పార్ట్‌టైమ్ జాబ్స్...చదువుకుంటూనే !
Sakshi Education
ఇంటర్ నుంచి ఇంజనీరింగ్, ఎంబీఏ వరకూ.. ఏ ఉన్నత విద్య కోర్సు చూసినా.. వేలల్లో, లక్షల్లోనే ఫీజులు. అమ్మానాన్న కష్టపడి ఫీజులు కట్టినా.. పుస్తకాలు, పెన్నులు, నోట్సులు, బస్‌పాసులు.. ఇలా రోజువారి ఖర్చుల కోసం ఇబ్బందిపడే విద్యార్థులెందరో..! ఇలాంటి వారికి ఇప్పుడు చక్కటి మార్గంగా నిలుస్తున్నాయి..
పార్ట్‌టైమ్ జాబ్స్! వీటి ద్వారా చదువుకుంటూనే.. సంపాదించుకోవచ్చు. కంపెనీలు మారిన పరిస్థితుల్లో పార్ట్‌టైమ్ విధానంలో నియామకాలకు ప్రాధాన్యమిస్తున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు సైతం క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకునేందుకు; స్థానిక సమస్యలు, ఓటర్ల అభిప్రాయాలపై నివేదికల కోసం విద్యార్థులను స్వల్పకాలానికి నియమించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో పెరుగుతున్న పార్ట్‌టైమ్ జాబ్స్ ట్రెండ్ .. వాటిని అందిపుచ్చుకునేందుకు మార్గాలు.. లభించే ఆదాయం గురించి తెలుసుకుందాం...
ఉన్నత విద్య కోర్సుల్లో చేరిన విద్యార్థులు చదువుకుంటూనే.. పార్ట్‌టైమ్ జాబ్స్ చేస్తూ సంపాదించుకోవడం అమెరికా, యూకే వంటి దేశాల్లో ఎప్పటినుంచో ఉంది. కొద్దికాలంగా మన దేశంలోనూ పార్ట్‌టైమ్ ఉద్యోగావకాశాలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు పార్ట్‌టైమ్ జాబ్స్ అంటే ట్రాన్స్‌లేషన్స్, జర్నలిజం, ఫోటోగ్రఫీ వంటి వాటికే పరిమితం. నేటి కార్పొరేట్ యుగంలో అన్ని రంగాల్లోనూ పార్ట్‌టైమ్ జాబ్స్ అందివస్తున్నాయి. ముఖ్యంగా గత రెండు, మూడేళ్లుగా.. ఈ-కామర్స్, రిటైల్ రంగాల్లో ఈ ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. డెలివరీ బాయ్స్ నుంచి డేటా అనలిస్ట్‌ల వరకు.. ఎన్నో అవకాశాలు పార్ట్‌టైమ్ విధానంలో లభిస్తున్నాయి. సదరు ఉద్యోగం, కేటాయించే సమయం ఆధారంగా నెలకు కనీసం రూ.10 వేలు సంపాదించుకునే అవకాశం లభిస్తోంది.
ఈ-కామర్స్, రిటైల్ :
ఈ-కామర్స్, రిటైల్ రంగంలో.. పార్ట్‌టైమ్ ఉద్యోగాలు ఎక్కువగా లభిస్తున్నాయి. వీటిలో బ్లూ కాలర్ జాబ్స్‌గా పేర్కొనే కిందిస్థాయి ఉద్యోగాలైన డెలివరీ డ్రైవర్స్, ప్యాకింగ్ బాయ్స్, ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్స్ వంటి ఉద్యోగాల సంఖ్య ఎక్కువగా ఉంది. డెలివరీ డ్రైవర్స్, విష్ మాస్టర్ ఉద్యోగాలకు యువత నుంచి ఆసక్తి కనిపిస్తోంది. ఈ జాబ్స్‌కు విద్యార్హత పదో తరగతి, ఇంటర్మీడియెట్‌గా ఆయా సంస్థలు నిర్దేశిస్తున్నాయి. వీరికి సగటున రూ.15 వేల వరకూ అందుతోంది. ఈ పార్ట్‌టైమ్ ఉద్యోగులను నియమించుకునే ఈ-కామర్స్, ఎఫ్‌ఎంసీజీ సంస్థలు ఎక్కువగా కన్సల్టెన్సీలపైనే ఆధారపడుతున్నాయి. దాంతోపాటు ఆయా సంస్థలు తమ వెబ్‌సైట్లలోనూ పార్ట్‌టైమ్ జాబ్స్ గురించి తెలియజేస్తున్నాయి. కాబట్టి పార్ట్‌టైమ్ విధానంలో పనిచేయాలనుకునే వారు ఆయా కంపెనీల వెబ్‌సైట్లలో పేర్కొన్న అవకాశాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవడం.. సంస్థల హెచ్‌ఆర్ ప్రతినిధులను కలిసి రెజ్యూమె అందజేయడం.. తమకు అనువైన సమయాన్ని సంస్థ ప్రతినిధులకు తెలియజేయడం ద్వారా పార్ట్‌టైమ్ ఉద్యోగావకాశాలు అందిపుచ్చుకోవచ్చు.
