ఫుల్‌స్టాక్ డెవలపర్ ఫుల్ డిమాండ్.. అసలేంటిది తెలుసుకోండిలా..
లక్షల ప్యాకేజీలతో ఆఫర్లు ఇస్తున్నాయి. ఐటీ రంగంలో కెరీర్ కోరుకునే వారికి ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్ చక్కటి మార్గంగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఫుల్‌స్టాక్ డెవలపర్ల విధులు, డిమాండ్‌కు కారణాలు, ఫుల్‌స్టాక్ డెవలపర్లుగా స్థిరపడేందుకు అవసరమైన అర్హతలు తదితర వివరాలతో ప్రత్యేక కథనం...
ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్..
ఒక అప్లికేషన్ లేదా వెబ్‌సైట్.. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ అభివృద్ధిని ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్ అంటారు. ఫుల్‌స్టాక్ డెవలపర్లు అప్లికేషన్‌కు సంబంధించిన ప్రోగ్రామింగ్, డిజైన్, డేటా బేసెస్, డీబగ్గింగ్ వంటి విధుల్లో కీలకంగా వ్యవహరిస్తారు. అలాగే యూజర్ ఎక్స్‌పీరియెన్స్, బిజినెస్ లాజిక్, అప్లికేషన్ లుక్, ఫంక్షనింగ్‌లల్లో నిష్ణాతులుగా ఉంటారు.
కీలక విధులు..
సాంకేతిక రంగంలో ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్ కీలక మైలురాయిగా నిలుస్తోంది. నైపుణ్యాల బృందంగా ఫుల్‌స్టాక్ డెవలపర్లను అభివర్ణిస్తున్నారు. వీరు ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్‌కు వారధిగా నిలుస్తూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. వీరు నిర్వహించే ముఖ్యమైన విధులు కొన్ని ఉన్నాయి. అవి..
- ప్రాజెక్టు పూర్తి చేయడానికి అవసరమైన వాటిని సమకూర్చుకోవడం
- డేటాబేసెస్, సర్వర్ల ఏర్పాటు సంబంధిత విషయాలు
- అప్లికేషన్ టెస్టింగ్ » వేర్వేరు వేదికల్లో(పరికరాలు) ప్రొడక్ట్‌ను పరీక్షించడం
- ఎడిటింగ్ అండ్ మాడిఫయింగ్ కోడ్స్ వంటివి.
డిమాండ్–కారణాలు..
విభిన్న అప్లికేషన్స్‌కు సంబంధించి అన్ని దశల్లో ఫుల్‌స్టాక్ డెవలపర్లు పనిచేయగలరు. ఒక దశకు మరొక దశకు మధ్య అనుసంధానకర్తలుగా వ్యవహరించగలరు. ఆయా డొమైన్లకు సంబంధించిన సాఫ్ట్‌వేర్ నాలెడ్జ్‌తోపాటు టీమ్‌లో ఏ పనినైనా వీరు చేయగలరు. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ ఇంజనీరింగ్‌పై అవగాహన, పనిచేయగలిగే సామర్థ్యాలు ఫుల్‌స్టాక్ డెవలపర్ల సొంతం. అందుకే ప్రస్తుతం ఫుల్‌స్టాక్ డెవలపర్లకు జాబ్ మార్కెట్‌లో మంచి డిమాండ్ నెలకొంది.
కంపెనీల మొగ్గు..
ఫుల్‌స్టాక్ డెవలపర్లను నియమించుకుంటే.. ఆయా టాస్కులకు ప్రత్యేక స్పెషలిస్టుల అవసరం ఉండదు. అందుకే కంపెనీ నిర్వహణా వ్యయాన్ని తగ్గించుకొనే క్రమంలో ఫుల్‌స్టాక్ డెవలపర్ల వైపు సంస్థలు మొగ్గు చూపుతున్నాయి. ఐటీ రంగంలో సాంకేతికత ఎప్పటికప్పుడు మారుతోంది. ఫుల్‌స్టాక్ డెవలపర్లు కొత్త టెక్నాలజీని వేగంగా నేర్చుకోవడంలో ముందుంటున్నారు. దాంతో ఫుల్‌స్టాక్ డెవలపర్లు కలిగిన కంపెనీలకు రిక్రూట్‌మెంట్, శిక్షణల పరంగా అదనంగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా కంపెనీల తొలి ఛాయిస్ ఫుల్‌స్టాక్ డెవలపర్లే అవుతున్నారు.
