ప్రత్యామ్నాయాలు.. పలుకోర్సులు
Sakshi Education
గతంలో ఇంటర్లో నాలుగు గ్రూపులుంటాయని చెప్పేవారు. అన్ని గ్రూపులకూ డిగ్రీ స్థాయిలో చక్కని కోర్సులుండేవి. అన్నింటికీ మంచి కెరీర్ అవకాశాలుండేవి. మరి ఇప్పుడో..! ఇంటర్లో చాలా గ్రూపులొచ్చాయి. కానీ ఎంపీసీ, బైపీసీ తప్ప ఇతర గ్రూపుల గురించి తెలియని వారే అధికం. ఈ గ్రూపుల్లో చేరి ఇంజినీరింగ్, మెడిసిన్ లక్ష్యాలుగా చదవటం... వీటిలో చేరేందుకు ఇంటర్ తరవాత ఎంట్రెన్‌స టెస్టులు రాయడం!!. అంతే తెలుసు. అక్కడ బోల్తాపడితే ఏం చెయ్యాలనే ప్రత్యామ్నాయం ఆలోచన కూడా చాలా మందికి ఉండటంలేదు. ఇంజనీరింగ్, మెడిసిన్‌లో అవకాశం లభించకుంటే.. ఇక కెరీర్ అగమ్య గోచరం అనుకుంటూ మానసికంగా కుంగిపోతున్నవారూ ఎక్కువే...!
తెలుగు రాష్ట్రాల్లోనే ఇలా..?
నిజానికి ఈ విచిత్రమైన పరిస్థితి రాజ్యమేలుతున్నది తెలుగు రాష్ట్రాల్లోనే! కర్ణాటక, తమిళనాడు వంటి పొరుగు రాష్ట్రాల్లో సోషల్ సెన్సైస్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంది. బెంగళూరులోని కొన్ని డీమ్డ్ యూనివర్సిటీల్లో బీఏ సీట్లకు సైతం ఏడెనిమిది లక్షలు డిమాండ్ చేసేంత క్రేజ్. ఆయా కోర్సులు చదివినవారికి లభిస్తున్న కెరీర్ అవకాశాలే ఈ క్రేజ్‌కి కారణం. అలాంటి కోర్సులు ఇక్కడా ఉన్నాయి. వీటిలో ప్రధానంగా చెప్పుకోవాల్సినవి మేనేజ్‌మెంట్, లా, కామర్స్. చక్కని భవిష్యత్ ఉన్న ఈ కోర్సుల్లో డిగ్రీ, పీజీ స్థాయిలో చేరడమెలా.. అందించే కాలేజీలు, ఫీజులు, ఉన్నత విద్యావకాశాలు, తదితర వివరాలు....
మేనేజ్‌మెంట్ విద్య :
భవిష్యత్ కార్పొరేట్ లీడర్ల కోసం...
కంపెనీల్లో పలు విభాగాలకు సంబంధించి నిర్వహణ నైపుణ్యాలు అందించేవే మేనేజ్‌మెంట్ కోర్సులు. బ్యాచిలర్ డిగ్రీ స్థాయిలోనే వీటిలో అడుగుపెట్టొచ్చు. పీజీ స్థాయిలో ప్రతిష్టాత్మక ఐఐఎంలతోపాటు పేరున్న పలు బిజినెస్ స్కూల్స్ ఈ కోర్సును అందిస్తున్నాయి. అక్కడ ఎంబీఏ చేస్తే.. చక్కని జీతాలతో కార్పొరేట్ కొలువులు గ్యారెంటీ!