ఆన్‌లైన్ టైపింగ్, డేటాఎంట్రీ :
ఆన్‌లైన్ టైపింగ్, డేటా ఎంట్రీ నైపుణ్యాలతో పార్ట్‌టైమ్ జాబ్స్ ఎక్కువగా బీపీఓ, కేపీఓ, మెడికల్ ట్రాన్స్‌క్రిప్షన్ విభాగాల్లో లభిస్తున్నాయి. ఈ సంస్థలు.. తమ క్లయింట్లు పంపించే రికార్డులను ఎంట్రీ చేయడానికి శాశ్వత సిబ్బంది కంటే పార్ట్‌టైమ్ లేదా ఆన్‌లైన్ విధానంలో నియమించుకునేందుకు ప్రాధాన్యమిస్తున్నాయి. పీస్ రేట్ విధానంలో.. ఒక్కో పదానికి రూ.2 నుంచి రూ.5 వరకు పొందొచ్చు. టైమ్ రేట్ విధానంలో.. గంటకు రూ.3 వందల నుంచి రూ.1000 వరకు సంపాదించుకునే అవకాశముంది. ఫ్రీలాన్సర్, ట్రూలాన్సర్ వంటి ఎన్నో సంస్థలు ఆన్‌లైన్ టైపింగ్, డేటాఎంట్రీ అవకాశాలు తెలియజేస్తున్నాయి.
ఆన్‌లైన్/ఫ్రీలాన్స్ యాడ్ పోస్టింగ్ :
ఒక ఉత్పత్తికి సంబంధించిన వివరాలను అడ్వర్టయిజ్‌మెంట్ రూపంలో తీర్చిదిద్ది కమర్షియల్ వెబ్‌సైట్స్‌లో పోస్ట్ చేయడమే.. ఆన్‌లైన్ యాడ్ పోస్టింగ్. ఒక ఉత్పత్తికి సంబంధించిన ఫోటోలు, దానికి సంబంధించిన వివరణ, స్పెసిఫికేషన్స్ గురించి కూడా రాయాల్సి ఉంటుంది. ఈ పార్ట్‌టైమ్ జాబ్ కోసం ఇంగ్లిష్ రైటింగ్ స్కిల్స్ తప్పనిసరి. ప్రస్తుతం క్వికర్, ఓఎల్‌ఎక్స్ తదితర వెబ్‌సైట్లు ఆన్‌లైన్ యాడ్ పోస్టింగ్ పార్ట్‌టైమ్ ఉద్యోగాలు కల్పించడంలో ముందుంటున్నాయి. ఒక్కో యాడ్‌కు రూ.100 నుంచి రూ.150 వరకు ఆదాయం పొందే అవకాశముంది.
సేల్స్ అసోసియేట్ :
సూపర్ మార్కెట్లు, మాల్స్ తదితరాల్లో స్టాక్ వివరాలు నమోదు చేయడం, కస్టమర్లకు సహకరించడం వంటి విధులను సేల్స్ అసోసియేట్ నిర్వర్తించాల్సి ఉంటుంది. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు.. ఏ కోర్సు చదువుతున్న వారైనా సేల్స్ అసోసియేట్‌గా పార్ట్‌టైమ్‌గా పనిచేయొచ్చు. సగటున నెలకు రూ.15 వేలు సంపాదించొచ్చు. ఇందుకు కావల్సిందల్లా తమ స్టోర్‌లోని ఉత్పత్తులను కస్టమర్లు కొనుగోలు చేసేలా ఒప్పించే నైపుణ్యం!
