్వాహక నైపుణ్యాలు ఉన్నవారికి చక్కటి సంపాదన మార్గం అందుబాటులో ఉంది. ప్రస్తుతం చిన్నచిన్న సంస్థలు సైతం తమ వివరాలు ఇంటర్నెట్‌లో కనిపించాలని కోరుకుంటున్నాయి. దీనికోసం తక్కువ ఖర్చుతో వెబ్‌సైట్లను రూపొందించుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా అవకాశాలను అందుకొని వెబ్‌సైట్‌ను రూపొందిస్తే.. కనిష్టంగా రూ.25 వేలు గరిష్టంగా రూ.లక్ష వరకు సంపాదించొచ్చు.
‘హోమ్’ ట్యూటర్ :
సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎక్స్‌ప్రెషన్ స్కిల్స్ ఉంటే.. నెలకు రూ.20 వేల వరకు సంపాదించే అవకాశం కల్పిస్తున్నాయి హోమ్ ట్యూషన్ జాబ్స్! ఇటీవల కాలంలో చాలా కుటుంబాలు తమ పిల్లల భద్రత దృష్ట్యా హోమ్ ట్యూటర్ల కోసం అన్వేషిస్తున్నాయి. దీంతో ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌లకు సంబంధించి హోం ట్యూటర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో హోమ్‌ట్యూటర్‌గా మారితే ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.5 వేల వరకు పొందొచ్చు. అదేవిధంగా ఆన్‌లైన్ ట్యూటర్స్‌గా చేరితే నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదించొచ్చు. ప్రస్తుతం పలు ఎడ్‌టెక్ సంస్థలు ఆన్‌లైన్ ట్యూటర్ల కోసం అన్వేషిస్తున్నాయి. ఆయా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే వేసవి సెలవుల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేలు సంపాదించొచ్చు.
అందుకునే మార్గమేంటి ?
వేసవి సెలవుల్లో స్కిల్ ట్రైనింగ్, షార్ట్‌టర్మ్ జాబ్‌లను అందుకునే మార్గాలపై చాలామందికి సందేహాలు తలెత్తడం సహజమే. అయితే ప్రస్తుత ఆన్‌లైన్ యుగంలో వీటిని నివృత్తి చేసుకోవడం కష్టంమేమీ కాదు. స్కిల్ ట్రైనింగ్‌కు సంబంధించి ఐబీఎం, ఇంటెల్, వీఎం వేర్, బ్లాక్ చైన్ కౌన్సిల్ తదితర వెబ్‌సైట్ల ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న శిక్షణ కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు. జాబ్ సెర్చ్ పోర్టల్స్, మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలు, సంస్థల వెబ్‌సైట్ల ఆధారంగా స్వల్పకాలిక ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు.
‘రిలాక్స్’ కొంత వరకే...
‘ఇప్పటి వరకు పరీక్షల ఒత్తిడితో ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుదాం’ అనే దృక్పథాన్ని విద్యార్థులు కొంతమేరకే పరిమితం చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం సగటున ప్రతి మూడు నెలలకు ఒక కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నట్లు అంతర్జాతీయ సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఎప్పటికప్పుడు ఆధునిక నైపుణ్యాలను సొంతంచేసుకోవడంపై దృష్టిపెట్టాలి. ఈ దిశగా వేసవి సెలవులను ఉపయోగించుకోవాలి.
- వి.మోనిష్, స్టూడెంట్ కోఆర్డినేటర్, ఇన్ఫోసిస్ టీక్యూ.

- వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు తాజా సాంకేతికతలపై అవగాహన తప్పనిసరి. ప్రస్తుతం జాబ్ మార్కెట్లో నూతన సాంకేతికతలకు ప్రాధాన్యం పెరిగింది. కాబట్టి బీటెక్, ఎంబీఏ తదితర వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులు ఆటోమేషన్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఐవోటీ, బిగ్‌డేటా తదితర కోర్సుల్లో శిక్షణ పొందాలి. వివిధ కోర్సుల చివరి సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు ఈ దిశగా దృష్టిసారించాలి.
- ప్రస్తుతం ఐబీఎం, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, వీఎం వేర్, బ్లాక్ చైన్ కౌన్సిల్ తదితర సంస్థలు మూడు, ఆరు నెలల వ్యవధిలో స్వల్పకాలిక సర్టిఫికేషన్ కోర్సులు అందిస్తున్నాయి. విద్యార్థులు ఈ కోర్సులు చేసేందుకు వేసవి సెలవులను వినియోగించుకుంటే.. డిగ్రీలు చేతికొచ్చే సమయానికి జాబ్ మార్కెట్లో ఇతరులతో పోల్చితే ముందంజలో నిలవొచ్చు.
