ట్రిపుల్ ఐటీ.. చదువుల్లో మేటి !
Sakshi Education
ఉన్నత ప్రమాణాలతో సాంకేతిక విద్యను అందించడంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలకు(ఐఐఐటీలు) మంచి పేరుంది. బీటెక్, ఎంటెక్ తదితర కోర్సులను అందిస్తూ.. విద్యార్థుల్లో వినూత్న నైపుణ్యాలు, వ్యాపార దృక్పథం పెంపొందేలా తీర్చిదిద్దుతున్నాయి ట్రిపుల్‌ఐటీలు.
అందుకే ఐఐఐటీల్లో ప్రవేశం లభిస్తే.. మేటి కెరీర్‌కు మొదటి అడుగుపడినట్లే! ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐఐటీలు, సీట్లు, అందిస్తున్న కోర్సులు, ప్రవేశ విధానం, ఫీజులు, ప్లేస్‌మెంట్స్ గురించి తెలుసుకుందాం...
దేశవ్యాప్తంగా..
ట్రిపుల్ ఐటీలు.. సీట్ల వివరాలు
గ్వాలియర్ 248, కోట (రాజస్థాన్) 180, గువహటి 200, కళ్యాణి(పశ్చిమ బెంగాల్) 130, సోనెపట్(హరియాణా) 90, ఊనా(హిమాచల్ ప్రదేశ్) 160, శ్రీసిటీ(చిత్తూరు) 270, వడోదరా 200, అలహాబాద్ 300, కాంచీపురం 420, జబల్‌పూర్ 300, మణిపూర్ 100, తిరుచిరాపల్లి 60, లక్నో 75, ధార్వాడ్ 180, కర్నూలు 120, కొట్టాయం 90, రాంచీ 120, నాగ్‌పూర్ 210, పుణె 120, భాగల్‌పూర్ 150, భోపాల్ 180, సూరత్ 120.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో రెండు ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. వాటిలో బ్రాంచ్‌లు వారీగా అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు..
ఐఐఐటీ, శ్రీసిటీ (చిత్తూరు జిల్లా): కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్: 200 సీట్లు,
ఫీజుల వివరాలు..
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు జోసా కౌన్సెలింగ్ ఫీజు రూ.35,000. వీటితోపాటు ప్రీ రిజిస్ట్రేషన్, ఇన్‌స్టిట్యూట్, హాస్టల్, మెస్ తదితర ఫీజులన్నీ కలిపి సెమిస్టర్‌కు రూ.లక్ష పైగా అవుతుంది. ఎస్సీ, ఎస్టీలకు జోసా కౌన్సెలింగ్ ఫీజు రూ.15,000. దీంతోపాటు అన్ని ఫీజులు కలిపి సెమిస్టర్‌కు రూ.50వేలు (ట్యూషన్ ఫీజు రూ.53,250 మినహాయింపు పోగా) అవుతుంది.
ప్లేస్‌మెంట్స్ :
ఐఐఐటీల్లో ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తున్నాయి. ఎంపికైన విద్యార్థులకు మంచి ప్యాకేజీలు అందిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, సిస్కో, నేషనల్ ఇన్‌స్ట్రుమెంట్స్, విప్రో, డెలాయిట్, హెచ్‌సీఎల్, అమెజాన్, ఫేస్‌బుక్, ఫ్లిప్‌కార్ట్, అడోబ్, స్నాప్‌డీల్, ఇండస్ వ్యాలీపార్టనర్స్, క్వాల్కమ్, యాక్సెంచర్, వాల్‌మార్ట్ ల్యాబ్స్, బర్క్‌లీస్, ఐబీఎం, ఇన్ఫోఎడ్జ్, శాప్ తదితర కంపెనీలు ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తున్నాయి.
ప్రవేశం... ఇలా..
