స్టార్టప్...మీకు మీరే బాస్!
Sakshi Education
కార్తీక్... ప్రముఖ ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనలియర్ చదువుతున్నాడు. తోటి విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ఆఫర్స్ కోసం ప్రయత్నిస్తుంటే... తాను మాత్రం సొంతంగా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచనతో ఉన్నాడు. అతని దగ్గర మంచి ఆలోచన (ఐడియా) కూడా ఉంది!
వినోద్... బీకాం పూర్తిచేశాడు. వ్యాపార నేపథ్యమున్న కుటుంబం. తాను ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయడంలేదు. ఎందుకంటే.. కుటుంబ వ్యాపారాన్ని పరుగులు పెట్టించేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించే పనిలో అతను బిజీగా ఉన్నాడు.
ప్రశాంత్.. ఎంబీఏ విద్యార్థి. ఏదో ఒక కంపెనీలో పనిచేసేకంటే.. తానే సొంతంగా ఒక సంస్థను నెలకొల్పి తనతోపాటు మరో పదిమందికి ఉపాధి కల్పించాలని ఆలోచిస్తున్నాడు!
కార్తీక్, వినోద్, ప్రశాంత్‌లే కాదు... ఇటీవల కాలంలో మరెందరో యువత స్టార్టప్స్ దిశగా అడుగులు వేస్తున్నారు. గత మూడేళ్లుగా ప్రముఖ కాలేజీల్లో చదివిన విద్యార్థుల్లో పలువురు రూ.లక్షల ప్యాకేజీతో చేతికందిన ఆఫర్లను సైతం తిరస్కరించిన పరిస్థితి! ఎందుకో తెలుసా.. స్టార్టప్ ఆలోచనే!!
స్టార్టప్ సంస్థలు (అంకుర సంస్థలు), స్టార్టప్ ఎకోసిస్టమ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్... ఇటీవల కాలంలో తరచూ వినిపిస్తున్న మాటలే. అసలు స్టార్టప్ అంటే.. ఏదైనా ఒక సమస్య పరిష్కారం కోసం.. సరికొత్త ఆలోచనతో వినూత్న ప్రొడక్ట్ లేదా సర్వీస్‌ను మార్కెట్‌లోకి తెచ్చేందుకు ఏర్పాటైన కంపెనీ. స్టార్టప్ కోసం తొలుత కావాల్సింది.. అద్భుతమైన బిజినెస్ ఐడియా!
అకడమిక్ స్థాయి నుంచే..
స్టార్టప్ సంస్థల ఔత్సాహికులకు ప్రస్తుత పరిస్థితుల్లో కాలేజీలోనే తమ ఆలోచనలకు ఓ రూపం ఇచ్చే అవకాశం లభిస్తోంది. స్టార్టప్ ఆలోచనలను ప్రోత్సహించేలా పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంక్యుబేషన్ సెంటర్స్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సెల్స్ ఏర్పాటవుతున్నాయి. ఔత్సాహికులకు అక్కడ సంబంధిత రంగానికి చెందిన నిపుణుల మెంటారింగ్ సైతం లభిస్తోంది. మంచి ఐడియాలు ఉంటే ఆయా సంస్థల నుంచి ఆర్థిక ప్రోత్సాహం అందుకునే వీలుంది.
ప్రత్యేక కోర్సులు :
విద్యార్థుల్లో స్టార్టప్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దృక్పథం పెంచేలా ఇప్పుడు అకడమిక్‌గా వివిధ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. మేనేజ్‌మెంట్ పీజీ కోర్సుల్లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ను ఒక స్పెషలైజేషన్‌గా లేదా ఒక ఎలక్టివ్‌గా పలు బిజినెస్ స్కూళ్లు అందిస్తున్నాయి. వీటిద్వారా వ్యాపార ప్రారంభం, నిర్వహణకు సంబంధించి ప్రాథమిక సూత్రాలపై విద్యార్థులకు అవగాహన కలుగుతోంది.
స్టార్టప్-ఇండియా :
వ్యాపార, వాణిజ్య రంగంలో ముందంజలో నిలవాలనే లక్ష్యంతో యువత సొంతంగా సంస్థలు స్థాపించేలా ప్రోత్సహించేందుకు ప్రారంభించిన పథకమే.. స్టార్టప్ ఇండియా. దీనిద్వారా 2020 నాటికి రూ.పది వేల కోట్ల మేర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందజేయనుంది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలనుకుంటే.. నిర్దేశిత ఇన్‌స్టిట్యూట్‌లు, లేదా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ గుర్తించిన ఇతర ఇంక్యుబేషన్ సెంటర్ల ధ్రువీకరణతో దరఖాస్తు చేసుకోవచ్చు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ ప్రోగ్రామ్ పేరిట జాతీయస్థాయిలో ఆయా రంగాలకు సంబంధించిన ఇంక్యుబేటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించింది.