ఇంటర్‌తోనే మేనేజ్‌మెంట్ విద్య.. బీబీఏ
మేనేజ్‌మెంట్ విద్యలో.. బ్యాచిలర్ స్థాయిలో అందుబాటులో ఉన్న ప్రధానమైన కోర్సు బీబీఏ. ఇంటర్లో ఏ గ్రూప్ చదివిన విద్యార్థులైనా ఈ కోర్సులో చేరొచ్చు. బీబీఏ పూర్తిచేసినవారు భవిష్యత్తులో ఎంబీఏ కోర్సులో చేరి ఉన్నతంగా రాణించే వీలుంది. మూడేళ్ల బీబీఏలో భాగంగా బేసిక్ మేనేజ్‌మెంట్ ప్రిన్సిపుల్స్, కార్పొరేట్ పరిచయాలు, ఇంటర్న్‌షిప్స్, పారిశ్రామిక సందర్శనలు వంటి ప్రాక్టికల్ నైపుణ్యాలు లభిస్తాయి. అంతే కాకుండా జనరల్ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్, ఫైనాన్స్, అకౌంటింగ్, మానవ వనరుల నిర్వహణ, సప్లై చైన్ మేనేజ్‌మెంట్ తదితర సబ్జెక్ట్‌లను బీబీఏలో ఎంపిక చేసుకునే అవకాశముంది. దీంతో ఇతర బ్యాచిలర్ డిగ్రీలతో ఎంబీఏలో ప్రవేశించిన వారితో పోలిస్తే బీబీఏ అర్హతతో ఎంబీఏలో అడుగుపెట్టిన వారు మరింత మెరుగ్గా రాణించగలుగుతున్నారు. అయితే.. బీబీఏ కోర్సు గురించి అధికశాతం మందికి పెద్దగా అవగాహన లేదనే చెప్పొచ్చు. వాస్తవానికి దేశ వ్యాప్తంగా పలు ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లు బీబీఏ కోర్సును అందిస్తున్నాయంటేనే దీని ప్రాధాన్యం తెలుస్తుంది.
పేరున్న కొన్ని బీబీఏ కళాశాలలు...
ఎంబీఏ.. ఆకాశమే హద్దు
పీజీ స్థాయిలో మంచి బీస్కూల్ లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) చేస్తే.. మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత ప్రపంచీకరణ, పోటీ మార్కెట్ పరిస్థితుల్లో ..ఫైనాన్స్,హెచ్‌ఆర్, మార్కెటింగ్ వంటి సంప్ర దాయ స్పెషలైజేషన్లే కాకుండా.. ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి ఆధునిక స్పెషలైజేషన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి చదివిన అభ్యర్థులు కార్పొరేట్ సంస్థలకు హాట్ ఫేవరెట్లుగా మారుతున్నారు. ముఖ్యంగా ఐఐఎం క్యాంపస్‌లు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో ఎంబీఏలో అడుగుపెట్టిన వారికి.. తొలి ఏడాది పూర్తికాగానే కంపెనీల్లో ప్రీ ప్లేస్‌మెంట్ పేరిట ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తోంది. ఈ సమయంలో మెరుగైన పనితీరు కనబరిస్తే.. సదరు సంస్థలోనే సగటున రూ.12 లక్షల వార్షిక వేతనంతో కొలువు సొంతం చేసుకోవచ్చు. ఎంబీఏ విద్యార్థులు ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంబీఏ పూర్తిచేస్తున్న వారిలో ఉద్యోగ నైపుణ్యాలున్న వారి సంఖ్య 10 శాతంలోపే ఉంటోందని పలు సంస్థలు చెబుతున్నాయి.
చేరేందుకు మార్గాలు..
ప్రతిష్టాత్మక ఐఐఎం క్యాంపస్‌లు మొదలు.. దేశంలోని పలు కళాశాలల్లో ఎంబీఏలో చేరేందుకు ఎన్నో మార్గాలున్నాయి.
పీహెచ్‌డీ.. బోధన రంగం
ఎంబీఏ తర్వాత పీహెచ్‌డీ పూర్తిచేయడం ద్వారా ప్రతిష్టాత్మక బి-స్కూల్స్‌లో బోధన రంగంలో అడుగుపెట్టొచ్చు. నైపుణ్యాలుంటే లక్షల్లో వేతనం సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కార్పొరేట్ సంస్థలకు కన్సల్టెంట్స్‌గా కూడా వ్యవహరించొచ్చు.