ఈఆర్‌పీ సొల్యూషన్స్ :
ప్రస్తుతం సంస్థల్లో సాధారణ పరిపాలన నుంచి ఉత్పాదక సాంకేతికత వరకు ఎంటర్‌ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ (ఈఆర్‌పీ) ద్వారా కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈఆర్‌పీ సొల్యూషన్స్ కోణంలో శాప్, అకౌంటింగ్ ప్యాకేజెస్, ట్యాక్సేషన్ వంటి సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణ తీసుకోవడం లాభిస్తుంది.
విదేశీ భాషా నైపుణ్యాలు :
ప్రస్తుతం జాబ్ మార్కెట్లో అభ్యర్థులను ముందంజలో నిలుపుతున్న మరో అంశం.. విదేశీ భాషా నైపుణ్యం. పలు సంస్థలు తమ నియామక ప్రక్రియలో ఇంగ్లిష్‌తోపాటు మరో విదేశీ భాషలో నైపుణ్యం కలిగిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా జర్మన్, ఫ్రెంచ్, జపనీస్ భాషలకు ప్రాధాన్యం పెరిగింది. వివిధ దేశాల ఎంబసీల ఆధ్వర్యంలోని ఇన్‌స్టిట్యూట్‌లు, పలు ప్రైవేటు ఇన్‌స్టిట్యూట్స్‌లో ఆయా భాషల్లో తర్ఫీదునిస్తున్నాయి. దీన్ని పరిగణనలోకి తీసుకుని విద్యార్థులు విదేశీ భాషా శిక్షణకు వేసవి సెలవులను ఉపయోగించుకోవాలి.
సాఫ్ట్‌స్కిల్స్..
సాఫ్ట్‌స్కిల్స్.. కార్పొరేట్ రంగంలో ఈ మాటకున్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు! నేటి ఆటోమేషన్ యుగంలోనూ సాఫ్ట్‌స్కిల్స్ ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. ఈ నేపథ్యంలో డిగ్రీ, ఆపై స్థాయి కోర్సుల విద్యార్థులు వేసవి సెలవుల్లో కమ్యూనికేషన్, స్పీకింగ్, రీడింగ్ అండ్ రైటింగ్, పీపుల్, బిహేవియర్ స్కిల్స్‌లో శిక్షణ పొందాలి. సాఫ్ట్‌స్కిల్స్‌కు పెరుగుతున్న ప్రాధాన్యానికి అనుగుణంగా కెరీర్ కౌన్సెలింగ్ సంస్థలు, పర్సనాలిటీ డెవలప్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు ఏర్పాటయ్యాయి. సాఫ్ట్‌స్కిల్స్‌లో శిక్షణకు వీటిలో కొంత సమయం వెచ్చించడం లాభిస్తుంది.
వాస్తవ పరిస్థితులపై పరిజ్ఞానం :
కోర్సు ఏదైనా.. కెరీర్ పరంగా వాస్తవ పరిస్థితులపై పరిజ్ఞానం కీలకంగా మారింది. ఈ క్రమంలో విద్యార్థులు వాస్తవ పరిస్థితులపై నైపుణ్యాలు అందించే ఇంటర్న్‌షిప్స్, అప్రెంటీస్ ట్రైనింగ్, ప్రాజెక్ట్ వర్క్స్‌లో పాల్గొనాలి. ముఖ్యంగా టెక్నికల్, మేనేజ్‌మెంట్ డిగ్రీల చివరి సంవత్సరంలోకి అడుగుపెడుతున్న విద్యార్థులు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ‘అకడమిక్ సంవత్సరం ప్రారంభమయ్యాక చూద్దాంలే..’ అనే భావన ఏ మాత్రం మంచిది కాదు. కాబట్టి ఇప్పటి నుంచే ఆ దిశగా దృష్టిసారిస్తే చివరి సంవత్సరంలో ఎదురయ్యే అకడమిక్ ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందొచ్చు.
ముందస్తు సన్నద్ధత..
ప్రస్తుతం విద్యార్థులంతా ఉన్నతవిద్య అవకాశాలకు సంబంధించి స్పష్టతతో ఉంటున్నారు. ఈ క్రమంలో గేట్, క్యాట్, జీఆర్‌ఈ, జీమ్యాట్, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ తదితర పరీక్షల్లో బెస్ట్ స్కోర్లను సొంతం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ దిశగా విద్యార్థులు ఇప్పటి నుంచే సన్నద్ధత ప్రారంభించాలి. ఈ విరామ సమయంలో ఇన్‌స్టిట్యూట్‌లు అందించే షార్ట్‌టర్మ్, క్రాష్ కోర్సుల్లో శిక్షణ తీసుకోవడంద్వారా భవిష్యత్‌లో వివిధ పరీక్షల్లో మెరుగైన ప్రదర్శన కనబరచొచ్చు.
