ఉద్యోగాలకు సోపానాలు.. ఆ నాలుగు రంగాలు
Sakshi Education
ఓ వైపు జాబ్ మార్కెట్‌లో అనిశ్చితి.. టెక్ కంపెనీల్లో ఆచితూచి రిక్రూట్‌మెంట్స్.. క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ సైతం అంతంతమాత్రమే! అందుకే ఉద్యోగార్థుల్లో భవిష్యత్ గురించి బెంగ. ఇలాంటి పరిస్థితిలో కారుచీకట్లో కాంతి రేఖలా ఇటీవల ఓ సర్వే తీపు కబురు అందించింది.
ట్రెడిషనల్ నుంచి టెక్నికల్ గ్రాడ్యుయేట్స్ వరకు.. అన్ని విభాగాల అభ్యర్థులకు ఉద్యోగాలు లభించే అవకాశముందని అంచనావేసింది. రానున్న ఆరు నెలల కాలంలో నాలుగు రంగాల్లో నియామకాలు
భారీగా ఉంటాయని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ ఇటీవల వెల్లడించింది. మరి..ఆ రంగాలు ఏంటి.. ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి? ఏ నైపుణ్యాలు ఉంటే కొలువు సొంతం చేసుకోవచ్చో చూద్దాం..
ఆ రంగాలు ఇవే..
రానున్న ఆరు నెలల కాలంలో 4 రంగాల్లో భారీగా ఉద్యోగాలు భర్తీ అవుతాయని ఇటీవల ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎఫ్) అంచనా వేసింది.
1. బీఎఫ్‌ఎస్‌ఐ
2. రిటైల్ సెక్టార్
3. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్
4. ఈ-కామర్స్
ప్రస్తుతం ఈ నాలుగు విభాగాలు విస్తరణ బాటలో పయనిస్తున్నాయని.. అందుకే కొత్త నియామకాల దిశగా అడుగులు వేస్తున్నాయని ఐఎస్‌ఎఫ్ నివేదిక వెల్లడించింది. ఈ సంస్థ మొత్తం 15 రంగాల్లో నియామక సరళిని విశ్లేషించింది. రానున్న ఆరు నెలల కాలంలో (ఈ ఏడాది చివరికి) నియామకాల్లో ఈ నాలుగు రంగాలు టాప్‌లో నిలవనున్నాయని స్పష్టం చేసింది. మొత్తం నియామకాల్లో బీఎఫ్‌ఎస్‌ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్) రంగంలో 12 శాతం; ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (నిర్మాణ రంగం, ఎనర్జీ విభాగం కలిపి) 11 శాతం; రిటైల్, ఈ-కామర్స్ 5 శాతంతో ముందంజలో నిలవనున్నాయి. ఐఎస్‌ఎఫ్ అంచనా ప్రకారం వచ్చే మూడేళ్లలోనూ.. నియామకాల పరంగా ఈ నాలుగు రంగాల హవా కొనసాగనుంది. 2021 చివరికి.. రిటైల్ సెక్టార్‌లో ఈ-కామర్స్‌తో కలిపి 12,62,120 ఉద్యోగాలు; రియల్ ఎస్టేట్, నిర్మాణం రంగం 1,37,280 జాబ్స్; బీఎఫ్‌ఎస్‌ఐ 52,500 కొలువులు, ఆటోమొబైల్ రంగంలో 43,060 ఉద్యోగాలు లభించనున్నట్లు అంచనావేసింది.
అందుకే కొత్త కొలువులు..
రానున్న కాలంలో బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్ సెక్టార్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఈ-కామర్స్ రంగాల్లో నియామకాలు నవ నవోన్మేషంగా సాగుతాయని నాస్‌కామ్, ఫిక్కీ, ఎర్నెస్ట్ అండ్ యంగ్ సంస్థలు సంయుక్తంగా విడుదల చేసిన నివేదిక సైతం అంచనావేసింది. ప్రపంచీకరణ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్‌స, ఆటోమేషన్‌తోపాటు డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, అమృత్ సిటీస్ వంటి పథకాల ఫలితంగా ఆ నాలుగు రంగాల్లో కొత్తగా ఉద్యోగాలు లభించనున్నట్లు పేర్కొంది. రిటైల్ రంగంలో రిటైల్ డేటా అనలిస్ట్, డిజిటల్ ఇమేజింగ్ లీడర్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, కస్టమర్ ఎక్స్‌పీరియన్‌స లీడర్ వంటి కొత్త కొలువులు వచ్చే అవకాశముందని తెలిపింది. మరోవైపు టీమ్‌లీజ్ సంస్థ కూడా ఈ నాలుగు రంగాల్లో నియామకాలు ఆశాజనకంగా ఉంటాయని పేర్కొంది. అయితే ఎంట్రీ లెవల్, జూనియర్ లెవల్‌లో కొంత తగ్గుదల నమోదవుతుందని.. సీనియర్ లెవల్‌లో మాత్రం హైరింగ్‌స పెరుగుతాయని పేర్కొనడం గమనార్హం. 2017-18 ప్రథమార్ధంతో పోల్చితే, ద్వితీయార్ధంలో సగటున మూడు శాతం మేర పెరుగుదల నమోదైందని స్పష్టం చేసింది.
