నేర నియంత్రణకు.. క్రిమినాలజిస్ట్
Sakshi Education
దేశంలో జనాభా పోటెత్తుతోంది. నేరాలు కూడా అదేస్థాయిలో పెరిగిపోతున్నాయి. మరోవైపు తీవ్రవాదం పంజా విసురుతోంది. ఉగ్రవాదం ఉరుముతోంది. వీట న్నింటితో ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతోంది. అంతిమం గా దేశ భద్రతకు ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో నేర నియంత్రణకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవస రం ఏర్పడింది. అందుకే క్రిమినాలజిస్ట్‌లకు డిమాండ్ పెరిగింది. దీన్ని కెరీర్‌గా మార్చుకుంటే.. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు, ఆకర్షణీయమైన ఆదాయం మెండుగా ఉంటాయి. సవాళ్లతో కూడిన ఉత్సాహభరితమైన కెరీర్‌ను ఇష్టపడేవారికి ఇది సరిగ్గా సరిపోతుంది.
బ్యాంకులు, కార్పొరేట్ సంస్థల్లో కొలువులు
క్రిమినాలజిస్ట్‌లు సమాజంలో నేరాలకు గల కారణాలు, నేరస్తుల స్వభావం, నేరాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై పరిశోధనలు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా పోలీసు, న్యాయ వ్యవస్థ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల్లో పనిచేసే సిబ్బందికి శిక్షణ, సెమినార్ల ద్వారా అవగాహన కల్పించాలి. క్రిమినాలజీ కోర్సులను పూర్తిచేసినవారు యూనివర్సిటీ/కాలేజీల్లో లీగల్ స్టడీస్, లా అండ్ సోషియాలజీ, క్రిమినాలజీ ఫ్యాకల్టీగా పనిచేయొచ్చు. నేడు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల కంపెనీలు, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్లు నిపుణులైన క్రిమినాలజిస్ట్‌ల కొరత ను ఎదుర్కొంటున్నాయి. పర్యావరణ నేరాలు, మానవ హక్కుల ఉల్లంఘన వంటి వాటిపై విచారణ జరిపే సంస్థల్లో వీరికి అధిక డిమాండ్ ఉంది. ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు, పరిశోధనా సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. క్రిమినాలజీలో కార్పొరేట్ క్రైమ్, ఎన్విరాన్‌మెంటల్ క్రైమ్ వంటి స్పెషలైజేషన్లు ఉన్నాయి. ఆర్థిక నేరాలను అరికట్టేందుకు బ్యాంకులు, కార్పొరేట్ సంస్థలు కూడా క్రిమినాలజిస్ట్‌లను నియమించుకుంటున్నాయి. కార్పొరేట్ రంగంలో చేరితే అధిక వేతనాలు అందుకోవచ్చు.
కావాల్సిన నైపుణ్యాలు:క్రిమినాలజిస్ట్‌కు విశ్లేషణాత్మక దృక్పథం అవసరం. ప్రతి విషయాన్ని తర్కబద్ధంగా ఆలోచించగలగాలి. డేటా కలెక్షన్, అనాలిసిస్‌పై మంచి పరిజ్ఞానం ఉండాలి. సైకాలజీ, సోషియాలజీపై అవగాహన పెంచుకోవాలి. కష్టపడి పనిచేసే గుణం ఉండాలి. ఒత్తిళ్లు, సవాళ్లను తట్టుకొని పనిచేసే నేర్పు చాలా ముఖ్యం.
అర్హతలు: మన దేశంలో వివిధ విద్యాసంస్థలు క్రిమినాలజీలో అండర్‌గ్రాడ్యుయేట్(బీఏ/బీఎస్సీ), పోస్టుగ్రాడ్యుయేట్(ఎంఏ/ఎంఎస్సీ) కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి. ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్‌లో ఉత్తీర్ణులైనవారు అండర్‌గ్రాడ్యుయేట్ కోర్సులో చేరొచ్చు. ఇందులో ఉత్తీర్ణత సాధించి, పోస్టుగ్రాడ్యుయేషన్‌లో చేరేందుకు అవకాశం ఉంటుంది.
వేతనాలు: క్రిమినాలజిస్ట్‌లు తమ హోదాలను బట్టి వేతనాలు అందుకోవచ్చు. ప్రారంభంలో నెలకు రూ.15 వేల నుంచి రూ.20 వేలు పొందొచ్చు. ఆ తర్వాత పనితీరు, అనుభవం, పదోన్నతుల ద్వారా వేతనంలో పెరుగుదల ఉంటుంది.
కోర్సులను అందిస్తున్న సంస్థలు:

- లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్రిమినాలజీ అండ్ ఫోరెన్సిక్ సైన్స్(ఎన్‌ఐసీఎఫ్‌ఎస్)-న్యూఢిల్లీ
వెబ్‌సైట్: nicfs.nic.in/
- ఆంధ్రా యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
- బెనారస్ హిందూ యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.bhu.ac.in
- లక్నో యూనివర్సిటీ
వెబ్‌సైట్: www.lkouniv.ac.in
- యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్
వెబ్‌సైట్: www.unom.ac.in
Published date : 07 Oct 2014 05:28PM