Skip to main content

ప్రభుత్వ ఉద్యోగాలకు ఇలా తయారవ్వండి...

ఇప్పుడు ఉద్యోగాల కొరత మరింత ఎక్కువయ్యింది. ప్రతి ఒక్కరూ ఉద్యోగం చేయాల్సిన అవసరం ఏర్పడింది. అయితే అందరికి ప్రైవేట్ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితులు లేవు.
ఇక గవర్నమెంట్ నోటిఫికేషన్లు ఒక్కటే మార్గం. మీ విలువైన సమయంలో జాబ్ కొట్టడానికి ఏం చేయాలో ఒకసారి తెలుసుకుందాం.

ఆన్‌లైన్ ద్వారా నేర్చుకోండిలా..
ఈ 21వ శతాబ్ధంలో ఇంటర్నెట్ లేకుండా మనం మన జీవితాల్ని ఊహించుకోలేం. ప్రతి ఒక్కరి చేతితో మొబైల్ ఫోన్ ఉండాల్సిందే. అయితే ఇంటర్నెట్‌ని సోషల్ మీడియా సైట్స్ చూడటానికి కాకుండా ఎడ్యూకేషన్‌కు సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ఉపయోగించండి. గవర్నమెంట్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేవారి కోసం చాలా వెబ్‌సైట్లు తక్కువ రేటుకు లేదా ఉచితంగానే స్టడీమెటీరియల్స్, ఆన్‌లైన్ వీడియో క్లాసులు అందిస్తున్నాయి. వీటిని సద్వినియోగం చేసుకుంటే చాలా వరకు సబెక్ట్ నేర్చుకోవచ్చు.

బుక్స్‌ను ఎలా చదవాలి?
గవర్నమెంట్ జాబ్‌కు ప్రిపరేషన్ అనేదిఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ప్రతి యేడాది పరీక్షలు సంబంధించిన సిలబస్ మార్పు చేస్తూనే ఉంటారు. ఈ సిలబస్ వరకు చదివితే సరిపోతుంది అనేది గవర్నమెంట్ జాబ్ కొట్టేవారి విషయంలో సరికాదు. యూపీఎస్సీకి లేదా ఏదైనా రాష్ట్ర స్థాయి పరీక్షలకు ప్రిపేరయ్యే వారికి ఎంత సమయం ఉన్న సరిపోదు. ఏదో ఒక విషయం నిరంతరం తెలుసుకుంటూనే ఉండాలి. ఒకేసారి ప్రిలిమ్స్, మెయిన్స్‌కు సంసిద్ధం కావాలి. దీని కోసం పుస్తకాలు చదువుతూ సబెక్ట్‌పై లోతైన అవగాహన పెంచుకోవాలి.

ముఖ్యంగా దీనిపై పట్టు సాధించాలి...
గవర్నమెంట్ ఎగ్టామ్స్‌కి జనరల్ అవేర్‌నెస్ అనేది కీలకపాత్ర పోషిస్తుంది. అయితే చాలా మంది ఆప్టిట్యూడ్, రీజనింగ్ లాంటివి ప్రిపేర్ అవుతూ తేలికగానే ఉంటుందని... జనరల్ నాలెడ్జ్ పార్ట్‌ను వదిలేస్తారు. కానీ జనరల్ అవేర్‌నెస్ పై పట్టు ఉంటే మంచి స్కోర్ సాధించవచ్చు. జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి చాలా మెటీరియల్స్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయి.

కరెంట్ అఫైర్స్‌ను....
నిత్యం మన చుట్టూ జరిగే విషయాల నుంచే చాలా ప్రశ్నలు పరీక్షల్లో వస్తూ ఉంటాయి. ప్రతి ఎగ్జామ్స్‌కు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా ముఖ్యం. న్యూస్ పేపర్ చదవడం వల్ల కరెంట్ అఫైర్స్ పై పట్టు రావడంతో పాటు పదజాలాన్ని కూడా పెంపొందించుకోవచ్చు.

డైలీ, వీక్లీ, మంత్లీ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి

ఆన్‌లైన్ పరీక్షలు రాయడంతో...
పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు టైం మెనేజ్మెంట్ అనేది చాలా కీలకం. ఇచ్చిన టైంలోగా ఎన్ని ప్రశ్నలు చేయగలుగుతున్నాం. అసలు మనం ఏ సబ్జెక్ట్‌లో వీక్‌గా ఉన్నాం. ఏ పార్ట్‌ను ఇంఫ్రూచేసుకోవాలో.. అనేది రోజు మాక్ టెస్టులు రాయడం ద్వారా తెలుస్తోంది. ఇలా ప్రాక్టీస్ చేయడం ద్వారా విద్యార్థులు చాలా వరకు ఏ విషయం మీద ఫోకస్ పెట్టాలో అనే దానిని తెలుసుకోగలుగుతారు. మాక్ టెస్టులల్లో చేసే తప్పులను అసలు ఎగ్జామ్‌లో చేయకుండా చూసుకుంటే మంచి మార్కులు సాధిస్తారు.

ఆన్‌లైన్ పరీక్షల కోసం క్లిక్ చేయండి

ఆరోగ్యం విషయంలో...
మనం చదువుకుంటూ ఎలాంటి ఫిజికల్ యాక్టివిటి లేకపోతే శరీరం బద్దకంగా తయారవుతుంది. ప్రతి రోజు వ్యాయమం చేస్తూ పిట్‌గా ఉండాలి. ఆరోగ్యం బాగున్నప్పుడే మనం చురుకుగా చదువుకోగలం. ఇకెందుకు ఆలస్యం ఇప్పటి నుంచే మన ప్రిపరేషన్ మొదలు పెడదాం.

గవర్నమెంట్ జాబ్ వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
Published date : 18 Nov 2020 06:40PM

Photo Stories