విదేశీ విద్య :
పీజీ స్థాయిలో మేనేజ్‌మెంట్ విద్యను విదేశాల్లో అభ్యసిస్తే అంతర్జాతీయంగానూ అవకాశాలు విస్తృతం చేసుకోవచ్చు. అమెరికా వంటి దేశాల్లో ఎంబీఏలో చేరేందుకు జీమ్యాట్, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ స్కోర్లు తప్పనిసరి. ఏఎంబీఏ, ఏఏసీఎస్‌బీ వంటి సంస్థల గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి ఎంబీఏ పూర్తిచేస్తే అంతర్జాతీయంగా 120 దేశాల్లో ఉద్యోగ అన్వేషణ సాగించొచ్చు.
భవిష్యత్తు అవకాశాలు..
న్యాయ విద్య.. కార్పొరేట్ రూపు
ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన విద్యార్థులకు.. చదివిన గ్రూప్‌తో సంబంధం లేకుండా.. చక్కని భవిష్యత్తును అందించే కోర్సు న్యాయశాస్త్రం(లా). ప్రస్తుత కార్పొరేట్ యుగంలో న్యాయ విద్య కార్పొరేట్ రూపు సంతరించుకుంది. నైపు ణ్యాలుంటే.. లా గ్రాడ్యుయేట్లకు ఎంఎన్‌సీ రూ. లక్షల్లో వేతనాలు అందిస్తున్నాయి. నేడు కార్పొరేట్ రూపు సంతరించుకున్న న్యాయ విద్యలో ఇంటర్ తోనే అడుగుపెట్టే అవకాశముంది.
బీఏ ఎల్‌ఎల్‌బీ :
ఇంటర్ విద్యార్థులకు న్యాయ విద్య పరంగా ప్రధానంగా అందుబాటులో ఉన్న కోర్సు.. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సును అందించడంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడించిన ఇన్‌స్టిట్యూట్‌లు.. నేషనల్ లా స్కూల్స్. ప్రస్తుతం జాతీయ స్థాయిలోని 19 నేషనల్ లా స్కూల్స్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశించాలంటే.. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో ఉత్తమ స్కోర్ తప్పనిసరి. వీటిలో అడుగుపెట్టి కోర్సు పూర్తిచేస్తే కార్పొరేట్ కొలువులు ఖాయం అవుతున్నాయి. ముఖ్యంగా.. కార్పొరేట్ సంస్థల్లో ఇంటర్నల్ ఆర్బిట్రేటర్స్, లీగల్ అడ్వైజర్స్, లీగల్ ఆఫీసర్స్ వంటి కొలువులు సొంతం అవుతున్నాయి. నైపుణ్యాలుంటే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది.
క్లాట్ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నవి ..
క్లాట్-పీజీ :
ప్రతిష్టాత్మక లా స్కూల్స్‌లో ఎల్‌ఎల్‌ఎం కోర్సు లో చేరడానికి మార్గం.. క్లాట్-పీజీ. ఈ పరీక్షలో స్కోర్ ఆధారంగా ఎల్‌ఎల్‌ఎంలో పలు స్పెష లైజేషన్లలో అడుగుపెట్టొచ్చు. ఆ తర్వాత అభ్యర్థుల స్పెషలైజేషన్ ఆధారంగా కొలువులు సొంత మవుతున్నాయి. కార్పొరేట్ అండ్ కమర్షియల్ లా, ఐపీఆర్, ట్రేడ్ లా, పర్సనల్ లా వంటి స్పెషలైజేషన్స్‌తో ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేస్తే కార్పొరేట్ సంస్థల్లో కొలువులు ఖాయం. ఇక సంప్రదాయ న్యాయవాద వృత్తిలో కొనసాగాలనుకునే వారికి క్రిమినల్ లా, కాన్‌స్టిట్యూషనల్ లా, లేబర్ లా వంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి.
రాష్ట్రాల స్థాయిలో లాసెట్ :
రాష్ట్రాల స్థాయిలో బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకుంటే.. ఏపీ, టీఎస్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించే లాసెట్‌లో అయిదేళ్ల కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో ర్యాంకు ఆధారంగా ఆయా యూనివర్సిటీల పరిధిలోని న్యాయ కళాశాలల్లో అయిదేళ్ల బీఏ-ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశం లభిస్తుంది.