వివరాలకు వెబ్‌సైట్: https://www.startupindia.gov.in
సైన్స్ రంగంలో స్టార్టప్స్...
సైన్స్ పరిశోధనల ద్వారా కొత్త ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వివిధ పథకాలు అమలుచేస్తోంది. ఇందుకోసం కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో అన్ని రాష్ట్రాల్లోనూ పలు ఇన్‌స్టిట్యూట్‌లలో ఇంక్యుబేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఇంక్యుబేషన్ సెంటర్ అంటే.. వ్యాపార ఆలోచనలు ఉన్న విద్యార్థికి సదరు ఇంక్యుబేషన్ సెంటర్‌లోని నిపుణులు ఆ ఆలోచనకు కార్యరూపం ఇవ్వడంలో తోడ్పడే వేదికలే ఇంక్యుబేషన్ సెంటర్లు. తెలుగు రాష్ట్రాల్లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్, బిట్స్-పిలానీ హైదరాబాద్ క్యాంపస్, ట్రిపుల్ ఐటీ హైదరాబాద్, ఇక్రిశాట్ పటాన్‌చెరు, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్(నార్మ్)-హైదరాబాద్‌లలో ఈ టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేషన్ సెంటర్లు ఇప్పటికే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.
ముద్రా రుణ పథకం:
చిన్న, మధ్య తరహా స్టార్టప్ సంస్థలకు అందుబాటులో ఉన్న మరో సాధనం.. ముద్రా రుణ పథకం. దీని ద్వారా ఔత్సాహికులు తమ వ్యాపారాన్ని బట్టి రూ. 50 వేల నుంచి రూ. పది లక్షల వరకు రుణం పొందే అవకాశముంది.
స్టార్టప్ ఫెస్టివల్స్ :
నాస్కామ్.. 2023 నాటికి పదివేల స్టార్టప్ సంస్థలను ఏర్పాటు చేయించాలనే లక్ష్యంతో ప్రత్యేకంగా టెన్ థౌజెండ్ స్టార్టప్ ఇనీషియేటివ్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. స్టార్టప్ ఫెస్టివల్స్ నిర్వహిస్తోంది. ఔత్సాహిక యువతను తమ ఐడియాలతో రమ్మని ఆహ్వానిస్తోంది. అక్కడికే ఏంజెల్ ఇన్వెస్టర్స్, వెంచర్ క్యాపిటలిస్ట్‌లను కూడా పిలుస్తోంది. ఒకే వేదికపై ఔత్సాహికులను, ఇన్వెస్టర్లను పరిచయం చేస్తూ.. ఔత్సాహికుల ఐడియాలు నచ్చిన ఇన్వెస్టర్లు పెట్టుబడి పెట్టేలా చర్యలు తీసుకుంటోంది. నాస్కామ్ నివేదిక ప్రకారం 2017లో కొత్తగా 100 స్టూడెంట్ స్టార్టప్స్ ఏర్పడ్డాయి. 2016తో పోల్చితే ఈ సంఖ్య 30 శాతం ఎక్కువగా ఉండటం విశేషం.
అవగాహన పెరుగుతోంది...
స్టూడెంట్ స్టార్టప్స్ కోణంలో ఇటీవల కాలంలో యువతలో అవగాహన పెరుగుతున్న మాట వాస్తవం. దీనికి ప్రభుత్వ, ప్రైవేటు ప్రోత్సాహకాలతోపాటు.. టై, టీ-హబ్ వంటివి కూడా తోడ్పడుతున్నాయి. వీటి ఆధ్వర్యంలో నిరంతరం ఇన్వెస్టర్లు.. ఔత్సాహికులతో సంప్రదించే విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్టార్టప్స్ అంటే కేవలం టెక్నాలజీకే ప్రాధాన్యం అనే అపోహను వీడాలి. సమాజానికి ఉపయోగపడే అన్ని రంగాలకు సంబంధించిన స్టార్టప్స్‌కు కూడా ఇప్పుడు ప్రోత్సాహం లభిస్తోంది.
- పి.ఫణి, ఈడీ, టై-హైదరాబాద్.

Published date : 06 Aug 2018 05:14PM