నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్
Sakshi Education
పోటీ ప్రపంచం.. రోజుకో కొత్త నైపుణ్యం పొందాల్సిన ఆవశ్యకత. అదే సమయంలో ఉద్యోగాన్వేషణలో సరైన వేదికల గురించి అవగాహన తప్పనిసరి.
ఈ రెండింటి మధ్య సమతుల్యత ఉంటేనే విజయం. ఈ అవకాశాలను కల్పిస్తూ.. ఉద్యోగార్థులకు, యాజ మాన్యాలకు అనుసంధాన వేదికగా నిలుస్తూ.. లక్షల మందికి చేయూతనిస్తున్న నేషనల్ కెరీర్ సర్వీస్ వివరాలు....
కేంద్ర కార్మిక శాఖ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక సదుపాయం నేషనల్ కెరీర్ సర్వీస్ సెంటర్. ఇందులో పేరు నమోదు ద్వారా.. యువత తమ అర్హతలకు సరితూగే.. ఉద్యోగాలను అన్వేషించొచ్చు. అకడమిక్ నేపథ్యానికి సంబంధించి క్షేత్రస్థాయి శిక్షణ తీసుకోవచ్చు.
53 రంగాల్లో..
నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రత్యేకత.. జాతీయ స్థాయిలో 53 రంగాల్లో మూడు వేలకు పైగా వృత్తులకు సంబంధించిన అవకాశాలను చూపడం. యాజమాన్యాలు, ఉద్యోగార్థులు అనుసంధానమయ్యేలా ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తేవడం. ఫలితం.. ఉద్యోగార్థులకు ఇటు ప్రభుత్వ, అటు ప్రైవేటు రంగాల్లోని అవకాశాల గురించి తెలుస్తుంది. అప్పటికేవారు అప్‌లోడ్ చేసిన ప్రొఫైల్‌కు అనుగుణంగా.. అర్హతలకు సరితూగే ఉద్యోగాల జాబితాను కూడా సులువుగా వీక్షించొచ్చు.
ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లతో అనుసంధానం :
నేషనల్ కెరీర్ సర్వీస్ మరో ప్రత్యేకత.. జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల స్థానికత ఆధారంగా సంబంధిత జిల్లా ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌లతో అనుసంధానం చేసేలా డేటాను మేనేజ్ చేయడం. తద్వారా తక్కువ అర్హతలు(ఉదా: పదో తరగతి, ఇంటర్మీడియెట్ తదితర) ఉన్న అభ్యర్థులకు తమ ప్రాంతంలో ఉన్న సంస్థల్లోనే ఉద్యోగం అన్వేషించే అవకాశం.
జాబ్ ఫెయిర్స్...
నేషనల్ కెరీర్ సర్వీస్ ఆధ్వర్యంలో జాతీయస్థాయిలో పలు ప్రాంతాల్లో నిరంతరం జాబ్ ఫెయిర్స్ జరుగుతున్నాయి. ఔత్సాహిక అభ్యర్థులు నేషనల్ కెరీర్ సర్వీస్ ఐడీ ఆధారంగా వీటిలో పాల్గొనొచ్చు. జాబ్‌మేళాకు వచ్చిన కంపెనీల్లో తమ అర్హతలకు సరితూగే సంస్థల ప్రతినిధుల వద్ద నేరుగా జాబ్ అప్లికేషన్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది.
ప్రధానంగా వృత్తి విద్య...
నేషనల్ కెరీర్ సర్వీస్ ప్రస్తుతం అందిస్తున్న సదుపాయాలను పరిగణనలోకి తీసుకుంటే ప్రధానంగా తక్కువ స్థాయి విద్యార్హతల వారిని, వృత్తి విద్య శిక్షణను లక్ష్యంగా చేసుకున్నట్లు చెప్పొచ్చు. నిరుద్యోగ అభ్యర్థులకు శిక్షణ కోణంలో మొత్తం 53 సెక్టార్లలోనూ అధిక శాతం వృత్తి విద్య శిక్షణ (ఉదాహరణకు.. బ్యూటీకేర్, ఇండస్ట్రియల్ పెయింటర్, ఫ్లోరికల్చర్ తదితర) కోర్సులే ఎక్కువగా ఉన్నాయి.
కౌన్సెలింగ్ సదుపాయం :
నేషనల్ కెరీర్ సర్వీస్... కెరీర్ కౌన్సెలింగ్ సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచింది. ఫలితంగా ఈ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకున్న కెరీర్ కౌన్సెలర్ల జాబితాను పరిశీలించి సంప్రదించే అవకాశం ఉంటుంది. వారి ద్వారా సరితూగే ఉద్యోగాలపై, కొత్తగా పొందాల్సిన నైపుణ్యాల గురించి కూడా అవగాహన కల్పిస్తారు.
శిక్షణ సైతం...
