ప్రస్తుతం ట్రేండింగ్‌లో ఉన్న స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ జాబ్ గురించి తెలుసుకోండిలా..!
Sakshi Education
స్టాక్ మార్కెట్.. దీనిని షేర్ మార్కెట్ అని కూడా అంటారు. ఇది స్టాక్స్ లేదా షేర్ల అమ్మకందారులు, కొనుగోలుదారుల వేదిక. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామం జరిగినా.. మొదట అది ప్రభావం చూపేది స్టాక్‌మార్కెట్ పైనే! గత రెండు దశాబ్దాలుగా భారత స్టాక్ మార్కెట్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంది. మరెన్నో మార్పులకు లోనైంది. దేశంలో స్టాక్ మార్కెట్ నిర్వహణ, పర్యవేక్షణ సంస్థ సెబీ(సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా)కి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్(ఎన్‌ఐఎస్‌ఎం)..ఇటీవల పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో..స్టాక్ మార్కెట్‌లో ఉద్యోగ, ఉపాధి మార్గాలు..అందుబాటులో ఉన్న కోర్సులు.. కెరీర్ అవకాశాలపై ప్రత్యేక కథనం...
దేశంలో స్టాక్ మార్కెట్ విస్తరిస్తోంది. మధ్య తరగతి సైతం స్టాక్ మార్కెట్‌లో మదుపు చేసేందుకు ఆసక్తి చూపుతోంది. ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్‌పై అవగాహన పెంచుకునే వారి సంఖ్య పెరుగుతోంది. అమెరికాలో 50శాతం మంది ప్రజలు స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తుంటే.. మన దేశంలో కేవలం పది శాతం మంది మాత్రమే షేర్లు కొనుగోలు చేస్తున్నట్లు అంచనా. అంటే.. దేశ స్టాక్ మార్కెట్ విస్తరణకు ఇంకా ఎంతో అవకాశం ఉంది. అందుకు తగ్గట్టుగానే నైపుణ్యాలున్న వారికి ఉపాధి మార్గాలు లభిస్తాయని చెప్పొచ్చు.
కామర్స్ నేపథ్యం..
స్టాక్‌మార్కెట్ సంబంధిత వివిధ విభాగాల్లో ఫండ్ మేనేజర్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజర్, రీసెర్చ్ అనలిస్ట్, ఈక్విటీ లేదా కమొడిటీ డీలర్, రిస్క్ మేనేజర్, కంప్లయంట్స్ ఆఫీసర్, స్టాక్ బ్రోకర్, బ్యాక్ ఆఫీస్ మేనేజర్ వంటి వివిధ రకాల ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వస్తున్నాయి. స్టాక్ మార్కెట్ సర్టిఫికేషన్ లేదా కామర్స్ నేపథ్యంతో డిగ్రీ పూర్తి చేసిన వారితోపాటు సీఏ వంటి ప్రొఫెషనల్ కామర్స్ కోర్సులు ఉత్తీర్ణులైన నిపుణులకు స్టాక్ మార్కెట్ చక్కటి ఉపాధి వేదికగా నిలుస్తోంది.
స్టాక్ మార్కెట్లో కెరీర్..
మార్కెట్‌ల విస్తరణతో స్టాక్ మార్కెట్లో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. కేవలం కామర్స్ చదువుకున్న వారు మాత్రమే కాకుండా.. ఆర్ట్స్, సైన్స్, ఇంజనీరింగ్ వంటి కోర్సులు ఉత్తీర్ణులైన అభ్యర్థులు సైతం స్టాక్ మార్కెట్లో కెరీర్ కోసం ప్రయత్నిస్తున్నారు. స్టాక్ మార్కెట్‌లో ప్రధానంగా–స్టాక్ బ్రోకర్, ఫైనాన్షియల్ అడ్వైజర్, ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్, పోర్ట్ ఫోలియో మేనేజ్‌మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్), రీసెర్చ్ అనలిస్ట్, ఆన్‌లైన్ స్టాక్ ట్రేడింగ్, ఫైనాన్షియల్ అనలిస్ట్, ఈక్విటీ అనలిస్ట్, హెడ్జ్ ఫండ్ మేనేజర్, మ్యూచువల్ ఫండ్ మేనేజర్, మార్కెట్ రీసెర్చర్, రిస్క్ అనలిస్ట్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి.
విద్యార్హతలు..
కంపెనీలు కామర్స్ లేదా మేనేజ్‌మెంట్ నేపథ్యం ఉన్న అభ్యర్థులను నియమించుకుంటున్నాయి. కొన్ని సంస్థలు బిజినెస్ లేదా ఫైనాన్స్ లో బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ చేసినవారికి మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నాయి. ప్రాథమికంగా ఒక వ్యక్తి స్టాక్ మార్కెట్లో కెరీర్ ప్రారంభించాలని నిర్ణయించుకుంటే.. ఇంటర్మీడియెట్/10+2 తర్వాత గ్రాడ్యుయేషన్‌లో కామర్స్/అకౌంట్స్ లేదా ఫైనాన్స్ సబ్జెక్టులను అధ్యయనం చేసి ఉంటే మేలు. దాంతోపాటు స్టాక్ మార్కెట్ సంబంధిత సర్టిఫికేషన్స్ చేస్తే ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.
ఉపాధి వేదికలు..
అర్హతలు, నైపుణ్యాలున్న యువత–ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, స్టాక్ బ్రోకింగ్ సంస్థలు, మ్యూచువల్ అండ్ పెన్షన్ ఫండ్ సెక్టార్, మల్టీనేషనల్ ఆర్గనైజేషన్స్, –రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్స్, మాస్ మీడియా, బీమా సంస్థలు, ఇన్వెస్ట్‌మెంట్ కన్సల్టింగ్ సంస్థల్లో ఉద్యోగాలు సొంతం చేసుకునే వీలుంది.
