టాప్ కార్పొరేట్ కంపెనీల్లో జాబ్ కొట్టే మార్గాలు...
Sakshi Education
సంప్రదాయ గ్రాడ్యుయేట్స్ నుంచి ఇంజనీరింగ్, ఎంబీఏ వంటిపొఫెషనల్ కోర్సుల విద్యార్థుల వరకూ.. ప్రతి ఒక్కరి లక్ష్యం... చదువు పూర్తికాగానే టాప్ కంపెనీలో మంచి ఉద్యోగం సొంతం చేసుకోవడం! అందుకోసం కోర్సు ప్రారంభం నుంచే ప్రయత్నాలు మొదలుపెడతారు.
మరోవైపు ఇటీవల కాలంలో ప్రముఖ కార్పొరేట్ కంపెనీల నియామక విధానాలు మారిపోతున్నాయి. ఫ్రెషర్స్ కంటే.. నైపుణ్యం, అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తున్నాయి! క్యాంపప్ ప్లేస్‌మెంట్స్ కంటే... ఆఫ్ క్యాంపస్ విధానాలపై ఆసక్తి చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో.. గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, హెచ్‌సీఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి కార్పొరేట్ దిగ్గజాలు నియామకాల పరంగా అనుసరిస్తున్న కొత్త విధానాలు.. ఆయా కంపెనీల్లో రిక్రూట్‌మెంట్ ప్రక్రియ.. కొలువు సొంతం చేసుకునేందుకు మార్గాల గురించి తెలుసుకుందాం..
అర్బన్.. రూరల్.. మెట్రో.. టైర్-1, టైర్-2, టైర్-3.. ఇలా ఏ ప్రాంతంలోని కాలేజీ విద్యార్థులైనా.. కోర్సులో చేరిన రోజు నుంచే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ గురించి ఆలోచిస్తుంటారు. వాస్తవానికి ప్రవేశాలప్పుడు కళాశాల ఎంపికలో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ కీలక ప్రామాణికంగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కానీ.. ఏఐ, ఆటోమేషన్, ఐఓటీ, రోబోటిక్స్ ప్రవేశంతో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ పరంగా కొంత ప్రతికూలత కనిపిస్తున్నట్లు ప్లేస్‌మెంట్స్ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. కంపెనీలు గత రెండేళ్లుగా సగటున 30శాతం మాత్రమే ఫ్రెషర్స్ నియామకాలు జరపడమే ఇందుకు నిదర్శనం అంటున్నారు. క్యాంపస్ ఆఫర్స్ తగ్గుముఖం పడుతుండటం.. ప్రముఖ సంస్థలు టైర్-1 ఇన్‌స్టిట్యూట్‌లకే పరిమితం అవడం విద్యార్థులకు నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఇలాంటి పరిస్థితిలో ఫ్రెషర్స్‌ముందున్న ఏకైక మార్గం.. కంపెనీల ఇతర నియామక మార్గాలను తెలుసుకొని సత్తాచాటడమేనని నిపుణులు సూచిస్తున్నారు.