నేషనల్ కెరీర్ సర్వీస్ ద్వారా నిరుద్యోగ యువతకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ సదుపాయం కూడా అందుబాటులో ఉంటోంది. అభ్యర్థులు ఎన్‌సీఎస్ వెబ్‌సైట్ ద్వారా తమ ప్రాంతంలోని స్కిల్ ప్రొవైడర్స్ జాబితాను పరిశీలించి ఇష్టమైన అంశంపై ప్రొవైడర్ వద్ద శిక్షణ పొందొచ్చు.
యాజమాన్యాలకూ అనుకూలంగా...
నేషనల్ కెరీర్ సర్వీస్.. ఇటు ఉద్యోగార్థులకే కాకుండా యాజమాన్యాలకు సైతం ఎంతో అనుకూలంగా ఉంటోంది. ముఖ్యంగా చిన్న, మధ్య తరహా సంస్థలకు ఎంతో ఉపయోగపడుతోంది. నేరుగా నియామకాలు చేపట్టే విషయంలో ఎదురయ్యే వ్యయ, ప్రయాసల నుంచి ఉపశమనం కలుగుతోంది. అప్పటికే ఈ సర్వీస్‌లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల ప్రొఫైల్స్‌ను పరిశీలించడం ద్వారా అర్హులైనవారికి నేరుగా ఇంటర్వ్యూలు నిర్వహించి నియామకాలు ఖరారు చేసే సదుపాయం అందుబాటులో ఉంది. దీనివల్ల ఒక ఖాళీని భర్తీ చేసేందుకు ప్రకటన ఇవ్వడం, దానికి స్పందనగా వచ్చే వందల కొద్దీ దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేయడం వంటి వ్యయ ప్రయాసలు తప్పుతాయనేది నిపుణుల అభిప్రాయం.
వినియోగించుకోవడం ఇలా..
నేషనల్ కెరీర్ సర్వీస్ ద్వారా.. వివిధ రంగాల్లోని ఉద్యోగావకాశాల గురించి తెలుసుకోవడం, శిక్షణ తీసుకోవడం వంటి సదుపాయాలు పొందాలంటే అభ్యర్థులు ముందుగా సదరు వెబ్‌సైట్‌లో తమ ప్రొఫైల్‌ను నమోదు చేసుకోవాలి. ఒకసారి వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకున్న అభ్యర్థులు.. తర్వాత అప్‌డేట్ చేసుకునే అవకాశం కూడా ఉంది. పేరు నమోదు తర్వాత నిర్దిష్టంగా ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు.. ఆ ఉద్యోగం, తమను ఇంటర్వ్యూకు ఎంపిక చేసిన సంస్థల జాబితాను కూడా ‘మై ఇంటర్వ్యూస్’ ఆప్షన్‌పై క్లిక్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు.
ఎన్‌సీఎస్ యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్ :
నేషనల్ కెరీర్ సర్వీస్.. ప్రొఫెషనల్ కోర్సుల అభ్యర్థులకు, ఉన్నత విద్యార్హతలున్న వారికి అందిస్తున్న మరో వినూత్న అవకాశం యంగ్ ప్రొఫెషనల్స్ స్కీమ్. ఏటా రెండంచెల ఎంపిక ప్రక్రియలో యంగ్ ప్రొఫెషనల్స్‌ను ఎంపిక చేస్తారు. వీరు డెరైక్టర్ జనరల్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఆధ్వర్యంలో కనీసం ఏడాదిపాటు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ వ్యవధిని మూడేళ్లకు పొడిగించే అవకాశం కూడా ఉంది. యంగ్ ప్రొఫెషనల్స్‌గా ఎంపికైనవారు ఎన్‌సీఎస్ పరిధిలోని మోడల్ కెరీర్ సెంటర్స్‌ను మరింత సమర్థంగా తీర్చిదిద్దడం, జాబ్ మార్కెట్ ట్రెండ్స్‌ను గమనిస్తూ దానికి అనుగుణంగా మోడల్ కెరీర్ సెంటర్స్‌లో మార్పుచేర్పుల గురించి సలహాలు ఇవ్వడం వంటి విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
నమోదు: తొలి స్థానంలో గుజరాత్ ఉంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, పశ్చిమ బెంగాల్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కేరళ ఉన్నాయి. ఎన్‌సీఎస్-ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ అనుసంధానంతో ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్‌ల ద్వారా ఉపాధి పొందిన వారి సంఖ్య 27,600

ఎన్‌సీఎస్‌పై యువతలో అవగాహన పూర్తి స్థాయిలో ఏర్పడలేదు. ఉత్తరాది రాష్ట్రాలు ఈ విషయంలో కొంత ముందంజలో ఉన్నాయి. ఎన్‌సీఎస్ ద్వారా వృత్తి విద్య కోర్సుల్లో శిక్షణ పొందడంతోపాటు ఆన్‌లైన్ విధానంలో ఉద్యోగాన్వేషణ సాగించే అవకాశం లభిస్తుంది. - టి.వి.ఎల్.ఎన్.రావు, ఏటీఐ, హైదరాబాద్. |
Published date : 15 Aug 2017 12:34PM