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ ర్యాంకు ఆధారంగా ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏటా రెండుసార్లు జేఈఈను నిర్వహిస్తుంది. ఇప్పటికే జనవరి సెషన్ ఫలితాలు వెల్లడయ్యాయి. స్కోర్ మరింత పెంచుకోవాలనుకునే విద్యార్థులు, తొలి సెషన్‌కు హాజరుకాలేకపోయినవారు ఏప్రిల్ సెషన్‌కు హాజరవ్వొచ్చు.
ఏప్రిల్ సెషన్ :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 7
ఫీజు చెల్లించేందుకు చివరితేదీ: మార్చి 8
పరీక్ష తేదీలు: ఏప్రిల్ 7-ఏప్రిల్ 20 మధ్య
ఫలితాలు వెల్లడి: ఏప్రిల్ 30
జేఈఈ మెయిన్ :
ఇది రెండు పేపర్లుగా ఉంటుంది. బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కోసం పేపర్ 1కు హాజరవ్వాల్సి ఉంటుంది. పేపర్ 2.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ఔత్సాహికులకు ఉద్దేశించింది.
పేపర్ 1
తర్వాత దశ :
జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులు ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఇతర సెంట్రల్ ఫండెడ్ ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్న ప్రోగ్రామ్‌లకు సంబంధించి ప్రాధాన్యతలను పేర్కొనాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అభ్యర్థులు రోల్ నంబరు, జేఈఈ మెయిన్ పాస్‌వర్డ్ సాయంతో సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్(సీఎస్‌ఏబీ) వెబ్‌సైట్‌లోకి లాగినై.. పార్టిసిపేషన్ ఫీజు చెల్లించాలి. అనంతరం ప్రోగ్రామ్, ఇన్‌స్టిట్యూట్ ప్రాధాన్యతలను పేర్కొనాలి. జేఈఈ మెయిన్ ర్యాంక్, అభ్యర్థి పేర్కొన్న ఛాయిస్‌లను పరిగణనలోకి తీసుకొని సీట్లు కేటాస్తారు. అదేవిధంగా ఐఐటీల్లో ప్రవేశం పొందాలనుకొనే అభ్యర్థులు జేఈఈ మెయిన్‌లో టాప్ పర్సంటైల్ సాధించి.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది.
దేశవ్యాప్తంగా..
- దేశంలోని మూలమూలకు నాణ్యమైన సాంకేతిక విద్యను విస్తరించాలనే లక్ష్యంతో ఐఐఐటీలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 23 ఐఐఐటీలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో గ్వాలియర్, జబల్‌పూర్, అలహాబాద్, కాంచీపురం, కర్నూలు ఐఐఐటీలు పూర్తిగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిధులతో ఏర్పాటు కాగా.. మిగిలిన 19 ఐఐఐటీలను పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ)పద్ధతిలో ఏర్పాటు చేశారు. ఆయా ఇన్‌స్టిట్యూట్‌ల ఏర్పాటుకు కేంద్రం 50 శాతం, సంబంధిత రాష్ట్రం 35 శాతం, ఇండస్ట్రీ భాగస్వామ్య పక్షాలు 15 శాతం నిధులు వెచ్చించాయి.
- మౌలిక సదుపాయాలు, సాంకేతికత, పరిశోధన, ఉత్తమ విధానాలను అవలంబించడంలో ఐఐఐటీలు ముందుంటున్నాయి. ఈ దిశగా ప్రపంచ టాప్ సాంకేతిక విశ్వవిద్యాలయాల్లో చోటు సంపాదించే లక్ష్యంతో ముందడుగేస్తున్నాయి. ఐఐఐటీలు ప్రధానంగా బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ(బీటెక్) కోర్సులను అందిస్తున్నాయి. వీటితోపాటు కొన్ని ఐఐఐటీలు ఎంటెక్ , బ్యాచిలర్ ఆఫ్ డిజైన్, మాస్టర్ ఆఫ్ డిజైన్, పీహెచ్‌డీ కోర్సులను సైతం ఆఫర్ చేస్తున్నాయి.