జస్ట్ ఇన్ టైమ్ టాలెంట్ :
క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఫ్రెషర్స్‌కు ఆఫర్స్ తగ్గడానికి కంపెనీలు ‘జస్ట్-ఇన్-టైమ్ టాలెంట్’ విధానాన్ని అనుసరించడమే ముఖ్య కారణంగా చెబుతున్నారు. జస్ట్ ఇన్ టైమ్ అంటే.. తమకు అవసరమైనప్పుడు మాత్రమే.. అవసరమైన సంఖ్యలోనే.. తమ కంపెనీ అవసరాలకు సరితూగే నైపుణ్యాలున్న వారిని మాత్రమే నియమించుకోవడం!! ఉదాహరణకు.. ఒక ఐటీ సంస్థలో ఏఐ విభాగంలో ఖాళీలు ఏర్పడితే.. ఆ ఖాళీలను భర్తీ చేయడం ఏ మేరకు అవసరం.. ఇప్పుడు చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌కు ఎంత మంది కావాలో బేరీజు వేసుకొని.. సదరు ఏఐ నైపుణ్యాలున్న వారిని అప్పటికప్పుడు నియమించుకుంటున్నాయి. ఇలాంటి నియామకాల్లో పని అనుభవమున్న వారు కొంత ముందంజలో నిలుస్తున్నారు. ‘‘గతంలోలా భవిష్యత్తు అవసరాలు, రాబోయే ప్రాజెక్ట్‌లను దృష్టిలో పెట్టుకుని ముందుగానే అవసరానికి మించి సిబ్బందిని నియమించుకునే పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రస్తుతం కంపెనీలు ప్రాజెక్ట్ ఖరారయ్యాకే.. దాన్ని పూర్తిచేసేందుకు అవసరమైన మేరకే ఉద్యోగులను నియమించుకుంటున్నాయి’’ అని హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ హెచ్‌ఆర్ ప్రతినిధి పేర్కొన్నారు.
అట్రిషన్ రేటు తక్కువే..
ఇటీవల కాలంలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ సంఖ్య తగ్గడానికి సంస్థల్లో ఉద్యోగుల అట్రిషన్(వలసల) రేటు తక్కువగా ఉండటం కూడా మరో కారణంగా చెబుతున్నారు. కొద్దిరోజుల క్రితం వరకూ కొంత అనుభవం గడించాక మరింత మంచి ఆఫర్ రాగానే కంపెనీలు మారడం సర్వసాధారణంగా జరిగేది. కాని ఇప్పుడున్న జాబ్ మార్కెట్ అనిశ్చిత పరిస్థితుల్లో కంపెనీలు మారడంపై ఉద్యోగులు ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. కొత్త కంపెనీ ఆర్థిక స్థిరత్వంతోపాటు పని విధానాలు,అక్కడ ఇమడగలమా..! అని పరిపరి విధాల ఆలోచిస్తున్నారు. దాంతో కంపెనీల్లో వలసలు కాస్త నెమ్మదించాయి. అందుకనుగుణంగానే సంస్థలు సైతం ఫ్రెషర్స్ నియామకాలు తగ్గిస్తున్నాయి. సాఫ్ట్‌వేర్ దిగ్గజ సంస్థలుగా పేర్కొనే టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్ సంస్థల్లో గతేడాది(2017-18) క్యాంపస్ డ్రైవ్స్ ద్వారా ఆఫర్లు పొందిన వారి సంఖ్య 13,972. అంతకుముందు సంవత్సరంలో ఈ సంఖ్య 59,427. అంటే.. ఫ్రెషర్స్ హైరింగ్స్ దాదాపు మూడింతలు తగ్గాయి.
నయా ట్రెండ్.. వాకిన్స్
టాప్ కార్పొరేట్ సంస్థలు నియామకాల పరంగా వాక్-ఇన్స్ నిర్వహిస్తుండటం సరికొత్త ట్రెండ్‌గా చెప్పొచ్చు. రెండు నెలల క్రితం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్ సంస్థలు వాక్-ఇన్స్ విధానంలో దాదాపు ఐదు వేల మందిని నియమించుకున్నాయి. వీరిలో ఫ్రెషర్స్ 40నుంచి 50శాతం మాత్రమే. రిక్రూట్‌మెంట్స్ పరంగా ‘ది బెస్ట్’గా పేర్కొనే టీసీఎస్ కూడా తాజాగా తమ నియామక ప్రక్రియలో మార్పులు చేసింది. గతంలో టీసీఎస్ ప్రముఖ కాలేజీల్లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ నిర్వహించి ఫ్రెషర్స్‌కు ఆఫర్ లెటర్స్ ఇచ్చేది. తాజాగా ఆ విధానానికి స్వస్థి పలికి.. జాతీయ స్థాయిలో ట్యాలెంట్ టెస్ట్‌ను నిర్వహించి.. ఆ తర్వాతి దశలో ఇంటర్వ్యూ ద్వారా నైపుణ్యాలున్న వారిని ఎంపికచేసి.. ఉద్యోగాలు ఇచ్చే విధానానికి శ్రీకారం చుట్టింది.
