Skip to main content

ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌ స్కిల్స్‌ నేర్చుకునేందుకు ఎన్నో మార్గాలు.. వివరాలు తెలుసుకోండిలా..

ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌లో కీలకమైన హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావా స్క్రిప్ట్‌లను నేర్చుకునేందుకు ఇప్పుడు ఎన్నో మార్గాలు అందుబాటులోకి వచ్చాయి.

నాస్‌కామ్‌ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్, ఎన్‌ఎస్‌డీసీ సెక్టార్‌ స్కిల్‌ కౌన్సిల్స్‌ ఆధ్వర్యంలో పలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ సర్టిఫికేషన్లను పొందే అవకాశం ఉంది. అదే విధంగా ప్రముఖ మూక్‌ ప్రొవైడర్స్‌ యుడెమీ, కోర్స్‌ఎరా, కోడ్‌ అకాడమీ వంటివి ఆరు నెలల నుంచి సంవత్సరం వ్యవధిలో పలు షార్ట్‌ టర్మ్‌ కోర్సులను అందిస్తున్నాయి. వీటిని పూర్తి చేసుకొని నిర్దిష్ట పరీక్షల్లోనూ ఉత్తీర్ణత సాధిస్తే సర్టిఫికెట్‌ కూడా సొంతమవుతుంది. ఆసక్తి ఉంటే యూట్యూబ్‌ వేదికల ద్వారా ఉచితంగానే నేర్చుకునేందుకు అవకాశం ఉంది. వివిధ మార్గాల్లో ఈ నైపుణ్యాలు పెంచుకోవడం ద్వారా జాబ్‌ మార్కెట్‌లో అవకాశాలు మెరుగుపరచుకోవచ్చు.

జాబ్‌ ప్రొఫైల్స్‌..
ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌లో పలు రకాల కొలువులు సొంతం చేసుకోవచ్చు. ఎంట్రీ లెవల్‌లో ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్‌గా, ఆ తర్వాత ఫ్రంట్‌ ఎండ్‌ ఇంజనీర్, ఫ్రంట్‌ ఎండ్‌ వెబ్‌ డిజైనర్, ఫ్రంట్‌ ఎండ్‌ యూఐ డెవలపర్‌/ఇంజనీర్, ఎస్‌ఈఓ ఎక్స్‌పర్ట్‌ (ఫ్రంట్‌ ఎండ్‌), ఫ్రంట్‌ ఎండ్‌ ఆర్కిటెక్ట్‌ వంటి జాబ్‌ ప్రొఫైల్స్‌ లభిస్తున్నాయి.

వేతనాలు..
• ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌ నైపుణ్యాలున్న అభ్యర్థులకు రూ.లక్షల్లో వార్షిక వేతనాలతో కొలువులు లభిస్తున్నాయి.
• పలు సర్వేల ప్రకారం–ఎంట్రీ లెవల్‌లోనే రూ.నాలుగు లక్షల నుంచి రూ.అయిదు లక్షల వేతనం అందుతోంది.

ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్స్‌.. ముఖ్యాంశాలు
• ఐటీ విభాగంలో టాప్‌–10 జాబ్స్‌ జాబితాలో నిలిచిన ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌.
• కోర్‌ టు సాఫ్ట్‌వేర్‌.. అన్ని సంస్థల్లోనూ ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్‌్ కు డిమాండ్‌.
• ప్రస్తుతం ఇతర రంగాలతో పోల్చితే ఐటీలోనే అధిక నియామకాలు.
• జవా స్క్రిప్ట్, హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌ నైపుణ్యాలతో కొలువులు ఖాయం.

గత కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి..
ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్స్‌కు డిమాండ్‌ అనేది గత కొన్నేళ్లుగా కనిపిస్తున్న పరిస్థితే. ఈ నైపుణ్యాలున్న వారి సంఖ్య ఆశించిన స్థాయిలో లేకపోవడమే దీనికి కారణం. హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్, జావా స్క్రిప్ట్‌ ఆధారంగానే ఎక్కువగా వెబ్‌ డెవలప్‌మెంట్‌ జరుగుతోంది. వీటిలో శిక్షణ పొందితే ఐటీ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి.
– ఎస్‌.రాజా, డైరెక్టర్, సింక్రో సర్వ్‌

ఇంకా చదవండి : part 1: ఈ స్కిల్స్‌ ఉంటే ఫ్రంట్‌ ఎండ్‌ డెవలపర్స్‌గా మంచి కెరీర్‌.. లక్షల్లో వేతనాలు..!

Published date : 23 Jun 2021 05:31PM

Photo Stories