ట్రిపుల్ ఐటీలు.. సీట్ల వివరాలు
గ్వాలియర్ 248, కోట (రాజస్థాన్) 180, గువహటి 200, కళ్యాణి(పశ్చిమ బెంగాల్) 130, సోనెపట్(హరియాణా) 90, ఊనా(హిమాచల్ ప్రదేశ్) 160, శ్రీసిటీ(చిత్తూరు) 270, వడోదరా 200, అలహాబాద్ 300, కాంచీపురం 420, జబల్‌పూర్ 300, మణిపూర్ 100, తిరుచిరాపల్లి 60, లక్నో 75, ధార్వాడ్ 180, కర్నూలు 120, కొట్టాయం 90, రాంచీ 120, నాగ్‌పూర్ 210, పుణె 120, భాగల్‌పూర్ 150, భోపాల్ 180, సూరత్ 120.
తెలుగు రాష్ట్రాల్లో..
తెలుగు రాష్ట్రాల్లో రెండు ట్రిపుల్ ఐటీలు ఉన్నాయి. వాటిలో బ్రాంచ్‌లు వారీగా అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు..
ఐఐఐటీ, శ్రీసిటీ (చిత్తూరు జిల్లా): కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్: 200 సీట్లు,
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్: 70 సీట్లు.
ఐఐఐటీడీఎం, కర్నూలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్(డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ స్పెషలైజేషన్‌తో): 40 సీట్లు.
మెకానికల్ ఇంజనీరింగ్ (డిజైన్ అండ్ మాన్యుఫ్యాక్చరింగ్ స్పెషలైజేషన్‌తో): 40 సీట్లు.

కంప్యూటర్ ఇంజనీరింగ్: 40 సీట్లు.
ఇవి ప్రత్యేకం..!
ఇవి ప్రత్యేకం..!
- గ్వాలియర్ ఐఐఐటీలో మొత్తం 248 సీట్లు ఉండగా.. ఇందులో ఇంటిగ్రేటెడ్ బీటెక్(ఐటీ) అండ్ ఎంటెక్(ఐటీ) 110 సీట్లు, ఇంటిగ్రేటెడ్ బీటెక్(ఐటీ) అండ్ ఎంబీఏ 72 సీట్లు ఉన్నాయి. ఈ కోర్సుల కాలవ్యవధి ఐదేళ్లు.
- ఐఐఐటీ కాంచీపురంలో మొత్తం 420 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఐదేళ్ల వ్యవధి కలిగిన కోర్సుల వివరాలు.. బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్ట్ డిజైన్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ (మెకానికల్): 30 సీట్లు; బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ అండ్ అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్(మెకానికల్) 30 సీట్లు; బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అండ్ సిస్టమ్స్ డిజైన్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్(కంప్యూటర్ సైన్స్) 60 సీట్లు; బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ డిజైన్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) 30 సీట్లు; బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అండ్ వీఎల్‌ఎస్‌ఐ డిజైన్ స్పెషలైజేషన్‌తో ఎంటెక్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) 30 సీట్లు అందుబాటులో ఉన్నాయి.
ఫీజుల వివరాలు..
జనరల్, ఓబీసీ అభ్యర్థులకు జోసా కౌన్సెలింగ్ ఫీజు రూ.35,000. వీటితోపాటు ప్రీ రిజిస్ట్రేషన్, ఇన్‌స్టిట్యూట్, హాస్టల్, మెస్ తదితర ఫీజులన్నీ కలిపి సెమిస్టర్‌కు రూ.లక్ష పైగా అవుతుంది. ఎస్సీ, ఎస్టీలకు జోసా కౌన్సెలింగ్ ఫీజు రూ.15,000. దీంతోపాటు అన్ని ఫీజులు కలిపి సెమిస్టర్‌కు రూ.50వేలు (ట్యూషన్ ఫీజు రూ.53,250 మినహాయింపు పోగా) అవుతుంది.