ఆ రంగాలే ఆదరువు :
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్, ఫ్రెషర్స్ హైరింగ్ పరంగా ఐటీ కాకుండా.. ఇతర రంగాల్లో ఆశావహ పరిస్థితే కనిపిస్తోంది. తయారీ రంగంలో 2018-19 ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో.. గతేడాదితో పోల్చితే నియామకాల సంఖ్య 60 శాతం పెరిగింది. వీటిల్లో 40శాతం మేరకు ఫ్రెషర్స్ ఉండటం.. కోర్ బ్రాంచ్‌ల విద్యార్థులకు కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. అదే విధంగా రిటైల్ రంగంలో 41శాతం; హోమ్ అప్లయెన్సెస్ విభాగంలో 20శాతం; బీఎఫ్‌ఎస్‌ఐ రంగంలో 19 శాతం చొప్పున కొత్త నియామకాలు జరిగాయి. మరోవైపు ఉద్యోగాల పరంగా ఫ్రెషర్స్‌కు ఈ-కామర్స్, స్టార్టప్ సంస్థలే ఆదరువుగా నిలవనున్నాయి. ఈ ఏడాది ఈ-కామర్స్ సంస్థలు ఐఐటీ, ఐఐఎంలతోపాటు టైర్-1, టైర్-2 సిటీల్లోనూ నియామకాలు చేపడతామని పేర్కొన్నాయి. మరోవైపు స్టార్ట్‌అప్ సంస్థలు కూడా ఈ సంవత్సరం క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్‌లో పాల్గొనేందుకు అమితాసక్తి చూపుతున్నాయి. కాబట్టి విద్యార్థులు స్టార్ట్‌అప్స్‌లో చేరేందుకైనా సిద్ధంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ :
ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు అనుసరిస్తున్న మరో విధానం.. ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్. కాలేజీల క్యాంపస్‌లకు వెళ్లి రోజుల తరబడి ఎంపిక ప్రక్రియ చేపట్టే విధానానికి స్వస్తి పలికి.. నిర్దిష్టంగా ఒక ప్రాంతంలో ఏదైనా ఒక కాలేజీని వేదికగా చేసుకొని ఎంపిక ప్రక్రియ చేపట్టడమే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్. సదరు ప్రాంతంలోని ఇతర కళాశాలలకు చెందిన విద్యార్థులు కూడా ఈ ఆఫ్ క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో పాల్గొనే అవకాశం లభిస్తోంది. ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్‌లో ముందుగా రాత పరీక్ష నిర్వహించి.. అందులో షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు సంస్థ ప్రధాన కార్యాలయంలో టెక్నికల్, హెచ్‌ఆర్ రౌండ్, ఇంటర్వ్యూలకు పిలుస్తున్నారు.