ఎల్‌శాట్-ఇండియా :
ఇంటర్మీడియెట్‌తోనే.. ప్రముఖ లా-స్కూల్స్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి మరో మార్గం.. ఎల్‌శాట్-ఇండియా. ఈ ఎంట్రన్స్‌లో బెస్ట్ స్కోర్ ఆధారంగా జాతీయ స్థాయిలో 90 ప్రముఖ లా-స్కూల్స్‌లో ప్రవేశం పొందొచ్చు.
ప్రవేశం కల్పిస్తున్న పలు ఇన్స్టిట్యూట్లు..
విదేశీ విద్య :
న్యాయవిద్యను విదేశాల్లో అభ్యసించాలనుకునే ఔత్సాహికులకు ప్రధానంగా రెండు టెస్ట్‌ల స్కోర్లు ప్రామాణికంగా నిలుస్తున్నాయి. అవి..
ఎల్‌శాట్ :
అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్‌శాట్) అంతర్జాతీయంగా నిర్వహించే పరీక్ష ఎల్‌శాట్. ఈ టెస్ట్ స్కోర్ ఆధారంగా.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాల్లోని యూనివర్సిటీల్లో బ్యాచిలర్ స్థాయి లా కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకోవచ్చు. వీటితోపాటు అంతర్జాతీయంగా 70 శాతం దేశాల్లోని యూనివర్సిటీలు ఎల్‌శాట్‌లో స్కోర్ ఆధారంగా బ్యాచిలర్ ఆఫ్ లా లేదా తత్సమాన కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.
నేషనల్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ లా (ఎల్‌ఎన్‌ఏటీ) :
యూకే, ఇతర యూరోపియన్ దేశాల్లోని యూనివర్సిటీల్లో ‘లా’ బ్యాచిలర్ స్థాయి కోర్సులో ప్రవేశానికి ప్రామాణికంగా నిలుస్తున్న పరీక్ష నేషనల్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ లా. ఈ టెస్ట్ స్కోర్ ద్వారా సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్ ఆఫ్ లాకు సమానమైన కోర్సులు పూర్తిచేస్తే ఐరోపా దేశాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
‘లా’ కెరీర్.. ముఖ్యాంశాలు..

- స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ - బీహెచ్‌యూ
- యూనివర్సిటీ ఆఫ్ ముంబై
- సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ
- నార్సిమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్
- క్రేస్ట్ యూనివర్సిటీ
- జిందాల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్
- బిట్స్ మెస్రా (అలహాబాద్ క్యాంపస్)
- మౌంట్ కార్మెల్ కాలేజ్ అమిటీ యూనివర్సిటీ
- ఎస్‌పీ జైన్ స్కూల్ ఆఫ్ గ్లోబల్ మేనేజ్‌మెంట్
ఎంబీఏ.. ఆకాశమే హద్దు
పీజీ స్థాయిలో మంచి బీస్కూల్ లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్(ఎంబీఏ) చేస్తే.. మెరుగైన అవకాశాలు అందుకోవచ్చు. ముఖ్యంగా ప్రస్తుత ప్రపంచీకరణ, పోటీ మార్కెట్ పరిస్థితుల్లో ..ఫైనాన్స్,హెచ్‌ఆర్, మార్కెటింగ్ వంటి సంప్ర దాయ స్పెషలైజేషన్లే కాకుండా.. ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్‌మెంట్, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ వంటి ఆధునిక స్పెషలైజేషన్స్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఇవి చదివిన అభ్యర్థులు కార్పొరేట్ సంస్థలకు హాట్ ఫేవరెట్లుగా మారుతున్నారు. ముఖ్యంగా ఐఐఎం క్యాంపస్‌లు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్, యూనివర్సిటీ క్యాంపస్ కళాశాలల్లో ఎంబీఏలో అడుగుపెట్టిన వారికి.. తొలి ఏడాది పూర్తికాగానే కంపెనీల్లో ప్రీ ప్లేస్‌మెంట్ పేరిట ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం లభిస్తోంది. ఈ సమయంలో మెరుగైన పనితీరు కనబరిస్తే.. సదరు సంస్థలోనే సగటున రూ.12 లక్షల వార్షిక వేతనంతో కొలువు సొంతం చేసుకోవచ్చు. ఎంబీఏ విద్యార్థులు ప్రాక్టికల్ నైపుణ్యాలను పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎంబీఏ పూర్తిచేస్తున్న వారిలో ఉద్యోగ నైపుణ్యాలున్న వారి సంఖ్య 10 శాతంలోపే ఉంటోందని పలు సంస్థలు చెబుతున్నాయి.