వేతనం..
ఉద్యోగం చేస్తున్న విభాగం, చేరిన కంపెనీ వంటి వివిధ అంశాలను బట్టి వేతనం ఉంటుంది. ప్రస్తుత ట్రెండ్ ప్రకారం–స్టాక్ మార్కెట్ సంబంధిత విభాగాల్లో చేరిన అభ్యర్థులకు వార్షిక ప్రారంభ వేతనం రూ.4లక్షల వరకు లభిస్తోంది. విద్యార్హతలు, అనుభవం, నైపుణ్యాలను బట్టి వేతనం పెరుగుతుంది.అనుభవం, పనితీరుతో రూ.8.50 లక్షల వరకూ వార్షిక వేతనం అందుకుంటున్నారు.
అందుబాటులో పలు కోర్సులు..
స్టాక్ మార్కెట్ సంబంధిత నైపుణ్యాలు అందించేలా పలు ప్రత్యేకమైన కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ∙డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ అండ్ స్టాక్ మార్కె ట్స్, అడ్వాన్స్‌డ్ డిప్లొమా ఇన్ ఫైనాన్షియల్ మార్కెట్స్, డిప్లొమా ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ, డిప్లొమా ఇన్ రీసెర్చ్ అనలిస్ట్, స్టాక్ మార్కెట్ సర్టిఫికెట్ కోర్సు, ఈక్విటీ డీలర్ సర్టిఫికెట్ కోర్సు, అడ్వాన్స్‌డ్ కోర్సు ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ పోర్ట్‌పోలియో మేనేజ్‌మెంట్, అడ్వాన్స్‌డ్ కోర్సు ఇన్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ ఎక్స్‌ఏ సీరిస్, అడ్వాన్స్‌డ్ కోర్సు ఇన్ సెబీ, ఎన్‌ఐఎస్‌ఎం ఎక్స్‌వీ సిరీస్, టెక్నికల్ అనాలిసిస్ కోర్సు ఇన్ స్టాక్ మార్కెట్, స్టాక్ మార్కెట్ కోర్సు ఫర్ స్టాక్ ట్రేడర్స్, ఫండమెంటల్ అనాలిసిస్ కోర్సు ఇన్ స్టాక్ మార్కెట్. ఈ సర్టిఫికెట్/డిప్లొమా కోర్సులు స్టాక్ మార్కెట్ రంగంలో కెరీర్ కొనసాగించడానికి ఎంతో ఉపయోగపడతాయి. దీంతో పాటు ఫైనాన్స్ లేదా ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో బీకామ్, ఎంబీఏ లేదా ఎంకామ్(ఫైనాన్స్) వంటి అకడమిక్ డిగ్రీలు చేసినట్టయితే.. ఈ రంగంలో రాణించడానికి అదనపు అర్హతగా ఉపయోగపడతాయి. వీటితోపాటు కార్పొరేట్ ఫైనాన్స్, గ్లోబల్ ఎకానమీ, బిజినెస్ ఎకనామిక్స్ –ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, బ్యాంకింగ్ అండ్ సెక్యూరిటీస్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ వంటి సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన అభ్యర్థులకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.
ఎన్‌ఐఎస్‌ఎంలో శిక్షణ–కోర్సులు..
దేశంలో క్యాపిటల్ మార్కెట్, స్టాక్ మార్కెట్‌ల నిర్వహణ, పర్యవేక్షణ సంస్థ.. సెక్యూరిటీస్ అండ్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్ (ఎన్‌ఐఎస్‌ఎం).. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన పలు పూర్తి స్థాయి కోర్సులను అందిస్తోంది. దేశంలో సెక్యూరిటీస్ మార్కెట్‌లో పని చేయాలనుకునే గ్రాడ్యుయేట్లు, ఎల్‌ఎల్‌బీ అభ్యర్థులు ఈ సంస్థ అందించే కోర్సుల్లో చేరొచ్చు.
ఎన్‌ఐఎస్‌ఎం–ప్రవేశాలు..
సెక్యూరిటీస్ ఎక్సే్ఛంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ)కి చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీస్ మార్కెట్స్(ఎన్‌ఐఎస్‌ఎం).. వివిధ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.
కోర్సుల వివరాలు..
పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్ (సెక్యూరిటీస్ మార్కెట్):
అర్హత:కనీసం 50శాతం మార్కులతో బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. డిగ్రీ చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. వీటిలో ఏదో ఒక జాతీయ అర్హత పరీక్ష(క్యాట్/గ్జాట్/సీమ్యాట్/ఏటీఎంఏ/మ్యాట్/ జీమ్యాట్) వాలిడ్ స్కోర్ ఉండాలి.
ఎంపిక విధానం: జాతీయ అర్హత పరీక్ష వాలిడ్ స్కోర్, పర్సనల్ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: 30.04.2021.
ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్(ఇన్వెస్ట్‌మెంట్ అండ్ సెక్యూరిటీస్ లా):
అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఎల్‌ఎల్‌బీ డిగ్రీ/తత్సమాన ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: ఆన్‌లైన్ ఇంటర్వూలో ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: 13.05.2021.
పోస్టుగ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్(పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్/ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజరీ/రీసెర్చ్ అనాలసిస్):
అర్హత: కనీసం 50శాతం మార్కులతో ఏదైనా విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
ఎంపిక విధానం: అభ్యర్థుల ప్రొఫైల్, ఆన్‌లైన్ పర్సనల్ ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులకు చివరి తేది: 10.04.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్: https://www.nism.ac.in/pgdm/

Published date : 10 Apr 2021 03:16PM