సంస్థల వెబ్‌సైట్స్, జాబ్ పోర్టల్స్ :
పలు సంస్థలు నియామక ప్రక్రియ పరంగా చాలా స్పష్టంగా వ్యవహరిస్తున్నాయి. కేవలం తమ కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లోనే కెరీర్స్ లింక్‌లో తాజా ఖాళీల వివరాలు పేర్కొంటున్నాయి. దీనివల్ల నిజంగా తమ సంస్థలో పని చేయాలనే ఆసక్తి ఉన్న అభ్యర్థులను గుర్తించడం తేలికవుతుందని భావిస్తున్నాయి. ఇలాంటి అభ్యర్థులు ఎంపికయ్యాక పూర్తి అంకితభావంతో పనిచేస్తారని అంచనావేస్తున్నాయి. మరికొన్ని కంపెనీలు జాబ్ పోర్టల్స్, కన్సల్టెన్సీల ద్వారా కూడా నియామకాలు చేపడుతున్నాయి. వీటిలో పేర్లు నమోదు చేసుకున్న అభ్యర్థుల అర్హతలు, నైపుణ్యాలను పరిశీలించి తమకు సరితూగే వారిని నియామక ప్రక్రియకు పిలుస్తున్నాయి. కంపెనీల మారుతున్న నియామక విధానాల దృష్ట్యా అభ్యర్థులు తప్పనిసరిగా జాబ్ పోర్టల్స్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని.. ఎప్పటికప్పుడు తమ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసుకోవాలని హెచ్‌ఆర్ నిపుణులు సూచిస్తున్నారు.
కోరుకుంటున్న నైపుణ్యాలు...
టెక్నికల్ :
కంపెనీలు నియామకాల పరంగా ఇటీవల కాలంలో అనుసరిస్తున్న మరో కొత్త విధానం.. హ్యాకథాన్స్! ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను బృందాలుగా ఏర్పాటు చేసి హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ ప్రక్రియలో ఏదైనా ఒక టాస్క్‌ను ఇచ్చి దానికి పరిష్కారం కనుక్కోమని అడుగుతున్నారు. ఇందుకోసం నిర్దిష్ట సమయాన్ని నిర్దేశిస్తున్నారు. అభ్యర్థులు సదరు సమస్య పరిష్కార క్రమంలో అనుసరించిన విధానాలు, అన్వయించిన నైపుణ్యాలను పరిశీలించి ఆఫర్స్ ఖరారు చేస్తున్నాయి కంపెనీలు.
ప్రముఖ కంపెనీలు..నాలుగు దశల్లో
ప్రముఖ కంపెనీల ఆఫ్ క్యాంపస్ నియామక ప్రక్రియలో నాలుగు దశలు ఉంటున్నాయి. ప్రధానంగా యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి సంస్థలు తొలి దశలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. రెజ్యూమెను నిశితంగా పరిశీలించి.. అభ్యర్థుల నైపుణ్యాలు, అర్హతల ఆధారంగా తదుపరి దశలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ దశలో రాత పరీక్ష, ఆ తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికి సంస్థ ప్రధాన కార్యాలయంలో మరోసారి ఇంటర్వ్యూ ఉంటుంది. గూగుల్, యాపిల్ వంటి సంస్థలు క్యాంపస్ డ్రైవ్స్ చేపట్టే ముందే.. తమకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను స్కైప్ లేదా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి. అదే విధంగా ఆన్‌లైన్ విధానంలోనే ఏదైనా ఒక టాస్క్ ఇచ్చి.. నిర్దిష్ట సమయంలో సమస్య పరిష్కరించి సమాధానం ఇవ్వాలని కోరుతున్నాయి. ఇలా అడుగడుగునా అభ్యర్థుల్లోని నైపుణ్యాలను పరిశీలిస్తూ నియామకాలు ఖరారు చేస్తున్నాయి!!
వాక్-ఇన్స్, ఆఫ్-క్యాంపస్ డ్రైవ్స్‌లే..
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ తక్కువగా నమోదవుతున్న తరుణంలో విద్యార్థులు వాక్-ఇన్స్, ఆఫ్-క్యాంపస్ డ్రైవ్స్‌లో విజయానికి కృషి చేయాలి. దీనికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా ఐటీ విద్యార్థులు ఏఐ, రోబోటిక్స్ వంటి స్కిల్స్ సొంతం చేసుకోవడం చాలా అవసరం.
- జి.ఆర్.రెడ్డి, ఫౌండర్, హ్యూసిస్ కన్సల్టింగ్.

