ఫ్రెషర్స్‌కు మంచి కాలమే.. 2021లో ఐటీ దిగ్గజ సంస్థల్లోనే లక్షకు పైగా ఉద్యోగాలు..
Sakshi Education
మరికొద్ది నెలల్లో.. లక్షల మంది విద్యార్థులు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లతో బయటికి రానున్నారు.
మరి వీరందరికీ కొలువులు లభిస్తాయా.. జాబ్ మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది.. ఫ్రెషర్స్‌కు అవకాశాలు ఎలా ఉండనున్నాయి?! ఇప్పుడు చాలామందిలో ఇదే చర్చ కొనసాగుతోంది!! ఇటీవల కాలంలో జరిగిన నియామకాలు.. కంపెనీలు ఇప్పటికే ప్రకటించిన రిక్రూట్‌మెంట్ ప్రణాళికలను పరిగణనలోకి తీసుకుంటే.. 2021లో ఫ్రెషర్స్‌కు రిక్రూట్‌మెంట్స్ ఆశాజనకంగానే ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో.. 2021లో ఫ్రెషర్స్ నియామక తీరుతెన్నులు, కంపెనీలు కోరుకుంటున్న నైపుణ్యాలపై ప్రత్యేక కథనం..
ట్రెడిషనల్ కోర్సుల నుంచి టెక్నికల్ డిగ్రీ వరకూ.. డొమైన్ ఏదైనా విద్యార్థుల లక్ష్యం.. చక్కటి ఉద్యోగం, ఉజ్వల కెరీర్‌ను సొంతం చేసుకోవడం. ఇందుకోసం ఎప్పటికప్పుడు జాబ్ మార్కెట్ పరిస్థి తులపై ఆరా తీస్తుంటారనే విషయం తెలిసిందే. గతే డాది కరోనా కారణంగా నియామకాల్లో ప్రతికూల పరి స్థితులు ఎదురైన సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం పరిస్థితులు ఎలా ఉంటాయో? అనే ఆందోళన ఉద్యో గార్థుల్లో పెరుగుతోంది. అయితే 2021 సంవత్సరం ఫ్రెషర్స్‌కు ఆశాజనకంగానే ఉంటుందని పలు సర్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రముఖ కంపెనీలు స్వయంగా ప్రకటించిన నియామక ప్రణాళికలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
ఐటీ.. లక్ష ఉద్యోగాలు
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ),సాఫ్ట్‌వేర్.. అన్ని బ్రాం చ్‌ల ఇంజనీరింగ్ విద్యార్థులు కొలువు సాధించాలని కోరుకునే రంగం ఇది. ఈ రంగంలో ఈ సంవత్సరం నియామకాలు ఆశాజనకంగా కనిపిస్తున్నాయి. ప్రస్తు తం దేశంలో ఐటీ దిగ్గజ సంస్థలుగా పేరొందిన టీసీ ఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, క్యాప్ జెమినీ, కాగ్నిజెంట్ తదితర సంస్థలు.. 2021లో ఫ్రెషర్స్‌కు అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నాయి. దీనికి సంబంధించి ఆయా కంపెనీలు చేసిన ప్రకట నలే ఇందుకు నిదర్శనంగా చెప్పొచ్చు. టీసీఎస్ 40వేల మందిని, ఇన్ఫోసిస్ 24వేల మందిని, హెచ్‌సీఎల్ 12వేల మందిని, విప్రో 12వేల మందిని, క్యాప్ జెమినీ 15వేల మందిని, కాగ్నిజెంట్ 23వేల మందిని నియమించుకోనున్నట్లు ప్రకటించాయి.
ఇంకా చదవండి: part 2: ఈ ఏడాది మంచి రోజులే.. ఫ్రెషర్స్ రిక్రూట్‌మెంట్స్‌లో అగ్రస్థానం వీటిదే..

Published date : 15 Mar 2021 03:30PM