కెరీర్ ప్లానింగ్..
విద్యార్థులు ప్రత్యేకంగా దృష్టిసారించాల్సిన మరో అంశం.. కెరీర్ ప్లానింగ్. ముఖ్యంగా పదోతరగతి, ఇంటర్ విద్యార్థులు భవిష్యత్తులో ఏం చదవాలనుకుంటున్నారు? వాటి ద్వారా లభించే అవకాశాలు ఏమిటి? తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. దీనికోసం వ్యక్తిగత ఆసక్తి, అభిరుచులను బేరీజు వేసుకుంటూ కోర్సుల గురించి తెలుసుకోవాలి. ఇందులో భాగంగా కెరీర్ కౌన్సెలర్లను సంప్రదించడం లాభిస్తుంది.
సెలవులు.. సంపాదనకు మార్గాలు
వేసవి సెలవుల్లో నైపుణ్యాలను పెంపొందించుకోవడానికే కాదు. సంపాదనకూ అవకాశముంది. ఈ క్రమంలో పార్ట్‌టైమ్, ఫ్రీలాన్స్ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. రెండు, మూడు నెలల వ్యవధిలో వీటిని చేయడం ద్వారా కొంత మొత్తం ఆర్జించొచ్చు. ఈ మొత్తాన్ని పై చదువులకు ఉపయోగించుకోవచ్చు.
డేటా ఎంట్రీ :
ప్రస్తుతం టైపింగ్ స్కిల్స్‌తోపాటు సొంతంగా కంప్యూటర్ ఉంటే నెలకు కనీసం రూ.10 వేలు సంపాదించే అవకాశం ఉంది. ఇటీవల కాలంలో పలు ఔట్‌సోర్సింగ్ సంస్థలు.. శాశ్వత సిబ్బంది కంటే పార్ట్‌టైమ్ లేదా ఆన్‌లైన్ విధానంలో సిబ్బందిని నియమించుకుంటున్నాయి. ఈ ధోరణి బీపీఓ, కేపీఓ, ఎల్‌పీఓల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఈ క్రమంలో యువత వేసవి సెలవులను ఉపయోగించుకోవచ్చు. ఈ ఉద్యోగ అవకాశాల గురించి జాబ్‌సెర్చ్ పోర్టల్స్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫ్రీలాన్సర్, ట్రూలాన్సర్ వంటి సంస్థలు ప్రత్యేకంగా ఆన్‌లైన్ టైపింగ్, డేటా ఎంట్రీ అవకాశాల గురించి తెలియజేస్తున్నాయి.
కాపీ రైటింగ్ :
ప్రస్తుతం సంస్థలు తమ ప్రొడక్ట్ లేదా సర్వీసుకు సంబంధించిన వివరాలు, ప్రత్యేకతలను ఆకర్షణీయంగా వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలో కాపీ రైటర్స్‌కు టైమ్, పీస్ రేట్ ప్రాతిపదికన వేతనాలు చెల్లిస్తున్నాయి. ఈ సంస్థలు ఫుల్‌టైమ్ కంటే పార్ట్ టైమ్ నియామకాలకే మొగ్గుచూపుతున్నాయి. ఇంగ్లిష్ భాషా నైపుణ్యాలు ఉన్న అభ్యర్థులకు ఇది ఓ మంచి అవకాశం.
విష్ మాస్టర్స్ :
ప్రస్తుతం వస్తువుల కొనుగోలు ఎక్కువగా ఆన్‌లైన్లోనే జరుగుతోంది. దీంతో ఈ-కామర్స్ సంస్థలు నిర్దేశిత సమయానికి వినియోగదారులకు ప్రొడక్ట్‌ను అందించేందుకు విష్ మాస్టర్స్ పేరుతో డెలివరీ బాయ్స్‌ను నియమించుకుంటున్నాయి. సంస్థలు ఈ విషయంలో శాశ్వత సిబ్బంది కంటే పార్ట్‌టైమ్ నియామకాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సొంత వాహనం ఉన్నవారు డెలివరీ డ్రైవర్స్, విష్ మాస్టర్స్‌గా పార్ట్‌టైమ్ ఉద్యోగాలు పొందొచ్చు. ఈ ఉద్యోగాల ద్వారా నెలకు కనీసం రూ.10 వేలు సంపాదించే అవకాశం ఉంది. యువతకు ఇక్కడ కలిసొచ్చే మరో ప్రధాన అంశం.. విధుల పరంగా వారు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారో ఆ ప్రాంతం పరిధిలోనే ఆఫర్లు ఇచ్చేలా సంస్థలు వ్యవహరిస్తుండటమే.