టెక్ టు ట్రెడిషనల్.. ఎవరైనా అర్హులే !
ప్రస్తుత పరిస్థితుల్లో టెక్ గ్రాడ్యుయేట్లే కాకుండా.. అన్ని విభాగాల కోర్సుల వారికి ఈ ఏడాది చివరి నాటికి అవకాశాలు మెరుగవనున్నాయని ఇండియా స్కిల్ రిపోర్ట్ పేర్కొంది. దీని ప్రకారం.. ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, బీఏ, బీకాం, బీఎస్సీ, బీఫార్మసీ తదితర కోర్సుల ఉత్తీర్ణులకు ఈ ఏడాది ఐదు నుంచి పది శాతం మేర అవకాశాలు పెరగనున్నట్లు తెలిపింది. బ్లూ కాలర్ హోదాల్లోనూ భారీ సంఖ్యలో ఉద్యోగాలు అందివచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఇన్‌ఫ్రా, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాల్లో బ్లూ కాలర్ ఉద్యోగాల సంఖ్య రెండు మిలియన్లు వరకు ఉంటుందని అంచనా.
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌కు ప్రాధాన్యం :
బీఎఫ్‌ఎస్‌ఐ, రిటైల్, ఈ-కామర్స్, ఇన్‌ఫ్రా రంగాలకు చెందిన సంస్థలు.. ఈ ఏడాది క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ ద్వారా నియామకాలకు ప్రాధాన్యమిచ్చే అవకాశముంది. ముఖ్యంగా టెక్నికల్ డొమైన్‌స, డేటా మేనేజ్‌మెంట్ వంటి జాబ్ ప్రొఫైల్స్‌కు సంబంధించి ప్రముఖ ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ కాలేజీల్లో క్యాంపస్ డ్రైవ్‌స నిర్వహించే వీలుంది. ఎంట్రీ లెవల్, ఫీల్డ్ లెవల్ ఉద్యోగాలకు మాత్రం జాబ్ పోర్టల్స్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించే పరిస్థితులున్నాయని నిపుణుల అభిప్రాయం.
జాబ్ ప్రొఫైల్స్.. భిన్నంగా..
బ్యాంకింగ్, రిటైల్, ఈ-కామర్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్.. ఈ నాలుగు రంగాల్లో కొత్తగా పుట్టుకొచ్చే కొలువుల జాబ్ ప్రొఫైల్స్ సైతం భిన్నంగా ఉండే అవకాశముంది. బ్యాంకింగ్, ఈ-కామర్స్ రంగాల్లో.. డేటా ఆర్కిటెక్ట్, డేటా మేనేజర్, డేటా అనలిటికల్ ఇంజనీర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ లభించనున్నాయి. క్రిప్టోగ్రాఫర్స్, బ్లాక్‌చైన్ సొల్యూషన్ ఆర్కిటెక్ట్ వంటి కొత్త ఉద్యోగాలకు బ్యాంకింగ్ రంగం వేదిక కానుంది. అదే విధంగా రిటైల్ రంగంలో ఉన్న రిటైల్ డేటా అనలిస్ట్, డిజిటల్ ఇమేజింగ్ లీడర్, ఐటీ ప్రాసెస్ మోడలర్, డిజిటల్ మార్కెటింగ్ స్పెషలిస్ట్, కస్టమర్ ఎక్స్‌పీరియన్‌స లీడర్ వంటి కొత్త కొత్త ఉద్యోగాలు పలకరించనున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు. వాస్తవానికి గతంలోని కస్టమర్ రిలేషన్, మార్కెటింగ్‌కు సంబంధించిన విధులే వీరూ నిర్వర్తించాల్సి ఉంటుంది. అయితే ఐఓటీ, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్‌స నేపథ్యంలో కంపెనీలు ఆయా ఉద్యోగాలకు ‘డిజిటల్’ హంగులు అద్దుతున్నాయి. ఈ-కామర్స్‌నే తీసుకుంటే ఈ రంగంలోని డెలివరీ బాయ్స్ ఉద్యోగాన్నే ఫ్లిప్‌కార్ట్ సంస్థ విష్ మాస్టర్‌గా పేర్కొంటోంది. అదే విధంగా బిగ్ బాస్కెట్, అమెజాన్ వంటి సంస్థలు డెలివరీ డ్రైవర్‌సగా పిలుస్తున్నాయి.