వెయిట్రస్ :
చక్కటి ఆహార్యం, ఎదుటి వారిని మెప్పించేలా మాట్లాడటం, హుందాగా వ్యవహరించే లక్షణాలు ఉంటే.. అమ్మాయిలు రెస్టారెంట్లు, హోటళ్లలో వెయిట్రస్‌గా పార్ట్‌టైమ్ జాబ్ సొంతం చేసుకోవచ్చు. సదరు రెస్టారెంట్‌ను బట్టి నెలకు రూ.20 వేల వరకు సంపాదించే అవకాశముంది. ఈ విభాగంలో అడుగుపెట్టాలంటే.. కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరి. ఈ ఉద్యోగాల కోసం హోటల్స్ స్థానికంగా ఉండే హౌస్ కీపింగ్ సంస్థలను సంప్రదిస్తున్నాయి.
సోషల్ మీడియా అసిస్టెంట్ :
ప్రస్తుతం కార్పొరేట్ సంస్థలు తమ సర్వీసులు, ఉత్పత్తులకు సంబంధించి సమాచారాన్ని ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టాగ్రామ్, లింక్డ్‌ఇన్ తదితర సోషల్ మీడియాలోనూ షేర్ చేసుకుంటున్నాయి. ఆయా సేవలు, ఉత్పత్తులకు సంబంధించిన సమాచారాన్ని సదరు సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో వినియోగదారులను, వీక్షకులను ఆకట్టుకునేలా రాసి షేర్‌చేసే నేర్పు ఉంటే.. సోషల్ మీడియా అసిస్టెంట్స్‌గా పార్ట్‌టైమ్ జాబ్ సొంతం చేసుకోవచ్చు. అభ్యర్థులకు సోషల్ మీడియా రైటింగ్‌పై అవగాహన, ఎస్‌ఈఓ, ఎస్‌ఈఎం, గ్రాఫిక్ డిజైనింగ్ వంటి అంశాల్లో నైపుణ్యం ఉండాలి. పనితీరును బట్టి నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకూ సంపాదించుకునే వీలుంది.
కాపీ రైటర్ :
ఒక సంస్థకు సంబంధించిన కొత్త ప్రొడక్ట్స్, సేవలకు సంబంధించిన వివరాలను క్లుప్తంగా, ఆకట్టుకునేలా రాయడం కాపీ రైటర్స్ ప్రధాన విధి. ప్రస్తుతం పలు సంస్థలు ఆన్‌లైన్ విధానంలో కాపీ రైటర్స్‌ను నియమించుకుంటున్నాయి. ఇందుకోసం జాబ్ పోర్టల్స్‌ను ఆధారంగా చేసుకుంటున్నాయి. టైమ్ రేట్, పీస్ రేట్ ప్రాతిపదికగా రూ.800 నుంచి రూ.వెయ్యి వరకు అందిస్తున్నాయి.
ఆన్‌లైన్ కన్సల్టెంట్ :
ఇటీవల కాలంలో కనిపిస్తున్న సరికొత్త ధోరణి.. ఆన్‌లైన్ కన్సల్టెంట్! కంపెనీల్లో ఉన్నత స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు మొదలు.. టెక్నికల్ పరంగా ప్రోగ్రామింగ్ కోడింగ్ వరకు.. ఆన్‌లైన్ విధానం వైపు మొగ్గు చూపుతున్న పరిస్థితి నెలకొంది. ప్రధానంగా బీటెక్, ఎంటెక్ తదితర కోర్సులు అభ్యసిస్తున్న విద్యార్థులకు ఇది చక్కటి ఆదాయ మార్గంగా నిలుస్తోంది. ఇక్కడ చెల్లించే పారితోషికం కూడా ప్రాజెక్ట్, కేస్ ఆధారంగా రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు ఉంటోంది. బిజినెస్ స్ట్రాటజీస్ కోణంలో రూ.లక్ష వరకు కూడా ఆన్‌లైన్ కన్సల్టెంట్స్‌కు అందిస్తున్నారు.
సెక్యూరిటీ గార్డ్స్ :
నెలకు రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు ఆదాయం అందించే ఉద్యోగం సెక్యూరిటీ గార్డ్. కార్పొరేట్ సంస్థల నుంచి ఏటీఎం సెంటర్ల వరకూ.. ఇప్పుడు సెక్యూరిటీ గార్డ్స్ అవసరం తప్పనిసరిగా మారింది. ఈ ఉద్యోగాల కోసం సంస్థలు.. గుర్తింపు పొందిన సెక్యూరిటీ ఫెసిలిటీస్ సంస్థలను అంటే పోలీస్ శాఖ నుంచి అనుమతి పొందిన సంస్థలను ఆశ్రయిస్తున్నాయి. అభ్యర్థులు ఈ ఫెసిలిటీస్ సంస్థలను ఆశ్రయిస్తే అవకాశం లభించడం ఖాయం.
ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్, ట్రైనర్ :
ప్రస్తుతం చాలామంది ఫిట్‌నెస్ కోసం జిమ్‌లను ఆశ్రయిస్తున్నారు. దాంతో ఇటీవలకాలంలో ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్, ట్రైనర్ పార్ట్‌టైమ్ ఉద్యోగాలకు డిమాండ్ పెరుగుతోంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులు అభ్యసిస్తున్న వారికి ఇది సరైన ఉద్యోగమని చెప్పొచ్చు. పార్ట్‌టైమ్ విధానంలో ఫిట్‌నెస్ ఇన్‌స్ట్రక్టర్, ట్రైనర్‌గా రెండు, మూడు గంటలు పనిచేస్తే.. రోజుకు రూ.500 వరకు సంపాదించే అవకాశముంది.
అఫ్లియేట్ మార్కెటింగ్ :
సొంతంగా వెబ్‌సైట్ ప్రారంభించినవారు.. సదరు వెబ్‌సైట్‌లో ఇతర సంస్థలకు సంబంధించిన వెబ్‌లింక్స్‌ను, ఆ కంపెనీలకు సంబంధించిన ఉత్పత్తులను తమ వెబ్‌సైట్ వీక్షకులకు కనిపించేలా చేయడమే.. అఫ్లియేట్ మార్కెటింగ్!! ఒక విధంగా చెప్పాలంటే.. తమ వెబ్‌సైట్ ద్వారా మరో సంస్థకు మార్కెటింగ్ చేయడాన్నే అఫ్లియేట్ మార్కెటింగ్‌గా పేర్కొనొచ్చు. ఈ విధానంలోనూ నెలకు రూ.20 వేల వరకు సంపాదించే అవకాశముంది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు ఇందుకోసం ప్రత్యేక శిక్షణ కూడా అందిస్తున్నాయి. ఇంజనీరింగ్, టెక్నికల్ కోర్సుల విద్యార్థులు సొంతంగా వెబ్‌సైట్ రూపొందించుకోవడం ద్వారా అఫ్లియేట్ మార్కెటింగ్ విధానంలో కొంత ఆదాయం అందుకోవచ్చు.
ట్యూటర్ జాబ్స్ :
సబ్జెక్ట్‌పై పట్టు.. దాన్ని ఎదుటి వారికి అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే వ్యక్తీకరణ సామర్థ్యం ఉంటే చాలు.. ట్యూటర్ జాబ్ ద్వారా ఆన్‌లైన్/పార్ట్‌టైమ్ మార్గంలో నెలకు రూ.20 వేల వరకు సంపాదించుకోవచ్చు. ఇటీవల కాలంలో హోం ట్యూటర్స్, ఆన్‌లైన్ ట్యుటోరియల్స్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది.
పొలిటికల్ పార్టీల్లో..
ప్రస్తుతం జాతీయంగా, రాష్ట్రాల స్థాయిలోనూ ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న సంగతి తెలిసిందే. ఆయా పార్టీలు నిర్వహించే బహిరంగ సభల్లో నేతలు మాట్లాడాల్సిన అంశాలను రాసివ్వడం.. ఇంటింటికీ తిరిగి వాస్తవ పరిస్థితులు అధ్యయనం చేసి వాటిని నివేదిక రూపంలో ఇవ్వగలిగే యువతకు రాజకీయ పార్టీలు పార్ట్‌టైమ్ అవకాశాలు కల్పిస్తున్నాయి. జాతీయ పార్టీలు, రాష్ట్రాల స్థాయిలో పేరున్న పార్టీలు టిస్, ఢిల్లీ యూనివర్సిటీ తదితర ఇన్‌స్టిట్యూట్‌లలో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ పాలసీ మేనేజ్‌మెంట్ చదువుతున్న అభ్యర్థులను నియమించుకుంటున్నాయి.
పార్ట్‌టైమ్/ఆన్‌లైన్ జాబ్స్..
అన్వేషణ మార్గాలు :

- మొబైల్ యాప్స్
- జాబ్ సెర్చ్ పోర్టల్స్
- ప్రీలాన్సర్ డాట్ కామ్, ట్రూలాన్సర్ డాట్ కామ్
- సంస్థల వెబ్‌సైట్స్
- కన్సల్టెన్సీస్
- కోచింగ్ సెంటర్స్
- సోషల్ నెట్‌వర్క్ సైట్స్ (ప్రధానంగా లింక్డ్ ఇన్)
Published date : 06 Nov 2018 06:25PM