వెబ్ డిజైనింగ్ :
వెబ్ డిజైనింగ్, వెబ్‌సైట్ నిర్వాహక నైపుణ్యాలు ఉన్నవారికి చక్కటి సంపాదన మార్గం అందుబాటులో ఉంది. ప్రస్తుతం చిన్నచిన్న సంస్థలు సైతం తమ వివరాలు ఇంటర్నెట్‌లో కనిపించాలని కోరుకుంటున్నాయి. దీనికోసం తక్కువ ఖర్చుతో వెబ్‌సైట్లను రూపొందించుకోవాలని చూస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా అవకాశాలను అందుకొని వెబ్‌సైట్‌ను రూపొందిస్తే.. కనిష్టంగా రూ.25 వేలు గరిష్టంగా రూ.లక్ష వరకు సంపాదించొచ్చు.
‘హోమ్’ ట్యూటర్ :
సబ్జెక్ట్ నాలెడ్జ్, ఎక్స్‌ప్రెషన్ స్కిల్స్ ఉంటే.. నెలకు రూ.20 వేల వరకు సంపాదించే అవకాశం కల్పిస్తున్నాయి హోమ్ ట్యూషన్ జాబ్స్! ఇటీవల కాలంలో చాలా కుటుంబాలు తమ పిల్లల భద్రత దృష్ట్యా హోమ్ ట్యూటర్ల కోసం అన్వేషిస్తున్నాయి. దీంతో ముఖ్యంగా మ్యాథమెటిక్స్, సైన్స్ సబ్జెక్ట్‌లకు సంబంధించి హోం ట్యూటర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో హోమ్‌ట్యూటర్‌గా మారితే ఒక్కో విద్యార్థి నుంచి నెలకు రూ.5 వేల వరకు పొందొచ్చు. అదేవిధంగా ఆన్‌లైన్ ట్యూటర్స్‌గా చేరితే నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు సంపాదించొచ్చు. ప్రస్తుతం పలు ఎడ్‌టెక్ సంస్థలు ఆన్‌లైన్ ట్యూటర్ల కోసం అన్వేషిస్తున్నాయి. ఆయా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే వేసవి సెలవుల్లో రూ.25 వేల నుంచి రూ.30 వేలు సంపాదించొచ్చు.
అందుకునే మార్గమేంటి ?
వేసవి సెలవుల్లో స్కిల్ ట్రైనింగ్, షార్ట్‌టర్మ్ జాబ్‌లను అందుకునే మార్గాలపై చాలామందికి సందేహాలు తలెత్తడం సహజమే. అయితే ప్రస్తుత ఆన్‌లైన్ యుగంలో వీటిని నివృత్తి చేసుకోవడం కష్టంమేమీ కాదు. స్కిల్ ట్రైనింగ్‌కు సంబంధించి ఐబీఎం, ఇంటెల్, వీఎం వేర్, బ్లాక్ చైన్ కౌన్సిల్ తదితర వెబ్‌సైట్ల ద్వారా ప్రస్తుతం అందుబాటులో ఉన్న శిక్షణ కార్యక్రమాల గురించి తెలుసుకోవచ్చు. జాబ్ సెర్చ్ పోర్టల్స్, మ్యాన్ పవర్ కన్సల్టెన్సీలు, సంస్థల వెబ్‌సైట్ల ఆధారంగా స్వల్పకాలిక ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు.
‘రిలాక్స్’ కొంత వరకే...
‘ఇప్పటి వరకు పరీక్షల ఒత్తిడితో ఉన్నాం.. ఇక రిలాక్స్ అవుదాం’ అనే దృక్పథాన్ని విద్యార్థులు కొంతమేరకే పరిమితం చేయాలి. ఎందుకంటే ప్రస్తుతం సగటున ప్రతి మూడు నెలలకు ఒక కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్నట్లు అంతర్జాతీయ సర్వేలు స్పష్టంచేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని విద్యార్థులు ఎప్పటికప్పుడు ఆధునిక నైపుణ్యాలను సొంతంచేసుకోవడంపై దృష్టిపెట్టాలి. ఈ దిశగా వేసవి సెలవులను ఉపయోగించుకోవాలి.
- వి.మోనిష్, స్టూడెంట్ కోఆర్డినేటర్, ఇన్ఫోసిస్ టీక్యూ.
Published date : 09 Apr 2019 05:57PM