టాప్ 100లో భారత ఇన్‌స్టిట్యూట్స్.. ఇన్‌స్టిట్యూట్ వారీగా ర్యాంకింగ్ ఇలా..
Sakshi Education
క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌ను ఇటీవల ఆ సంస్థ ప్రకటించింది.
ప్రపంచ వ్యాప్తంగా 1,440 విద్యా సంస్థల్లో 51 సబ్జెక్టులను తీసుకుని సేకరించిన సమాచారం ఆధారంగా విశ్లేషణ చేస్తారు. క్యూఎస్ ర్యాంకింగ్స్.. పరిశోధన నాణ్యత, సాధించిన విజయాలు, అకడమిక్ ఖ్యాతి, గ్రాడ్యుయేట్‌లకు ఉద్యోగ అవకాశాల ప్రాతిపదికన ప్రకటిస్తారు. ఇందులో ఈ సంవత్సరానికి (2021)గాను సబ్జెక్టుల వారీగా పన్నెండు భారతీయ ఇన్‌స్టిట్యూట్స్ టాప్–100 జాబితాలో చోటు దక్కించుకున్నాయి. అత్యధిక సబ్జెక్టుల ర్యాంకింగ్‌లో ఐఐటీ–బాంబే ముందంజలో ఉంది. పెట్రోలియం ఇంజనీరింగ్‌లో.. ఐఐటీ మద్రాస్ ప్రపంచంలో 30వ స్థానంలో నిలిచింది..
ఇన్‌స్టిట్యూట్ వారీగా ర్యాంకింగ్..
ఇటీవల ప్రకటించిన క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో పన్నెండు భారతీయ విద్యా సంస్థలు ఆయా సబ్జెక్టులలో టాప్ 100లో నిలిచాయి. సబ్జెక్టుల వారీగా చూస్తే.. పెట్రోలియం ఇంజనీరింగ్‌లో ఐఐటీ మద్రాస్ 30వ ర్యాంకులో నిలిచింది, ఐఐటీ బాంబే 41వ స్థానంలోని ఉంది. మినరల్స్ అండ్ మైనింగ్ ఇంజనీరింగ్‌లో.. ఐఐటీ ఖరగ్‌పూర్‌కు 44వ ర్యాంకు లభించింది. ఈ విద్యా సంస్థ గత రెండేళ్లతో పోలిస్తే తన ర్యాంక్‌ను మెరుగుపరుచుకుంది. ఐఐఎస్సీ బెంగళూరు.. మెటీరియల్ సైన్స్‌లో 78వ ర్యాంకును, కెమిస్ట్రీలో 93వ ర్యాంకును పొందింది. ఐఐటీ ఢిల్లీ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 54వ ర్యాంకు, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టులకు 70వ ర్యాంక్, మెకానికల్ ఇంజనీరింగ్‌లో 79వ ర్యాంక్ సాధించింది. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్(ఐఐఎం) బెంగళూరు, ఐఐఎం అహ్మదాబాద్ 76, 80 స్థానాల్లో నిలిచాయి. డెవలప్‌మెంట్ స్టడీస్‌లో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ 50వ ర్యాంక్ సాధించింది.
ఇంకా చదవండి: part 2: అత్యధిక సబ్జెక్ట్‌ల వారీగా మాత్రమే కాకుండా.. పరిశోధనల్లోనూ టాప్..

Published date : 15 Mar 2021 02:39PM