చేరేందుకు మార్గాలు..
ప్రతిష్టాత్మక ఐఐఎం క్యాంపస్‌లు మొదలు.. దేశంలోని పలు కళాశాలల్లో ఎంబీఏలో చేరేందుకు ఎన్నో మార్గాలున్నాయి.
- క్యాట్ (కామన్ అడ్మిషన్ టెస్ట్): ఈ ఎంట్రన్స్‌లో ప్రతిభ ద్వారా ఐఐఎం క్యాంపస్‌లతోపాటు మరో 150 వరకు ప్రముఖ బిజినెస్ స్కూల్స్‌లో ప్రవేశం ఖరారు చేసుకోవచ్చు
- మ్యాట్: ఆల్ ఇండియా మేనేజ్‌మెంట్ అసోసియేషన్ నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్.. మ్యాట్ (మేనేజ్‌మెంట్ ఆప్టిట్యూడ్ టెస్ట్). ఏటా నాలుగుసార్లు (ఫిబ్రవరి, మే, సెప్టెంబర్, డిసెంబర్) జరిగే మ్యాట్‌లో ఉత్తీర్ణత సాధిస్తే జాతీయ స్థాయిలో దాదాపు 400 మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లలోప్రవేశాలకు అర్హత లభిస్తుంది.
- ఎన్‌మ్యాట్: ప్రముఖ బీస్కూల్ నర్సీమొంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్ నిర్వహించే ఎంట్రెన్స్.. ఎన్‌మ్యాట్. ఇందులోని స్కోర్‌ను మరెన్నో ప్రైవేటు బి-స్కూల్స్ కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాయి.
- ఎక్స్‌ఏటీ: జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ) నిర్వహించే పరీక్ష.. ఎక్స్‌ఏటీ. ఈ స్కోరు ఆధారంగా ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ అనుబంధ కళాశాలలతోపాటు దేశవ్యాప్తంగా మరో వం దకు పైగా బీస్కూల్స్‌లో ప్రవేశం పొందొచ్చు.
- సీమ్యాట్: కామన్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్ టెస్ట్.. సీమ్యాట్. ఏఐసీటీఈ గుర్తింపున్న కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్ ఇది.
- ఏటీఎంఏ: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మేనేజ్‌మెంట్ స్కూల్స్(ఏఐఎంఎస్) నిర్వహించే పరీక్ష.. ఏటీఎంఏ(ఎయిమ్స్ టెస్ట్ ఫర్ మేనేజ్‌మెంట్ అడ్మిషన్స్). కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ గుర్తింపు పొందిన ఈ టెస్ట్ స్కోర్ ఆధారంగా దేశంలోని 300కు పైగా ప్రముఖ బి-స్కూల్స్‌లో ప్రవేశానికి అర్హత లభిస్తుంది.
- ఐసెట్: తెలుగు రాష్ట్రాల్లోని కళాశాలల్లో ఎంబీఏ కోర్సులో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. ఐసెట్ (ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్). ఇందులో మెరుగైన ర్యాంకు ద్వారా ఎంబీఏలో చేరొచ్చు.
పీహెచ్‌డీ.. బోధన రంగం
ఎంబీఏ తర్వాత పీహెచ్‌డీ పూర్తిచేయడం ద్వారా ప్రతిష్టాత్మక బి-స్కూల్స్‌లో బోధన రంగంలో అడుగుపెట్టొచ్చు. నైపుణ్యాలుంటే లక్షల్లో వేతనం సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా కార్పొరేట్ సంస్థలకు కన్సల్టెంట్స్‌గా కూడా వ్యవహరించొచ్చు.
