స్వీయ మూల్యాంకనం చేసుకుంటేనే.. సమర్థవంతంగా నేర్చుకోవచ్చు..
Sakshi Education
ఆన్‌లైన్ లెర్నింగ్‌ను సమర్థవంతంగా ఉపయోగించుకునే క్రమంలో విద్యార్థులు రివిజన్, స్వీయ మూల్యాంకన పద్ధతులను అనుసరించాలి.
ఏదైనా ఒక టాపిక్ లేదా సెషన్ ముగిశాక.. దానికి సంబంధించి పునశ్చరణ చేసుకునేందుకు నిర్దిష్ట సమయం కేటాయించుకోవాలి. అలాగే ఆ టాపిక్‌లో తాము అప్పటివరకు పొందిన నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు స్వీయ మూల్యాంకనం ఉపయోగపడుతుంది. అంటే.. విద్యార్థులు తాము నేర్చుకున్న టాపిక్‌కు సంబంధించిన ప్రశ్నలకు స్వయంగా సమాధానాలు రాసుకొని.. వాటిని పుస్తకాల్లోని, నోట్స్‌లోని అంశాలతో సరిపోల్చుకోవాలి. దీనివల్ల విద్యార్థులు తమ లోపాలను సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. అంతేకాకుండా అప్పటివరకు నేర్చుకున్న అంశంపై మరింత లోతైన అవగాహన వస్తుంది.
గ్రూప్ చాట్స్..
ఆన్‌లైన్ లెర్నింగ్ ద్వారా పాఠాలు నేర్చుకుంటున్న విద్యార్థులు.. గ్రూప్ చాట్స్‌లో పాల్పంచుకోవడానికి ప్రాధాన్యం ఇవ్వాలి. అందుకోసం తమ సహచర విద్యార్థులతో ఆన్‌లైన్‌లో డిస్కషన్స్‌లో పాల్గొనాలి. ఇప్పుడు పలు ఆన్‌లైన్ పోర్టల్స్, ట్యూటర్స్.. గ్రూప్ చాట్స్‌కు అవకాశం కల్పిస్తున్నారు. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. విద్యార్థులు జూమ్, వాట్సాప్ వంటి మాధ్యమాల ద్వారా.. సొంతంగా ఒక గ్రూప్‌ను ఏర్పాటు చేసుకొని.. సదరు టాపిక్‌పై చర్చించాలి.
అసైన్‌మెంట్స్..
ఆన్‌లైన్ బోధన తర్వాత టీచర్లు లేదా ట్యూటర్లు ఇచ్చే అసైన్‌మెంట్స్‌ను ఎప్పటికప్పుడు పూర్తిచేయాలి. అసైన్‌మెంట్స్‌ను పూర్తిచేసే క్రమంలో ‘పర్యవేక్షించే వారు లేరు కదా’ అనే భావనతో పుస్తకాలు చూస్తూ రాయడం సరికాదు. ఆన్‌లైన్ అసైన్‌మెంట్స్‌ను కూడా వాస్తవ పరీక్షలుగానే భావించి.. పుస్తకాలు చూడకుండా రాయాలి. ఒకవేళ ఏవైనా పొరపాట్లు దొర్లి మార్కులు తక్కువగా వచ్చినా.. ఆందోళన చెందుకూడదు. కారణాలు విశ్లేషించుకొని.. వాటిని సరిదిద్దుకోవాలి. పర్యవేక్షించే వారు ఎవరూ లేరు కదా? అనే భావనతో పుస్తకాలు చూస్తూ అసైన్‌మెంట్స్ రాస్తే మార్కులు రావచ్చేమో కానీ.. సబ్జెక్ట్ నైపుణ్యం లభించదు.
టీచర్స్‌తో ఇంటరాక్షన్..
ఆన్‌లైన్ లెర్నింగ్‌ను ఫలవంతం చేసుకునే క్రమంలో విద్యార్థులు.. నిరంతరం టీచర్స్‌తో ఇంటరాక్ట్ అయ్యేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం లభిస్తుంది. అంతేకాకుండా టీచర్లు /ట్యూటర్లు కూడా విద్యార్థుల ఆసక్తిని గుర్తించి.. పాఠాలు చెప్పేందుకు ఆస్కారం ఉంటుంది. ప్రస్తుతం దాదాపు అన్ని ఆన్‌లైన్ లెర్నింగ్ మాధ్యమాల్లో ఈ విధానం అమలవుతోంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలి.