ప్లేస్‌మెంట్స్ :
ఐఐఐటీల్లో ప్రముఖ కంపెనీలు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తున్నాయి. ఎంపికైన విద్యార్థులకు మంచి ప్యాకేజీలు అందిస్తున్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, సిస్కో, నేషనల్ ఇన్‌స్ట్రుమెంట్స్, విప్రో, డెలాయిట్, హెచ్‌సీఎల్, అమెజాన్, ఫేస్‌బుక్, ఫ్లిప్‌కార్ట్, అడోబ్, స్నాప్‌డీల్, ఇండస్ వ్యాలీపార్టనర్స్, క్వాల్కమ్, యాక్సెంచర్, వాల్‌మార్ట్ ల్యాబ్స్, బర్క్‌లీస్, ఐబీఎం, ఇన్ఫోఎడ్జ్, శాప్ తదితర కంపెనీలు ప్లేస్‌మెంట్స్ నిర్వహిస్తున్నాయి.
ప్రవేశం... ఇలా..
జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్ ర్యాంకు ఆధారంగా ఎన్‌ఐటీలు, ఐఐఐటీలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే ఇన్‌స్టిట్యూట్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ఏటా రెండుసార్లు జేఈఈను నిర్వహిస్తుంది. ఇప్పటికే జనవరి సెషన్ ఫలితాలు వెల్లడయ్యాయి. స్కోర్ మరింత పెంచుకోవాలనుకునే విద్యార్థులు, తొలి సెషన్‌కు హాజరుకాలేకపోయినవారు ఏప్రిల్ సెషన్‌కు హాజరవ్వొచ్చు.
ఏప్రిల్ సెషన్ :
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ: మార్చి 7
ఫీజు చెల్లించేందుకు చివరితేదీ: మార్చి 8
పరీక్ష తేదీలు: ఏప్రిల్ 7-ఏప్రిల్ 20 మధ్య
ఫలితాలు వెల్లడి: ఏప్రిల్ 30
జేఈఈ మెయిన్ :
ఇది రెండు పేపర్లుగా ఉంటుంది. బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాలు కోసం పేపర్ 1కు హాజరవ్వాల్సి ఉంటుంది. పేపర్ 2.. బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ ఔత్సాహికులకు ఉద్దేశించింది.
పేపర్ 1
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు |
మ్యాథ్స్ | 30 | 120 |
ఫిజిక్స్ | 30 | 120 |
కెమిస్ట్రీ | 30 | 120 |
మొత్తం | 90 | 360 |
- ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు ఉంటాయి. తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు.
తర్వాత దశ :
జేఈఈ మెయిన్ ఆలిండియా ర్యాంక్ ఆధారంగా అభ్యర్థులు ఎన్‌ఐటీ, ఐఐఐటీ, ఇతర సెంట్రల్ ఫండెడ్ ఇన్‌స్టిట్యూట్‌లు అందిస్తున్న ప్రోగ్రామ్‌లకు సంబంధించి ప్రాధాన్యతలను పేర్కొనాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా అభ్యర్థులు రోల్ నంబరు, జేఈఈ మెయిన్ పాస్‌వర్డ్ సాయంతో సెంట్రల్ సీట్ అలొకేషన్ బోర్డ్(సీఎస్‌ఏబీ) వెబ్‌సైట్‌లోకి లాగినై.. పార్టిసిపేషన్ ఫీజు చెల్లించాలి. అనంతరం ప్రోగ్రామ్, ఇన్‌స్టిట్యూట్ ప్రాధాన్యతలను పేర్కొనాలి. జేఈఈ మెయిన్ ర్యాంక్, అభ్యర్థి పేర్కొన్న ఛాయిస్‌లను పరిగణనలోకి తీసుకొని సీట్లు కేటాస్తారు. అదేవిధంగా ఐఐటీల్లో ప్రవేశం పొందాలనుకొనే అభ్యర్థులు జేఈఈ మెయిన్‌లో టాప్ పర్సంటైల్ సాధించి.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది.
Published date : 27 Feb 2019 05:24PM