ఒకే అర్హతతో పలు పరీక్షలు.. ముందస్తు ప్రణాళిక ఉంటేనే..
రెండు పరీక్షలకు సంబంధించి ఉమ్మడిగా ఉన్న సిలబస్ అంశాల ప్రిపరేషన్‌ను ముందుగా పూర్తిచేయాలి. ఆ తర్వాత వేర్వేరుగా ఉన్న టాపిక్స్‌పై పట్టు సాధించేలా ముందుకు సాగాలి. ముందుగా ఏ పరీక్ష జరగనుందో.. ఆ పరీక్షకు నెల రోజుల ముందు నుంచి సదరు పరీక్ష సన్నద్ధతకే పూర్తి సమయం కేటాయించాలి. ఇలా.. ఇప్పటి నుంచే పక్కా వ్యూహంతో, నిర్దిష్ట ప్రణాళికతో అడుగులు వేస్తే.. విజయావకాశాలను మెరుగు పరచుకోవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు.
2021–22 ఏపీ జాబ్ క్యాలెండర్.. పోస్ట్‌లు.. నోటిఫికేషన్ వెలువడే నెల..
కేటగిరీ | పోస్టుల సంఖ్య | నోటిఫికేషన్ నెల |
ఎస్సీ,ఎస్టీ, డీఏ బ్యాక్‌లాగ్ పోస్టులు | 1,238 | జూలై 2021 |
ఏపీపీఎస్సీ గ్రూప్–1, గ్రూప్–2 | 36 | ఆగస్టు 2021 |
పోలీసు | 450 | సెప్టెంబర్ 2021 |
డాక్టర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు (వైద్య శాఖ) | 451 | అక్టోబర్ 2021 |
పారామెడికల్, ఫార్మాసిస్టు, టెక్నీషియన్లు | 5,251 | నవంబర్ 2021 |
నర్సులు | 441 | డిసెంబర్ 2021 |
డిగ్రీ కాలేజీ లెక్చరర్లు | 240 | జనవరి 2022 |
వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు | 2,000 | ఫిబ్రవరి 2022 |
ఇతర శాఖల పోస్టులు | 36 | మార్చి 2022 |
మొత్తం 10,143
- ప్రభుత్వం కొత్తగా అనుమతిచ్చిన ఉద్యోగాల సంఖ్య: 1180
ముందస్తు ప్రణాళికే ముఖ్యం..
ఏపీ జ్యాబ్ క్యాలెండర్‌లో.. ఆయా శాఖలకు సంబంధించి నోటిఫికేషన్ వెలువడే నెలను కూడా ముందుగానే ప్రకటించడం అభ్యర్థులకు ఎంతో మేలు చేసే అంశం. ఆ టైమ్ లైన్‌కు అనుగుణంగా అభ్యర్థులు ముందస్తు ప్రణాళికతో ప్రిపరేషన్ సాగించొచ్చు. తాము లక్ష్యంగా ఎంచుకున్న పోస్టులకు సంబంధించి సిలబస్ పరిశీలన, ప్రీవియస్ పేపర్ల అధ్యయనంతో ముందుగా పరీక్ష స్థాయిపై అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత పూర్తి స్థాయి ప్రిపరేషన్‌కు ఉపక్రమించి.. టాపిక్‌వారీగా వెయిటేజీని అనుసరించి అధ్యయనం చేయాలి. ఏ పరీక్ష అయినా ప్రణాళిక, సమయ పాలన ఎంతో ముఖ్యం. ఈ రెండూ ప్రిపరేషన్‌లో ముందంజలో నిలిచేలా చేస్తాయి.
– జి.బి.కృష్ణారెడ్డి, పోటీ పరీక్షల శిక్షణ నిపుణులు
ఇంకా చదవండి: part 1: జ్యాబ్ క్యాలెండర్‌లో.. ప్రతి ఒక్కరికీ అవకాశం..!