విదేశీ విద్య :
పీజీ స్థాయిలో మేనేజ్‌మెంట్ విద్యను విదేశాల్లో అభ్యసిస్తే అంతర్జాతీయంగానూ అవకాశాలు విస్తృతం చేసుకోవచ్చు. అమెరికా వంటి దేశాల్లో ఎంబీఏలో చేరేందుకు జీమ్యాట్, టోఫెల్, ఐఈఎల్‌టీఎస్ స్కోర్లు తప్పనిసరి. ఏఎంబీఏ, ఏఏసీఎస్‌బీ వంటి సంస్థల గుర్తింపు ఉన్న ఇన్‌స్టిట్యూట్‌ల నుంచి ఎంబీఏ పూర్తిచేస్తే అంతర్జాతీయంగా 120 దేశాల్లో ఉద్యోగ అన్వేషణ సాగించొచ్చు.
భవిష్యత్తు అవకాశాలు..
- బీబీఏతోనే కొలువు కోరుకుంటే.. ప్రైవేటు సంస్థల్లో జూనియర్ మేనేజర్ కేడర్‌లో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వార్షిక వేతనం.
- ఐఐఎంలు, ఇతర ప్రముఖ బి-స్కూల్స్‌లో క్యాంపస్ ప్లేస్‌మెంట్స్ ద్వారా రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల సగటు వార్షిక వేతనం.
- పీజీ స్థాయిలో ఇంటర్న్‌షిప్ సమయంలో రూ. 50 వేల నుంచి రూ.1.5 లక్షల స్టైపెండ్ అందుకోవచ్చు!!
న్యాయ విద్య.. కార్పొరేట్ రూపు
ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన విద్యార్థులకు.. చదివిన గ్రూప్‌తో సంబంధం లేకుండా.. చక్కని భవిష్యత్తును అందించే కోర్సు న్యాయశాస్త్రం(లా). ప్రస్తుత కార్పొరేట్ యుగంలో న్యాయ విద్య కార్పొరేట్ రూపు సంతరించుకుంది. నైపు ణ్యాలుంటే.. లా గ్రాడ్యుయేట్లకు ఎంఎన్‌సీ రూ. లక్షల్లో వేతనాలు అందిస్తున్నాయి. నేడు కార్పొరేట్ రూపు సంతరించుకున్న న్యాయ విద్యలో ఇంటర్ తోనే అడుగుపెట్టే అవకాశముంది.
బీఏ ఎల్‌ఎల్‌బీ :
ఇంటర్ విద్యార్థులకు న్యాయ విద్య పరంగా ప్రధానంగా అందుబాటులో ఉన్న కోర్సు.. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సును అందించడంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడించిన ఇన్‌స్టిట్యూట్‌లు.. నేషనల్ లా స్కూల్స్. ప్రస్తుతం జాతీయ స్థాయిలోని 19 నేషనల్ లా స్కూల్స్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశించాలంటే.. కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో ఉత్తమ స్కోర్ తప్పనిసరి. వీటిలో అడుగుపెట్టి కోర్సు పూర్తిచేస్తే కార్పొరేట్ కొలువులు ఖాయం అవుతున్నాయి. ముఖ్యంగా.. కార్పొరేట్ సంస్థల్లో ఇంటర్నల్ ఆర్బిట్రేటర్స్, లీగల్ అడ్వైజర్స్, లీగల్ ఆఫీసర్స్ వంటి కొలువులు సొంతం అవుతున్నాయి. నైపుణ్యాలుంటే రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వార్షిక వేతనం లభిస్తోంది.
క్లాట్ ద్వారా ప్రవేశం కల్పిస్తున్నవి ..