- ఏఐ స్కిల్స్
- రోబోటిక్స్
- ఐఓటీ స్కిల్స్
- 3-డి టెక్నాలజీస్
- మెషిన్ లెర్నింగ్ స్కిల్స్
- కమ్యూనికేషన్ స్కిల్స్
- పీపుల్ స్కిల్స్
- బిహేవియరల్ స్కిల్స్
- పాజిటివ్ ఆటిట్యూడ్
- ఎమోషనల్ ఇంటెలిజెన్స్
కంపెనీలు నియామకాల పరంగా ఇటీవల కాలంలో అనుసరిస్తున్న మరో కొత్త విధానం.. హ్యాకథాన్స్! ఇందులో భాగంగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను బృందాలుగా ఏర్పాటు చేసి హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నాయి. ఈ ప్రక్రియలో ఏదైనా ఒక టాస్క్‌ను ఇచ్చి దానికి పరిష్కారం కనుక్కోమని అడుగుతున్నారు. ఇందుకోసం నిర్దిష్ట సమయాన్ని నిర్దేశిస్తున్నారు. అభ్యర్థులు సదరు సమస్య పరిష్కార క్రమంలో అనుసరించిన విధానాలు, అన్వయించిన నైపుణ్యాలను పరిశీలించి ఆఫర్స్ ఖరారు చేస్తున్నాయి కంపెనీలు.
ప్రముఖ కంపెనీలు..నాలుగు దశల్లో
ప్రముఖ కంపెనీల ఆఫ్ క్యాంపస్ నియామక ప్రక్రియలో నాలుగు దశలు ఉంటున్నాయి. ప్రధానంగా యాపిల్, గూగుల్, ఫేస్‌బుక్, అమెజాన్ వంటి సంస్థలు తొలి దశలో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాయి. రెజ్యూమెను నిశితంగా పరిశీలించి.. అభ్యర్థుల నైపుణ్యాలు, అర్హతల ఆధారంగా తదుపరి దశలో పాల్గొనేందుకు అవకాశం కల్పిస్తున్నాయి. ఈ దశలో రాత పరీక్ష, ఆ తర్వాత టెక్నికల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నాయి. వీటిలో విజయం సాధించిన వారికి సంస్థ ప్రధాన కార్యాలయంలో మరోసారి ఇంటర్వ్యూ ఉంటుంది. గూగుల్, యాపిల్ వంటి సంస్థలు క్యాంపస్ డ్రైవ్స్ చేపట్టే ముందే.. తమకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను స్కైప్ లేదా టెలిఫోనిక్ ఇంటర్వ్యూ చేస్తున్నాయి. అదే విధంగా ఆన్‌లైన్ విధానంలోనే ఏదైనా ఒక టాస్క్ ఇచ్చి.. నిర్దిష్ట సమయంలో సమస్య పరిష్కరించి సమాధానం ఇవ్వాలని కోరుతున్నాయి. ఇలా అడుగడుగునా అభ్యర్థుల్లోని నైపుణ్యాలను పరిశీలిస్తూ నియామకాలు ఖరారు చేస్తున్నాయి!!
వాక్-ఇన్స్, ఆఫ్-క్యాంపస్ డ్రైవ్స్‌లే..
క్యాంపస్ రిక్రూట్‌మెంట్స్ తక్కువగా నమోదవుతున్న తరుణంలో విద్యార్థులు వాక్-ఇన్స్, ఆఫ్-క్యాంపస్ డ్రైవ్స్‌లో విజయానికి కృషి చేయాలి. దీనికి అనుగుణంగా కొత్త నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. ముఖ్యంగా ఐటీ విద్యార్థులు ఏఐ, రోబోటిక్స్ వంటి స్కిల్స్ సొంతం చేసుకోవడం చాలా అవసరం.
- జి.ఆర్.రెడ్డి, ఫౌండర్, హ్యూసిస్ కన్సల్టింగ్.
Published date : 31 Oct 2018 06:28PM