నియామకాల తీరు మారుతోంది...
ఆయా రంగాల్లో నియామకాల తీరులోనూ సాంకేతికత పెరగనుంది. వీడియో ఇంటర్వ్యూలు, స్కైప్ ఇంటర్వ్యూల ద్వారా నియామకాలు జరిపేలా సంస్థలు అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా మిడిల్ లెవల్ ఎగ్జిక్యూటివ్‌సను నియమించుకునే క్రమంలో ఈ విధానంవైపు మొగ్గు చూపుతున్నాయి. దీనివల్ల సమయం ఆదా కావడంతోపాటు అభ్యర్థుల నైపుణ్యాలను, సామర్థ్యాన్ని అంచనా వేయడం సులువుగా ఉంటుందనే అభిప్రాయం కంపెనీల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఐటీ ఆధారిత విభాగాల్లో నియామకాల పరంగా స్కైప్ ఇంటర్వ్యూలకు ప్రాధాన్యం పెరిగింది.
వేతనాల్లోనూ పెరుగుదల...
ఆయా రంగాల్లో జరిగే కొత్త నియామకాల్లో వేతనాల్లోనూ కొంత పెరుగుదల నమోదు కానుందని అంచనా. గ్లోబల్ హంట్‌సంస్థ అంచనా ప్రకారం అన్ని రంగాల్లోనూ ఈ ఏడాది సగటున 12 శాతం పెరుగుదల నమోదు కానుంది. అదే విధంగా టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా మేరకు 11 శాతం పెరుగుదల ఖాయంగా కనిపిస్తోంది. ఈ-కామర్స్, స్టార్టప్ సంస్థల్లో ఈ వేతన పెరుగుదల 15 శాతం మేరకు ఉంటుందని కెల్లీ సర్వీసెస్ నివేదిక స్పష్టం చేస్తోంది.
స్కిల్ మంత్ర :
కోర్ నైపుణ్యాలతోపాటు క్లయింట్స్, కస్టమర్లను మెప్పించేందుకు అవసరమైన ఇతర నైపుణ్యాలపైనా సంస్థలు దృష్టిపెడుతున్నాయి. సాఫ్ట్ స్కిల్స్, టీమ్ మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు, కమ్యూనికేషన్ స్కిల్స్, పబ్లిక్ రిలేషన్ స్కిల్స్, అడాప్టబిలిటీ, ఆటిట్యూడ్, స్పీకింగ్ స్కిల్స్ వంటి వాటిని ప్రత్యేకంగా పరిశీలిస్తున్నాయి. ముఖ్యంగా సంప్రదాయ డిగ్రీ అర్హతతో ఎంట్రీ లెవల్‌లో ఫ్రంట్ డెస్క్ ఆపరేషన్‌స విభాగంలో పనిచేసే వారి విషయంలో ఈ నైపుణ్యాలు తప్పనిసరిగా ఉండాలని కోరుకుంటున్నాయి. అందుకే ఇటీవల కాలంలో సంస్థలు ఎంట్రీ లెవల్ ఉద్యోగాలకు సైతం గ్రూప్ డిస్కషన్‌స, సైకోమెట్రిక్ టెస్ట్‌లు వంటి ప్రక్రియలు నిర్వహించి వారిలోని కమ్యూనికేషన్ స్కిల్స్‌ను పరీక్షిస్తున్నాయి. కంపెనీలు అన్ని కోర్సుల వారికి అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ.. కొత్త నైపుణ్యాలున్న వారికే ప్రాధాన్యం ఇస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్‌స (ఏఐ), రోబోటిక్స్, 3-డి ప్రింటింగ్, సైబర్ సెక్యూరిటీ, బిగ్ డేటా వంటి విభాగాల్లో నైపుణ్యాలు సొంతం చేసుకుంటే అవకాశాలు మెరుగవుతాయని నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా బీటెక్, ఎంబీఏ వంటి ప్రొఫెషనల్ డిగ్రీలతో దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఈ నైపుణ్యాలు పొందేందుకు కృషిచేయాలని సూచిస్తున్నారు.

Published date : 10 Jul 2018 12:12PM