నిర్దిష్టంగా సమయం..
ఆన్‌లైన్ లెర్నింగ్ పరంగా విద్యార్థులు సమయ పాలన పాటించడం అలవాటు చేసుకోవాలి. లెర్నింగ్ సెషన్‌కు హాజరవడం, స్వీయ అభ్యసనం, పునశ్చరణ, గ్రూప్ డిస్కషన్స్.. ఇలా ప్రతి అంశానికి తగిన సమయం కేటాయించుకోవాలి. వాస్తవానికి లెర్నింగ్ సెషన్ అనేది నిర్దిష్టంగా అప్పటికే టీచర్లు లేదా ట్యూటర్లు పేర్కొన్న సమయంలోనే ఉంటుంది. టీచర్ల బోధన వినేందుకు ఆ సమయాన్ని నిర్దేశించుకొని.. మిగతా సమయాన్ని స్వీయ అభ్యసనం, పునశ్చరణ, గ్రూప్ డిస్కషన్స్‌కు కేటాయించాలి.
మాక్ టెస్ట్‌లు..
ఆన్‌లైన్ లెర్నింగ్ విధానంలో మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరవడం కూడా ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా ఒకవైపు అకడమిక్ సబ్జెక్ట్‌లు చదువుతూనే.. మరోవైపు పోటీ పరీక్షలకు ప్రిపరేషన్ సాగిస్తున్న అభ్యర్థులు..ఈ మాక్ టెస్ట్‌లు, మోడల్ టెస్ట్‌లకు హాజరయ్యేలా చూసుకోవాలి. ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే టెస్ట్‌లనూ విస్మరించకూడదు. ఇన్‌స్టిట్యూట్‌లు నిర్వహించే టెస్ట్‌ల ఫలితాల ద్వారా..విద్యార్థులు తమ ప్రతిభను, అవగాహన స్థాయిని తెలుసుకునే అవకాశం లభిస్తుంది.
సాంకేతిక పరికరాలు..
ఆన్‌లైన్ లెర్నింగ్ విషయంలో విద్యార్థులు సాంకేతిక పరికరాలను కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. కంప్యూటర్, హెడ్ ఫోన్స్, ఇంటర్నెట్ సదుపాయం వంటి వాటిని ముందుగానే ఏర్పాటుచేసుకోవాలి. నిర్దిష్టంగా ఒక క్లాస్ సెషన్‌లో వాటికి ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందుగానే వాటి పనితీరు సరి చూసుకోవాలి. ఇలా అడుగడుగునా.. నిర్దిష్ట వ్యూహంతో వ్యవహరిస్తే ఆన్‌లైన్ లెర్నింగ్ సమర్థంగా సాగుతుంది. ఫలితంగా క్లాస్ రూమ్ లెర్నింగ్ మాదిరిగానే నైపుణ్యాలు పొందే అవకాశం ఉంది.
ఆన్‌లైన్ లెర్నింగ్.. ముఖ్యాంశాలు
ఇంకా చదవండి : part 1: ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఈ లెర్నింగ్.. నేర్చుకోండిలా ఈజీగా!

- నిర్దిష్ట సామర్థ్యం కలిగిన ఐసీటీ టూల్స్ సమకూర్చుకోవడం.
- ఏకాగ్రతకు భంగం కలుగని స్టడీ ప్రదేశంలో ఏర్పాటు చేసుకోవడం.
- టీచర్స్, సహచరులతో డిస్కషన్స్‌లో పాల్గొనడం.
- సెల్ఫ్ అసెస్‌మెంట్, ఆన్‌లైన్ అసైన్‌మెంట్స్ విషయంలో ఆఫ్‌లైన్ మాదిరిగానే వ్యవహరించడం.
- లెర్నింగ్, రివిజన్,అసైన్‌మెంట్‌లకు రోజువారీ ప్రణాళిక విధానంలో సమయం కేటాయించుకోవడం.
- తమకు కష్టంగా భావించే సబ్జెక్ట్‌ల విషయంలో వీడియో ఇలస్ట్రేషన్స్, ఇన్ఫో-గ్రాఫిక్స్‌ను వీక్షించడం ద్వారా సులువుగా అవగాహన పొందే అవకాశం.
ఇంకా చదవండి : part 1: ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ ఈ లెర్నింగ్.. నేర్చుకోండిలా ఈజీగా!
Published date : 24 May 2021 07:48PM