- నేషనల్ లా స్కూల్ ఆఫ్ ఇండియా - బెంగళూరు
- నల్సార్ - హైదరాబాద్
- నేషనల్ లా యూనివర్సిటీ-భోపాల్
- వెస్ట్ బెంగాల్ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ జ్యురిడికల్ సెన్సైస్
- నేషనల్ లా యూనివర్సిటీ-జోథ్‌పూర్
- హిదయతుల్లా నేషనల్ లా యూనివర్సిటీ - రాయ్‌పూర్
- గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ - గాంధీనగర్
- డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా నేషనల్ లా యూనివర్సిటీ - లక్నో
- రాజీవ్‌గాంధీ నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ లా - పంజాబ్
- చాణక్య నేషనల్ లా యూనివర్సిటీ - పాట్నా
- నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ అడ్వాన్స్‌డ్ లీగల్ స్టడీస్ -కోచి
- నేషనల్ లా యూనివర్సిటీ - కటక్
- నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ స్టడీ అండ్ రీసెర్చ్ ఇన్ లా-రాంచి
- నేషనల్ లా యూనివర్సిటీ అండ్ జ్యురిడికల్ అకాడమీ- అసోం
- దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్సిటీ-విశాఖపట్నం
- తమిళనాడు నేషనల్ లా స్కూల్ - త్రిచీ
- మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ-ముంబై
- మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ- నాగ్‌పూర్
- ఎంఎన్‌ఎల్‌యూ - ఔరంగాబాద్
క్లాట్-పీజీ :
ప్రతిష్టాత్మక లా స్కూల్స్‌లో ఎల్‌ఎల్‌ఎం కోర్సు లో చేరడానికి మార్గం.. క్లాట్-పీజీ. ఈ పరీక్షలో స్కోర్ ఆధారంగా ఎల్‌ఎల్‌ఎంలో పలు స్పెష లైజేషన్లలో అడుగుపెట్టొచ్చు. ఆ తర్వాత అభ్యర్థుల స్పెషలైజేషన్ ఆధారంగా కొలువులు సొంత మవుతున్నాయి. కార్పొరేట్ అండ్ కమర్షియల్ లా, ఐపీఆర్, ట్రేడ్ లా, పర్సనల్ లా వంటి స్పెషలైజేషన్స్‌తో ఎల్‌ఎల్‌ఎం పూర్తిచేస్తే కార్పొరేట్ సంస్థల్లో కొలువులు ఖాయం. ఇక సంప్రదాయ న్యాయవాద వృత్తిలో కొనసాగాలనుకునే వారికి క్రిమినల్ లా, కాన్‌స్టిట్యూషనల్ లా, లేబర్ లా వంటి స్పెషలైజేషన్స్ ఉన్నాయి.
రాష్ట్రాల స్థాయిలో లాసెట్ :
రాష్ట్రాల స్థాయిలో బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో చేరాలనుకుంటే.. ఏపీ, టీఎస్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహించే లాసెట్‌లో అయిదేళ్ల కోర్సుకు దరఖాస్తు చేసుకోవాలి. ఇందులో ర్యాంకు ఆధారంగా ఆయా యూనివర్సిటీల పరిధిలోని న్యాయ కళాశాలల్లో అయిదేళ్ల బీఏ-ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశం లభిస్తుంది.
ఎల్‌శాట్-ఇండియా :
ఇంటర్మీడియెట్‌తోనే.. ప్రముఖ లా-స్కూల్స్‌లో బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశానికి మరో మార్గం.. ఎల్‌శాట్-ఇండియా. ఈ ఎంట్రన్స్‌లో బెస్ట్ స్కోర్ ఆధారంగా జాతీయ స్థాయిలో 90 ప్రముఖ లా-స్కూల్స్‌లో ప్రవేశం పొందొచ్చు.
ప్రవేశం కల్పిస్తున్న పలు ఇన్‌స్టిట్యూట్లు..
- ఒ.పి.జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ
- ఎన్.ఎ.గ్లోబల్ లా స్కూల్
- ఇండోర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా
- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా/ఏఐఎస్‌ఈసీటీ యూనివర్సిటీ ఆఫ్ భోపాల్
- జి.డి.గోయెంకా యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా
- ఎన్‌ఎంఐఎంఎస్ స్కూల్ ఆఫ్ లా
- అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ
- యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం ఇంజనీరింగ్ స్టడీస్
- కెఎల్‌ఈ సొసైటీ లా కాలేజ్
- గీతమ్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ లా
విదేశీ విద్య :
న్యాయవిద్యను విదేశాల్లో అభ్యసించాలనుకునే ఔత్సాహికులకు ప్రధానంగా రెండు టెస్ట్‌ల స్కోర్లు ప్రామాణికంగా నిలుస్తున్నాయి. అవి..