స్టార్టప్స్ ఎంపిక..
ప్రాజెక్టుకు సంబంధించిన సమస్యల పరిష్కారంతోపాటు, అప్లికేషన్ డెవలప్‌మెంట్‌కు అవసరమైన అన్ని నైపుణ్యాలను ఫుల్‌స్టాక్ డెవలపర్లు కలిగి ఉంటారు. దాంతో స్టార్టప్‌లు సైతం నియామకాల్లో ఫుల్‌స్టాక్ డెవలపర్లకు ప్రాధాన్యం ఇస్తున్నాయి. తద్వారా మొత్తం ఉద్యోగులపై చేసే వ్యయాన్ని తగ్గించుకుంటున్నాయి.
ఆ నైపుణ్యాలు..
అప్లికేషన్స్‌కు సంబంధించిన అన్ని స్థాయిల్లో పనిచేయగలిగే ఫుల్‌స్టాక్ డెవలపర్‌గా మారేందుకు బేసిక్ టూల్స్‌పై అవగాహనతోపాటు ఆపరేటింగ్ సిస్టమ్, వెబ్ బ్రౌజర్, టెక్స్‌ట్ ఎడిటర్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ టూల్స్, ప్యాకేజ్ మేనేజర్స్,డేటా బేసెస్‌పై పరిపూర్ణ అవగాహన ఉండాలి. ఇంజనీరింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఫుల్‌స్టాక్ డెవలప్‌మెంట్ సర్టిఫికేషన్స్, శిక్షణ ద్వారా ఈ విభాగంలో కెరీర్‌ను ప్రారంభించొచ్చు.
నేర్చుకోవాల్సిన టూల్స్..
- ఫ్రంట్ ఎండ్
- బూట్‌స్ట్రాప్
- యాంగులర్.జేఎస్
- ఫౌండేషన్
- పైథాన్
- జావా స్క్రిప్ట్
- ఎలిక్సిర్
- హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్‌ఎస్
- బ్యాకెండ్ టూల్స్
- డీజాంగో
- ఎంబర్.జేఎస్
- లొదాష్
- డీ3.జేఎస్.
డేటాబేస్ మేనేజ్‌మెంట్..
డెవలపర్లు వెబ్‌సైట్‌కు సంబంధించిన సమాచారాన్ని డేటాబేసెస్‌ల్లో నిక్షిప్తం చేసి.. అవసరమైనప్పుడు వినియోగించుకుంటారు. దాంతో ఫుల్‌స్టాక్ డెవలపర్లకు » డేటాబేసెస్ » ఒరాకిల్ » రెడిస్ » మ్యాంగోడీబీ » ఎస్‌క్యూఎల్ సర్వర్ వంటి నైపుణ్యాలు అవసరమవుతాయి.
ఆకర్షణీయ వేతనాలు..
ఇండీడ్.ఇండియా గణాంకాల ప్రకారం– ఫుల్‌స్టాక్ డెవలపర్ల వేతన శ్రేణి నెలకు రూ.45000–రూ.90,000గా ఉంది. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ డెవలపర్ల వేతనాలతో పోల్చితే ఇది చాలా ఎక్కువ. వేతనాల పరంగా చూస్తే ఫుల్‌స్టాక్ డెవలపర్ల తర్వాత బ్యాక్ ఎండ్, ఫ్రంట్ ఎండ్ డెవలపర్లకు ప్రాధాన్యం దక్కుతోంది. మొత్తంగా చూస్తే ఫుల్ స్టాక్ డెవలపర్లకు రూ.5.2–7.5 లక్షల మధ్య వార్షిక ప్యాకేజీలు లభిస్తున్నాయి.
టాప్ రిక్రూటర్స్..
- ఐబీఎం
- గూగుల్
- జేపీ మోర్గాన్ ఛేజ్
- ఒరాకిల్
- యాక్సెంచర్
- డెల్
- వీఎం వేర్
తదితర కంపెనీలు ఫుల్‌స్టాక్ డెవలపర్లను నియమించుకుంటున్నాయి.