Skip to main content

సోషల్ మీడియా `మేనేజర్` ఉద్యోగానికి కావాల్సిన అర్హతలు..

ఒకప్పుడు సోషల్ మీడియా కంటే సోషల్ పరిచయాలే ఎక్కువగా ఉండేవి. కానీ ఇప్పుడు ముఖ పరిచయాల కంటే ఫేస్‌బుక్ పరిచయాలే ఎక్కువగా ఉంటున్నాయి.
అందునా ప్రస్తుతం ఏదైనా బ్రాండ్‌కు ప్రాచుర్యం కల్పించడంలో సోషల్ మీడియా పాత్ర ఎనలేనిది. ట్విట్టర్, ఫేస్‌బుక్, యూట్యూబ్‌ల నిర్వహణ బాధ్యతలు చూసే ఉద్యోగాలు పదేళ్ల క్రితం వచ్చినా ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేస్తే చూస్తారు, ఎలాంటి పోస్టులకు లైక్‌లు వస్తాయి వంటి విషయాలపై అవగాహన ఉండి విద్యార్హత ఏదైనా కొద్దిగా టెక్నికల్ నాలెడ్జ్ ఉంటే చాలు ఎవ్వరైనా సోషల్ మీడియా మేనేజర్ ఉద్యోగానికి అర్హులే. రకరకాల బ్రాండ్‌లను సోషల్ మీడియాలో వైరల్ చేయడం వీరి బాధ్యత.

విధులు..
సంస్థకు, క్లయింట్లకు సోషల్ మీడియా ప్రతినిధిగా వ్యవహరిస్తూ వినియోగదారుల ఫిర్యాదులకు, కామెంట్లకు స్పందించడం, సక్రమ పద్ధతుల ద్వారా సంస్థ వెబ్‌సైట్‌లకు, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలకు ఎక్కువ మందిని ఆకర్షించడం, సోషల్ మీడియా మేనేజర్ల ప్రధాన బాధ్యతలు. సాధారణ డిగ్రీతో పాటు ఆకర్షణీయమైన ట్వీట్లు, పోస్టులు చేయడం, సోషల్ మీడియా ట్రెండ్స్‌ని ఎప్పటికప్పుడూ ఫాలో అవుతూ ఉండటం ఈ ఉద్యోగానికి కావాల్సిన ప్రధాన అర్హతలు.

కంటెంట్ క్రియేషన్ :
  • సోషల్ మీడియా పోస్టులు రాయడం
  • బ్లాగ్ పోస్టులు రాయడం
  • బ్యానర్లు డిజైన్ చేయడం
  • ఫోటోలు, వీడియోలు సెలెక్ట్ చేసి ఎడిట్ చేయడం
  • గెస్ట్ కంట్రిబ్యూటర్స్‌ని ఆహ్వానించడం

పర్యవేక్షణ..
  • కస్టమర్ సర్వీసెస్
  • పీఆర్ కమ్యూనికేషన్స్
  • ఎంక్వైరీలు
  • ట్రెండింగ్ టాపిక్స్
  • కాంపిటీటర్స్
  • కమ్యూనిటీ బిల్డింగ్

అనుసంధానం :
  • కంటెంట్ మార్కెటింగ్
  • డిమాండ్ జనరేషన్
  • పీఆర్
  • ఎగ్జిక్యూటివ్స్
  • హెచ్‌ఆర్
  • సేల్స్
  • సర్వీస్

లైవ్ ఈవెంట్స్ కవరింగ్ :
  • స్పీకర్స్‌ని ప్రమోట్ చేయడం
  • ఫోటోలు తీసుకోవడం
  • హ్యాష్‌ట్యాగ్‌లను ప్రమోట్ చేయడం
  • లైవ్ ట్వీట్లు పెట్టడం
  • వీక్షకుల సందేహాలు నివృత్తి చేయడం

నైపుణ్యాలు..
  • కమ్యూనిటీ మేనేజ్‌మెంట్
  • ఆర్గనైజింగ్ స్కిల్స్
  • క్రియేటివ్ మైండ్‌సెట్
  • అడాప్టివ్ నేచర్
  • కాపీ రైటింగ్ స్కిల్స్
  • పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్
  • బడ్జెటింగ్
  • మార్కెట్ అనలైజేషన్
  • ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్

వేతనాలు :
సంస్థ స్థాయి, పనితీరు, అనుభవాన్ని బట్ట్టి రూ.30 వేల నుంచి 3 లక్షల వరకు వేతనాలుంటాయి.
Published date : 22 Dec 2017 04:43PM

Photo Stories