ఎల్‌శాట్ :
అమెరికాకు చెందిన లా స్కూల్ అడ్మిషన్ కౌన్సిల్ (ఎల్‌శాట్) అంతర్జాతీయంగా నిర్వహించే పరీక్ష ఎల్‌శాట్. ఈ టెస్ట్ స్కోర్ ఆధారంగా.. అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్ తదితర దేశాల్లోని యూనివర్సిటీల్లో బ్యాచిలర్ స్థాయి లా కోర్సుల్లో ప్రవేశం ఖరారు చేసుకోవచ్చు. వీటితోపాటు అంతర్జాతీయంగా 70 శాతం దేశాల్లోని యూనివర్సిటీలు ఎల్‌శాట్‌లో స్కోర్ ఆధారంగా బ్యాచిలర్ ఆఫ్ లా లేదా తత్సమాన కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తున్నాయి.
నేషనల్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ లా (ఎల్‌ఎన్‌ఏటీ) :
యూకే, ఇతర యూరోపియన్ దేశాల్లోని యూనివర్సిటీల్లో ‘లా’ బ్యాచిలర్ స్థాయి కోర్సులో ప్రవేశానికి ప్రామాణికంగా నిలుస్తున్న పరీక్ష నేషనల్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ లా. ఈ టెస్ట్ స్కోర్ ద్వారా సంబంధిత ఇన్‌స్టిట్యూట్‌లలో బ్యాచిలర్ ఆఫ్ లాకు సమానమైన కోర్సులు పూర్తిచేస్తే ఐరోపా దేశాల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు.
‘లా’ కెరీర్.. ముఖ్యాంశాలు..
- నేషనల్ లా స్కూల్స్ నుంచి పట్టా అందుకుంటే కార్పొరేట్ సంస్థల్లో రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షల మధ్యలో వార్షిక వేతనంతో కొలువు.
- ప్రధాన ఉపాధి వేదికలుగా నిలుస్తున్న బ్యాంకులు, కేపీఓలు.
- సైబర్ లా, సైబర్ సెక్యూరిటీ సబ్జెక్ట్‌లలో నైపుణ్యం పొందితే రూ. 10 లక్షల వార్షిక వేతనంతో కొలువు ఖాయం.
- కార్పొరేట్ లా, ఐపీఆర్ స్పెషలైజేషన్లతో పీజీ (ఎల్‌ఎల్‌ఎం) చేసిన వారికి భారీ డిమాండ్
- లా ఇన్‌స్టిట్యూట్‌లలో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్స్ నిర్వహిస్తున్న సంస్థలు.
‘లా’ పై అవగాహన పెరగాలి... న్యాయ విద్యపై విద్యార్థుల్లో మరింత అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. రెండు దశాబ్దాల క్రితం వరకు న్యాయ విద్య అంటే ఆసక్తి ఉండేది. కానీ.. తర్వాత కాలంలో ఇంజనీరింగ్, మెడిసిన్ క్రేజ్ కారణంగా ‘లా’ పట్ల ఆసక్తి చూపే వారి సంఖ్య తగ్గింది. అయితే ఇటీవల కాలంలో న్యాయ శాస్త్రం కూడా ఆధునికత దిశగా అడుగులు వేస్తోంది. అంతే స్థాయిలో అవకాశాలనూ కల్పిస్తోంది. విద్యార్థులు దీన్ని దృష్టిలో పెట్టుకుని ‘లా’ దిశగా అడుగులు వేస్తే ఉజ్వల భవిష్యత్తు ఖాయం. నేషనల్ లా స్కూల్స్‌లో చదివిన విద్యార్థులకు బీఎఫ్‌ఎస్‌ఐ, కన్సల్టింగ్, ఐపీఆర్ సంస్థల్లో కొలువులు సొంతం అవుతున్నాయి. - ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, రిజిస్ట్రార్, నల్సార్ యూనివర్సిటీ, హైదరాబాద్ |
Published date : 20 Jun 2018 02:51PM